For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  గుండె నొప్పితో ఆస్పత్రిలో చేరిన మరో సీనియర్ నటుడు.. వెంటిలేటర్ సపోర్ట్ తో పోరాటం!

  |

  ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అంగమలీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇటీవల గుండె నొప్పికి గురైనట్లు తెలుస్తోంది. ఆ కారణంగా ఆయన ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చారు. మార్చి 30న ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. యాంజియోగ్రామ్ పరీక్షలో ట్రిపుల్ వెస్సెల్ వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. ఆ తర్వాత వైద్యులు వెంటనే మార్చి 31న అతనికి బైపాస్ సర్జరీ చేశారు.

  ప్రస్తుతం శ్రీనివాసన్ సన్నిహితులు అభిమానులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా శ్రీనివాస్ ఆరోగ్యంపై అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఎలాంటి తప్పుడు వార్తలను నమ్మకూడదు అని వైద్యులు క్లారిటీ ఇచ్చేవరకు అభిమానులు సన్నిహితులు కాస్త ఓపికతో ఉండాలి అని కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. దర్శకుడిగా మలయాళం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రీనివాస్ ఆ తర్వాత నటుడిగా మారారు. ఎంతో హాస్యభరితమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందారు. అలాగే ఇతర ఇండస్ట్రీలో కూడా అప్పుడప్పుడూ ఆయన కనిపించే ప్రయత్నం చేశారు.

   Malayalam actor Sreenivasan is on ventilator support latest health update

  మలయాళం ఇండస్ట్రీలో చాలా మంది సినీ ప్రముఖులకు ఆయన మొదట అవకాశం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తన దగ్గర పనిచేసిన ఎంతో మంది సహాయక దర్శకులకు కూడా ఆయన సపోర్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. శ్రీనివాసస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా కొన్ని సినిమాలకు వర్క్ చేయడం జరిగింది. తెలుగు తమిళ్ హిందీ సినిమాలు మలయాళంలో విడుదల అయినప్పుడు వాటిని ఎక్కువగా శ్రీనివాసన్ డబ్బింగ్ చెప్పి మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసే వారు.

  వడుక్కునొక్కియంత్రం, సందేశం, మజాయేతుమ్ మున్పే, చింతావిష్టాయ శ్యామల, ఉదయాను తారం, కథా పరాయణం, మాకంటె అచ్చన్, ప్యాసింజర్, నాడోడికట్టు, మరియు వెల్లనకలుదే నాడు వంటి అనేక చిత్రాలకు పనిచేశారు. ఇక ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వినీత్ శ్రీనివాసన్ పెద్ద కుమారుడు, ప్రసిద్ధ రచయిత, నేపథ్య గాయకుడు డబ్బింగ్ కళాకారుడు కూడా. ధ్యాన్ శ్రీనివాసన్, అతని చిన్న కుమారుడు నటుడిగా కొనసాగుతున్నాడు.

  ఇక శ్రీనివాసన్ హఠాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని మళ్ళీ ఇండస్ట్రీలో చురుగ్గా పాల్గొనాలని ఇప్పటికే సోషల్ మీడియాలో కొంతమంది సినీ ప్రముఖులు ట్వీట్ చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం వైద్యులు ఆయనను మళ్లీ మామూలు స్థితిలోకి తీసుకు వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న ట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే శ్రీనివాసన్ ఆరోగ్యపరిస్థితిపై అఫీషియల్ గా అప్డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం. గత వారం ఛాతీలో నొప్పి రావడంతో ఈ నటుడు ఆసుపత్రిలో చేరారు. యాంజియోగ్రామ్ పరీక్షలో, 66 ఏళ్ల నటుడు ట్రిపుల్ నాళాల వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడైంది, ఆ తర్వాత అతను బైపాస్ సర్జరీ చేయించుకున్నాడు అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇక శస్త్రచికిత్స అనంతరం వెంటిలేటర్‌కు తరలించారు. అయితే, వెంటిలేటర్ నుండి మారిన తర్వాత, శ్రీనివాసన్‌కు ఇన్‌ఫెక్షన్ ఉందని, ఇప్పుడు అతనికి మళ్లీ వెంటిలేటర్ సపోర్ట్ అందించామని వారు తెలిపారు.

  English summary
  Malayalam actor Sreenivasan is on ventilator support latest health update
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X