Don't Miss!
- News
మహారాష్ట్రలో బీఆర్ఎస్ గాలి..: ఏం చేశాయంటూ కాంగ్రెస్, బీజేపీలపై కేసీఆర్ ఫైర్
- Sports
డోపింగ్ టెస్టులో ఫెయిలైన భారత జిమ్నాస్ట్.. క్షమాపణలు చెప్పిన క్రీడాకారిణి!
- Lifestyle
Super Brain Yoga: సూపర్ బ్రెయిన్ యోగా, దీంతో ఎన్నో ఉపయోగాలున్నాయ్.. తెలుసా?
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Mammootty కి చేదు అనుభవం.. ఆనంద సమయంలో అలాంటి షాక్
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టికి చేదు అనుభవం ఎదురైంది. సినీ పరిశ్రమలోకి ప్రవేశించి 50 ఏళ్లు పూర్తి చేసుకొన్నాననే ఆనందంలో ఉన్న ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయడం అభిమానులకు షాక్ తగలింది. మమ్ముట్టి భారతీయ సినిమా పరిశ్రమలోకి ప్రవేశించి ఆగస్టు 9వ తేదీకి ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకొన్నాయి. ఈ క్రమంలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని కేరళ పోలీసులు ఆయనకు షాక్ ఇచ్చారు. ఈ వివాదంలోకి వెళితే...
సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. క్యాన్సర్‌తో పోరాడుతూ యువ నటి మృతి

ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో
సూపర్ స్టార్ మమ్ముట్టి మరో నటుడు రమేశ్ పిశారోడీ ఆగస్టు 3వ తేదీన కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. రోబో యంత్రాల సహాయంతో మోకాళ్ల మార్పిడి సర్జరీకి సంబంధించిన వేడుకలో పాల్గొన్నారు. మమ్ముట్టి రాకతో అభిమానులు, సాధారణ ప్రజలు భారీగా తరలివచ్చారు. కోవిడ్ కేసులు రాష్ట్రంలో తీవ్రంగా పెరిగిపోతున్న నేపథ్యంలో హాస్పిటల్ యాజమాన్యం నిబంధనలు ఉల్లంఘించిందనే ఆరోపణలపై హాస్పిటల్ నిర్వాహకులు, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిపై కేరళ పోలీసులు కొరడా ఝళిపించారు.
50 years of Mammootty: మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ వైరల్.. అదిరిపోయిన మమ్ముట్టి రిప్లై

కేరళ ఎపిడెమిక్ డీసీస్ యాక్ట్ ప్రకారం
రాష్ట్రంలో అమలు అవుతున్న కోవిడ్ నిబంధనలు పాటించనందుకు గాను ఆయనపై కేసు నమోదు చేశారు. కేరళలో అమలు అవుతున్న కోవిడ్ 19 ప్రొటోకాల్స్ ఉల్లంఘించారనే కారణంపై కేరళ ఎపిడెమిక్ డీసీస్ యాక్ట్, 2021, 4, 5, 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో ఈ వివాదం మరింత జటిలమైంది.
Vidyullekha Raman.. బికినీలో విద్యుల్లేఖ రామన్.. మందు గ్లాసుతో రచ్చ రచ్చ!

కోవిడ్-19 ప్రోటోకాల్స్ ఉల్లంఘన
సూపర్ స్టార్ మమ్ముట్టిపై దాఖలు చేసిన కేసుపై పోలీసులు స్పందించారు. మమ్ముట్టి, రమేస్ పిషారోడి, మరో 300 మందిపై కేసు నమోదు చేశాం. కోజికోడ్‌కు సమీపంలోని హాస్పిటల్‌లోని మెడికల్ విభాగం ప్రారంభోత్సవంలో కోవిడ్-19 ప్రోటోకాల్స్ ఉల్లంఘించారు. ఆ ప్రారంభోత్సవానికి హాజరైన సంఖ్యను మోతాదుకు మించి ఉండటం, అది కాకుండా కరోనావైరస్ నివారణ చర్యలు పాటించకపోవడం మా దృష్టికి వచ్చింది అని కేరళ పోలీసులు వెల్లడించారు.
Vidyullekha Raman.. బికినీలో విద్యుల్లేఖ రామన్.. మందు గ్లాసుతో రచ్చ రచ్చ!

హాస్పిటల్ వర్గాలు బాధ్యతారాహిత్యంగా
మమ్ముట్టి పాల్గొన్న కార్యక్రమంలో 300 లకు పైగా ప్రజలు పాల్గొన్నారు. కేరళలో కేసు సంఖ్య పెరుగుతున్నదనే విషయం తెలిసి కూడా హాస్పిటల్ వర్గాలు అజాగ్రత్తగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాయి. ఇందుకు బాధ్యులైన ఎండీ, సీవోవీ, ఇతరులపై కేరళ ఎపిడమిక్ డిసీస్ యాక్ట్ ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కేసు నమోదు చేశాం అని కేరళ పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ కేసుపై సూపర్ స్టార్ మమ్ముట్టి ఇంకా స్పందించలేదు.
HBD Mahesh Babu సూపర్‌స్టార్ పర్సనల్ ఫొటోలు: నమ్రతతో రొమాంటిక్‌గా.. మీరెన్నడూ చూడని పిక్స్ ఇవే!
Recommended Video

మమ్ముట్టి సినీ కెరీర్ ఇలా..
మమ్ముట్టి కెరీర్ విషయానికి వస్తే.. డైరెక్టర్ కేఎస్ సేతు మాధవన్ దర్శకత్వంలో వచ్చిన అనుభవంగళ్ పాలిచకల్ చిత్రం ద్వారా 1971లో సినీ రంగంలోకి ప్రవేశించారు. కేవలం మలయాళ చిత్ర పరిశ్రమకే పరిమితం కాకుండా, తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషా చిత్రాల్లో అద్భుతంగా నటించి పాపులారిటిని సొంతం చేసుకొన్నారు. విలక్షణ నటుడిగా మమ్ముట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకొన్న మమ్ముట్టి.. ప్రస్తుతం షైలాక్, ఏజెంట్, వన్, ది ప్రీస్ట్ చిత్రాల్లో నటించారు. భీష్మ పర్వం చిత్రం షూటింగ్ దశలో ఉంది.