For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  యూకేలో దారుణ పరిస్థితుల్లో నా సోదరుడు.. హీరోయిన్ మాళవిక కంటతడి

  |

  ప్రాణాంతక వ్యాధి కరోనావైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో బంధాలు, సంబంధాలు చెల్లచెదురైపోయాయి. కుటుంబ సభ్యులు కలుసుకోలేని పరిస్థితి కల్పించింది. గత నెలరోజులకుపైగా తన దగ్గరివారితో గడిపిన దాఖలాలు లేవు. తాజాగా అదే పరిస్థితి దక్షిణాది యువతార మాళవిక మోహనన్‌కు ఎదురైంది. యూకేను కరోనా అతలాకుతలం చేస్తున్న సమయంలో తన సోదరుడు అక్కడే ఉండటంతో మాళవికతోపాటు ఫ్యామిలీ అంతా అందోళనకు గురి అవుతున్నారు. తన సోదరుడి గురించి మాళవిక చెప్పిన విషయాలు ఇవే..

  లండన్‌లో చిక్కుకున్న ఆదిత్య

  లండన్‌లో చిక్కుకున్న ఆదిత్య

  లండన్‌లో చిక్కుకున్న సోదరుడు ఆదిత్య గురించి చెబుతూ.. నా సోదరుడు ఆదిత్య యూకేలో ఆర్కియాలజీ చదువుతున్నారు. కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో అక్కడే చిక్కుకుపోయారు. యూకేలో కరోనా విస్తృతవ్యాప్తి చెందడం, అనేక మరణాలు సంభవించడంతో మా కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ అనిశ్చితి పరిస్థితుల్లో నా సోదరుడి ఆరోగ్యం గురించి విపరీతమైన బెంగ నా తల్లిదండ్రుల్లో నెలకొన్నది అని మాళవిక మోహన్ పేర్కొన్నారు.

  లండన్‌లో ఒంటరిగా

  లండన్‌లో ఒంటరిగా

  నా సోదరుడు ఆదిత్య యూనివర్సిటీ క్యాంపస్‌లో కాకుండా బయట సింగిల్ రూమ్‌ను కిరాయికి తీసుకొని ఉంటున్నాడు. ఆయనతో ఉండే సహచరులంతా వెళ్లిపోయారు. ప్రస్తుతం తను ఒక్కరే ఇంటిలో ఉంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నా సోదరుడు ఎలా ఉంటున్నాడో.. ఎదైనా జరగకూడనిది జరిగితే ఎవరు చూసుకొంటారనే విషయం మమల్ని మానసికంగా కంగారు పెడుతున్నది అని మాళవిక ఆవేదన వ్యక్తం చేశారు.

  బయట ఫుడ్‌ దొరకడం కష్టంగా

  బయట ఫుడ్‌ దొరకడం కష్టంగా

  లండన్‌లో జీవనం చాలా ఖరీదైనది. అయితే డబ్బు ఇప్పుడు విషయమే కాదు. నా సోదరుడికి డబ్బు పంపిస్తున్నాం. కానీ వండుకోవడానికి ఎలాంటి సదుపాయాలు రూమ్‌లో లేవు. రెస్టారెంట్ల నుంచి ఆర్డర్ చేసుకొని తింటున్నాడు. కానీ అలా బయట ఫుడ్ తినడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత క్షేమం కాదు. గత నెలరోజులుగా సరైన ఆహారం లేక ఆరోగ్యం కొంత క్షీణించింది. అదే మాకు ఆందోళన కలిగిస్తున్నది అని మాళవిక చెప్పారు.

  లాక్‌డౌన్ ఎత్తేస్తే

  లాక్‌డౌన్ ఎత్తేస్తే

  ఇక లాక్‌డౌన్ ఎప్పుడు ఎత్తివేస్తారనే విషయంపై అసలే క్లారిటీ లేదు. మే 3 తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. లాక్‌డౌన్ ఎత్తేస్తే ఇంటికి రావాలని చూస్తున్నారు. లండన్‌లోని హై కమిషన్ ఆఫ్ ఇండియాకు ఆదిత్య పలుమార్లు లెటర్స్ రాశాడు. వేలాది మంది కమిషన్‌కు ఫోన్లు చేస్తున్నారు. అయినా వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. నా సోదరుడు ఎంత త్వరగా అక్కడి నుంచి వస్తే అంత మంచిదనే భావనలో ఉన్నాం అని మాళవిక తెలిపారు.

  Chusi Chudangane Movie Public Talk
  మాళవిక మోహనన్ కెరీర్..

  మాళవిక మోహనన్ కెరీర్..

  మాళవిక మోహనన్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయానికి వస్తే.. ఆమె ప్రముఖ సినిమాటోగ్రఫర్ కేయూ మోహనన్ కుమార్తె. 2013లో పట్టామ్ పోల్ అనే మలయాళ చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. కన్నడంలో నన్ను మట్టు వరలక్ష్మీ, హిందీలో బియాండ్ ది క్లౌడ్స్, తమిళంలో పేట్టా నటించారు. త్వరలో విడుదల కానున్నది మాస్టర్, తెలుగులో హీరో చిత్రాల్లో నటించారు.

  English summary
  Mollywood actress Malavika Mohanan concerned about brother Aditya stucked in UK amid Coronavirus. She said that, My brother Aditya is living in rented house in london. No food facilities in his room. That makes mentally stress to us.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X