»   » పీరియడ్ డ్రామా ‘కమ్మర సంభవం’తో సిద్ధార్థ్ మాలీవుడ్ ఎంట్రీ

పీరియడ్ డ్రామా ‘కమ్మర సంభవం’తో సిద్ధార్థ్ మాలీవుడ్ ఎంట్రీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళం, తెలుగు, హిందీ బాషల్లో పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సౌత్ యాక్టర్ సిద్దార్థ్ త్వరలో మాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. 'కమ్మర సంభవం' అనే మలయాళ చిత్రం ద్వారా ఆయన కేరళ అభిమానులను అలరించబోతున్నారు.

ఈ చిత్రంలో దిలీప్‌ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, రితీశ్‌ అంబట్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదొక పీరియడ్ డ్రామా. కొన్ని రియల్ లైఫ్ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో సిద్ధార్థ్ సైనికుడి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.

Siddharth debut in Malayalam cinema with Kammara sambhavam

బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ది ఇండియన్ ఇండిపెండెంట్ లీగ్ అనే పొలిటికల్ ఆర్గనైజేషన్ కీలకమైన పాత్ర పోషించింది. దీని నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది.

ఈ సినిమా గురించి సిద్దార్థ్ మాట్లాడుతూ.... కథ వినగానే చాలా నచ్చింది. ఇదే నా తొలి మలయాళ చిత్రం అని ఫిక్స్‌ అయ్యా. దర్శక, నిర్మాతలు మూడేళ్ల క్రితమే ఈ కథ నాకు చెప్పారు. ఈ సినిమా కోసం చాలా పరిశోధనలు చేశారు. ఈ సినిమా కోసం మలయాళం నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. తొలి సినిమాకే డబ్బింగ్‌ చెప్పాలి అనుకోవడం లేదు' అన్నారు.

2012 సంవత్సరంలోనే తనకు మలయాళ హిట్‌ మూవీ 'ఉస్తద్‌ హోటల్‌'లో అవకాశం వచ్చిందని, అప్పుడు వేరే కారణాల వల్ల సినిమాలో నటించలేదు, అందులో అవకాశం వదులుకోవడం తన దురదృష్టమని తెలిపారు సిద్ధార్థ్.

English summary
Actor Siddharth on Monday unveiled a new poster revealing the name of the character he plays in the upcoming Malayalam film Kammarasambhavam. The beautiful poster has a military rucksack that holds an identity card of a member Indian Independence League. And the name on it reads Othenan Nambiar, above the photograph of Siddharth, in an army fatigue.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X