Don't Miss!
- News
Vallabhaneni Vamsi : ఆ ఇద్దరు టీడీపీ నేతలపై వల్లభనేని వంశీ పరువునష్టం దావా ..
- Finance
SBI: లోన్ తీసుకుంటే వడ్డీ డిస్కౌంట్.. అబ్బా SBI బలే ఆఫర్.. పూర్తి వివరాలు
- Technology
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- Automobiles
సీరియల్స్ చేస్తూ ఖరీదైన బెంజ్ కారు కొనేసి రూపాలి గంగూలీ.. ధర ఎంతో తెలుసా?
- Sports
INDvsNZ : హార్దిక్ తెలివిగా ఆడాడు.. కెప్టెన్‌ను మెచ్చుకున్న మాజీ లెజెండ్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
- Lifestyle
Chanakya Niti: జీవితంలో ఈ సుఖాలు అనుభవించాలంటే మంచి కర్మలు చేసుండాలి, అవేంటంటే..
Malayalam Actress abduction case పోలీసుల హత్యకు కుట్ర.. సినీ హీరో దిలీప్‌పై సంచలన ఆరోపణలు
మలయాళ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌పై దాడి కేసులో స్టార్ హీరో దిలీప్‌పై జరుగుతున్న విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. దాంతో ఈ కేసును కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ క్రమంలో దిలీప్‌తోపాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరికొందరి బెయిల్ పిటిషన్‌ను రద్దు చేయాలని, వారికి బెయిల్ ఇవ్వకుండా చూడాలని పోలీసులు సంచలన ప్రకటన చేశారు. ఈ కేసులో బయటపడిన సంచలన విషయం ఏమిటంటే..

సాక్ష్యులను బెదిరిస్తూ..
నటి కిడ్నాప్, దాడి కేసులో సినీ హీరో దిలీప్ చట్టం కోరల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. సాక్ష్యులను ప్రభావితం చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ సంపాదించిన 20 మంది సాక్ష్యులు ఆయనకు అనుకూలంగా వ్యవహరించే ప్రమాదం ఉంది. ఆయనపై నమోదైన రెండు క్రిమినల్ కేసుల్లో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు కుట్ర పన్నుతున్నారు అని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పేర్కొన్నారు.

విచారణ ముమ్మరంగా
నటిపై దాడి, కిడ్నాప్ కేసులో విచారణ, దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్నది. నటుడు దిలీప్‌కు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలను సేకరించాం. పిటిషనర్లకు బెయిల్ పొందే హక్కు లేదు. కాబట్టి ఈ కేసు కీలక దశలో ఉంది. కాబట్టి శుక్రవారం జరిగే విచారణ సందర్భంగా వారికి బెయిల్ ఇవ్వకుండా చూడాలని కోర్టును పోలీసులు అభ్యర్థించారు.

విచారణ అధికారి హత్యకు కుట్ర
2015 నవంబర్ 15వ తేదీన నటుడు దిలీప్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దర్శకుడు బాలచంద్రకుమార్ ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేశాం. నటిపై దాడి, అత్యాచారం కేసులో విచారణ జరుపుతున్న విచారణ అధికారి బైజు పాలోస్, సూపర్‌వైజర్ ఆఫీసర్లను చంపడానికి ప్రయత్నించారు. ఈ కేసులో విచారణ అధికారుల ప్రాణాలకు ముప్పు ఉంది అని కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు.

సాక్ష్యం చెప్పడానికి భయపడుతూ
నటిపై లైంగిక దాడి కేసులో నటుడు దిలీప్‌పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. కానీ ఈ కేసులో ముందుకు వచ్చి సాక్ష్యాలు చెప్పడానికి కొందరు భయపడుతున్నారు. కాీన ఓ వ్యక్తి కోర్టు ముందుకు వచ్చి దిలీప్ కుట్రను బయటపెట్టేందుకు సాహసిస్తున్నారు. సాక్ష్యులపై కూడా దాడి చేసేందుకు పిటిషనర్లు ప్రయత్నిస్తున్నారు అనే విషయాలను పోలీసులు బయటపెట్టారు.
Recommended Video

దిలీప్ సన్నిహితుడిపై పోలీసులు
కేరళలో సంచలనం రేపిన నటిపై దాడి కేసులో కొందరు తప్పించుకు తిరుగుతున్నారనే విషయాలపై క్లారిటీ ఇచ్చారు. దిలీప్ సన్నిహితుడు సూర్య ట్రావెల్స్ అధినేత శరత్ జీ నాయర్ కూడా కుట్రలో భాగమయ్యారు. ఆయన రైడ్స్ జరిగినప్పుడు వ్యాపార నిమిత్తం ఊటికి వెళ్లారు. ప్రస్తుతం కేరళలోని అలువాలోని తన నివాసంలో ఉన్నారు.
విచారణకు హాజరయ్యేందుకు సిద్దంగా ఉన్నారు అంటూ ది కాంట్రాక్ట్ క్యారేజ్ ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రతినిధి తెలిపారు.