twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Nedumudi Venu కన్నుమూత.. విషాదంలో ఇండస్ట్రీ..

    |

    సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా కారణంగా ఇప్పటికే తెలుగు సహా దాదాపు అన్ని భాషల ఇండస్ట్రీలో చాలామంది ప్రసిద్ధ కళాకారులు దూరమయ్యారు. తాజాగా ప్రముఖ మలయాళ నటుడు దుమూడి వేణు తుది శ్వాస విడిచారు. ఆ వివరాల్లోకి వెళితే

    ఆదివారం నాడు ఆసుపత్రికి

    ఆదివారం నాడు ఆసుపత్రికి


    కేరళలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ప్రముఖ మలయాళ నటుడు నేదుమూడి వేణు తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. కడుపు సంబంధిత వ్యాధుల కారణంగా నటుడిని ఆదివారం నాడు ఆసుపత్రికి తరలించారు. ఇటీవల, నేదుమూడి వేణు కోవిడ్ -19 నుండి కోలుకున్నారు.

    తుది శ్వాస

    తుది శ్వాస

    మలయాళ నటుడు నేదుమూడి వేణు గత కొన్ని నెలలుగా కడుపు సంబంధిత వ్యాధులతో పోరాడుతున్నాడు. ఆ వ్యాధుల కోసం చికిత్స తీసుకున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అతడిని కేరళ రాజధాని తిరువనంతపురంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ వేణు ఈరోజు (అక్టోబర్ 11) ఉదయం తుది శ్వాస విడిచారు.

    అలా ఎంట్రీ ఇచ్చి

    అలా ఎంట్రీ ఇచ్చి

    కేశవన్ వేణుగోపాల్‌ నటుడుగా మారాక తన స్క్రీన్ నేమ్ ను నేదుమూడి వేణు అని పెట్టుకున్నారు. నేదుమూడి వేణు అనేక దశాబ్దాల కెరీర్‌లో 500 కి పైగా చిత్రాలలో నటించారు. నటనతో పాటు, వేణు అనేక చిత్రాలకు స్క్రీన్ ప్లే కూడా రాశారు. ఒక చిత్రానికి దర్శకత్వం వహించారు.

    అవార్డుల పంట

    అవార్డుల పంట

    నేదుమూడి వేణు అసాధారణమైన నటనకు గాను మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు మరియు ఆరు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు కూడా గెలుచుకున్నారు. ఇక కెరీర్ మొదట్లో థియేటర్‌ లో తన వృత్తిని ప్రారంభించిన వేణు చివరికి సినిమాల్లోకి ప్రవేశించాడు. ఆయన మలయాళంలో చేసిన కొన్ని ప్రసిద్ధ చిత్రాలలో మార్గం, విడపరాయుమ్ మున్పే, థేమవిన్ కొంబత్, ఓరు మిన్నమినుగ్గింటే నురుంగుబెట్టం, తన్మాత్రం, ఉత్తర 24 కాథం, థానియే, లాంటి సినిమాలు ఉన్నాయి.

    తమిళంలో

    తమిళంలో

    ఆయన 1995 లో జ్ఞాన రాజశేఖరన్ రూపొందించిన మొగముల్ చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలో ప్రవేశించారు. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన శంకర్ యొక్క 1996 బ్లాక్ బస్టర్ ఇండియన్ లో సిబిఐ ఆఫీసర్‌గా తన పాత్రకు గుర్తింపు పొందాడు. అలాగే శంకర్ డైరెక్షన్ లో వచ్చిన అపరిచితుడు సినిమాలో విక్రమ్ తండ్రి పాత్రలో నటించి మెప్పించారు. ఇక వేణు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇండియన్ 2 కోసం కూడా ఎంపికయ్యాడు.

    చివరిగా

    చివరిగా


    ఆయన మృతికి మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తో సహా అనేక మంది మాలీవుడ్ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన చివరిగా నెట్ ఫ్లిక్స్‌లో ప్రసారమయిన నవరసలోను కనిపించారు. ఆ వెబ్ సిరీస్‌లో భాగం అయిన ''సమ్మర్ ఆఫ్ 92''లో వేణు నటించారు. ఆ భాగానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. అలాగే ఆయన మోహన్ లాల్ హీరోగా వస్తున్నా ''మరక్కార్: అరబికడలింటే సింహం''లో నటించారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. వేణు మృతిపై మలయాళ చిత్ర పరిశ్రమతో పాటు దక్షిణాది నటులు విచారం వ్యక్తం చేశారు.

    Read more about: nedumudi venu
    English summary
    Malayalam Actor Nedumudi Venu passes away in a private hospital in kerala.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X