అలా దారుణంగా వేధింపులు.. శ్రీరెడ్డి తరహాలో యువ నటి సంచలన ఆరోపణలు.. తెలుగు దర్శకుడిపైనా పోస్ట్

దక్షిణాది సినీ ప్రముఖులపై మలయాళ నటి రేవతి సంపత్ సంచలన ఆరోపణలు చేశారు. తనను శారీరకంగా, మానసికంగా వేధించారంటూ ఆరోపిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్అయింది. దాదాపు 14 మందిని నోటికి చెప్పలేని విధంగా దూషించారనే విషయం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నటి రేవతి చేసిన పోస్టులో ఏమున్నదంటే...

సినీ ప్రముఖులతోపాటు 14 మందిపై

సినీ ప్రముఖులతోపాటు 14 మందిపై

దక్షిణాది మీడియాలో రేవతి వ్యవహారం అత్యంత చర్చనీయాంశంగా మారింది. సినీ ప్రముఖులతోపాటు ఓ డాక్టర్‌ను, సబ్ ఇన్స్‌పెక్టర్, డీవైఎఫ్ఏ నేత నందు అశోకన్ పేర్లతోపాటు మొత్తం 14 మందిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. దీంతో ఒక్కసారిగా మలయాళ చిత్ర పరిశ్రమ ఓ కుదుపుకు లోనైంది.

సెక్సువల్‌గా, మానసికంగా వేధింపులు

సెక్సువల్‌గా, మానసికంగా వేధింపులు

రేవతి ఫేస్‌బుక్‌లో రాస్తూ.. ఇందులో నేను కొందరు ప్రొఫెషనల్ క్రిమినల్స్, వ్యక్తిగతంగా, అలాగే సైబర్ స్పేస్‌లోని కొందరు ప్రొఫెషనల్స్‌ పేర్లను వెల్లడించాలనుకొంటున్నారు. వాళ్లు నన్ను సెక్సువల్‌గా, మానసికంగా, మాటలతో, ఎమోషనల్‌గా నన్ను నా జీవితాన్ని చిధ్రం చేశారు అంటూ రేవతి తన పోస్టులో పేర్కొన్నారు.

రేవతి విప్పిన చిట్టా వీరిదే

రేవతి విప్పిన చిట్టా వీరిదే

నటి రేవతి తాను పోస్టు చేసిన పోస్టులో టాలీవుడ్ దర్శకుడు, బంగారు తల్లి ఫేమ్ రాజేశ్ టచ్ రివర్, మలయాళ నటుడు సిద్దిఖీ, మలయాళ నటుడు ఏఆర్ సిజ్జు, షార్ట్ ఫిలిం డైరెక్టర్ మాక్స్‌వెల్ జోష్, కేరళ ఫ్యాషన్ లీగ్ వ్యవస్థాపకుడు అభిల్ దేవ్, డాక్టర్ అజయ్ ప్రభాకర్, సమాజంలోని ఇతర ప్రముఖులు ఎంఎస్ పదుష్, సురభ్ కృష్ణన్, నందు అశోకన్, పోలీస్ ఇన్స్‌పెక్టర్ భిను తదితరులు ఉన్నారు.

పబ్లిక్ స్టంట్ కోసమేనా అంటూ ట్రోలింగ్

సోషల్ మీడియాలో రేవతి చేసిన పోస్టు ఒక్కసారిగా వైరల్ అయింది. అయితే చాలా మంది ఆమె పోస్టుపై స్పందిస్తూ పబ్లిక్ స్టంట్ కోసమే ఇలా చేశావా అని ప్రశ్నించారు. అయితే తనపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పడానికి తనపై వేధింపులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొంటానని చెప్పారు.

Recommended Video

OTT లో Latest Telugu Movies | Zombie Reddy రిలీజ్ ఇన్ Aha
మరోసారి వివాదంలో నటుడు సిద్ధిఖీ

మరోసారి వివాదంలో నటుడు సిద్ధిఖీ

నటుడు సిద్దిఖీపై నటి రేవతి ఆరోపణలు చేయడంతో మరోసారి వివాదంగా మారింది. మాలీవుడ్‌లో గతంలో సంచలనం రేపిన ఓ నటిపై వేధింపుల కేసులో సిద్ధిఖీ కూడా ఆరోపణలు ఎదుర్కోవడం తెలిసిందే. తాజాగా రేవతి కూడా ఆయన పేరు బయటపెట్టడంతో మలయాళ పరిశ్రమ మళ్లీ వివాదంలో చిక్కుకున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయితే రేవతి ఆరోపణలపై సినీ ప్రముఖులు, ఇతరులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X