యాంకర్‌పై లైంగిక వేధింపులు.. యువ హీరో అరెస్ట్.. డ్రగ్స్ మత్తులో అలాంటి చేష్టలా?
మలయాళ సినీ పరిశ్రమలో నటుడు దిలీప్ లైంగిక వేధింపులు, అత్యాచార ప్రయత్నం ఘటన మరిచిపోక ముందే .. మరో సంఘటన సంచలనం రేపింది. యూట్యూబ్‌కు ఇంటర్వ్యూ ఇ్చే సమయంలో జర్నలిస్టు, యాంకర్‌ను లైంగిక వేధింపులకు గురిచేశాడనే ఆరోపణలపై నటుడు శ్రీశాంత్ భాసీని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ ఘటన మాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఈ ఘటన, శ్రీనాథ్ భాసీ వివరాల్లోకి వెళితే..

మోహన్ లాల్, జయప్రదతో కలిసి
శ్రీనాథ్ భాసీ వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాల్లోకి వెళితే.. రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించారు. 2011లో మోహన్ లాల్, అనుపమ్ ఖేర్, జయప్రద నటించిన చిత్రంతో నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. సినిమాల్లోకి రాక ముందు త్రివేండ్రమ్‌కు చెందిన క్రైస్తవ మతానికి చెందిన ప్రబోధనల సంస్థకు చెందిన క్రిమ్సన్ వుడ్ బ్యాండ్‌తో గాయకుడిగా పనిచేశాడు.

కపేలా, ఉస్తాద్ హోటల్ చిత్రాల్లో
శ్రీనాథ్ నటుడిగా ఇప్పుడిప్పుడే రాణిస్తున్నారు. ఆయన నటించిన చిత్రాలకు మంచి ప్రేక్షకాదరణ లభించడమే కాకుండా భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆయన నటించిన కపేలా, ఉస్తాద్ హోటల్, కుంబలంగి నైట్స్, వైరస్ తదితర చిత్రాలకు మంచి పేరు వచ్చింది. ఈ చిత్రాల్లో ఆయన నటనపై సినీ విమర్శకులు ప్రశంసలు గుప్పించారు.

జర్నలిస్టుతో అసభ్య ప్రవర్తన
నటుడిగా మంచి పేరు సంపాదించుకొంటున్న శ్రీనాథ్ భాసీని ఓ జర్నలిస్టు గతవారం ఇంటర్వ్యూ చేసింది. ఆయన నటించిన ఛట్టాంబి అనే సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో యాంకర్‌తో అసభ్యంగా ప్రవర్తించాడు. అభ్యంతరకరమైన భాషతో యాంకర్‌ను ఇబ్బంది పెట్టారు. శ్రీనాథ్ చేష్టలను పసిగట్టిన జర్నలిస్టు వెంటనే షూట్‌ను ఆపివేయమని కెమెరామెన్‌కు చెప్పడం తాజా వైరల్ అయిన వీడియోలో స్పష్టంగా కనిపించింది. దాంతో శ్రీనాథ్ తీవ్ర ఇబ్బందుల్లో పడిపోయాడు.

శ్రీనాథ్ భాసీ అరెస్ట్.. బెయిల్
తనతో అసభ్యంగా ప్రవర్థించిన శ్రీనాథ్ భాసీపై జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు వెంటనే స్పందించి ఆయనను సెప్టెంబర్ 25న అరెస్ట్ చేశారు. ఆయనపై ఐపీసీ సెక్షన్ 354ఏ, 294 బీ, 509 సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఆ మరుసటి దినం బెయిల్‌పై శ్రీనాథ్ విడుదలయ్యాడు.

బహిరంగ క్షమాపణలు చెప్పిన శ్రీనాథ్
బెయిల్‌పై రిలీజైన శ్రీనాథ్ భాసీ యాంకర్‌కు బహిరంగ క్షమాపణలు చెప్పారు. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేయడంతో తన తప్పును ఒప్పుకొన్నాడు. తొలుత తనపై నిరాధార ఆరోపణలు చేశారు. తనను ఈ కేసులో ఇరికించారని చెప్పిన ఆయన తన తప్పును ఒప్పుకొని క్షమాపణలు కోరుకొన్నాడు.

డ్రగ్స్ సేవించారా? అనే కోణంలో
జర్నలిస్టు, యాంకర్‌తో అసభ్యంగా ప్రవర్తించిన కేసు పక్కన పడితే.. ఆ ఇంటర్వ్యూ సమయంలో డ్రగ్స్ మత్తులో ఉన్నాడనే ఆరోపణలు మీడియాలో షికారు చేస్తున్నాయి. ఈ సమయంలో మత్తు పదార్థాలు, డ్రగ్స్ తీసుకొన్నాడా? లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన గోళ్లు, వెంట్రుకలు, రక్త నమూనాలను ఇటీవల సేకరించారు. ఆల్కాహాల్ టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టులకు సంబంధించిన రిపోర్టులు త్వరలోనే రానున్నాయి.


Click it and Unblock the Notifications