యాంకర్‌తో అసభ్య ప్రవర్తన.. యువ హీరోపై వేటు.. నిర్మాత మండలి సంచలన నిర్ణయం!

మలయాళ సినిమా పరిశ్రమలో ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌కు చెందిన జర్నలిస్టు, యాంకర్‌తో నటుడు శ్రీనాథ్ భాసీ అసభ్యకర ప్రవర్తన వివాదంపై రచ్చ జరుగుతున్నది. మలయాళంలో శ్రీనాథ్ భాసీ చట్టాంబి సినిమా ప్రమోషన్‌లో శ్రీనాథ్ భాసీ వ్యవహరించిన తీరుపై యాంకర్ ఫిర్యాదు చేయడం.. ఆ తర్వాత నటుడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వ్యవహారంపై బాధితురాలు, యాంకర్ మీడియాతో మాట్లాడుతూ..

అసభ్య ప్రవర్తనతో బాధపడ్డా

అసభ్య ప్రవర్తనతో బాధపడ్డా


నటుడు శ్రీనాథ్ అసభ్య ప్రవర్తనపై తనకు తీవ్రమైన ఆగ్రహం కలిగింది. అయితే క్షమాపణలు చెబుతాడేమో అని ఆయనకు చాలా సమయం ఇచ్చాను. ఆయన క్షమాపణ కోసం రెండు రోజులు వేచి చూశాను. కానీ శ్రీనాథ్ క్షమాపణలు చెప్పడానికి నిరాకరించారని తెలిసి ఆయనపై ఫిర్యాదు చేశాను అని యాంకర్ వెల్లడించింది.

 క్షమాపణల కోసం ఎదురు చూశా

క్షమాపణల కోసం ఎదురు చూశా


అయితే నా ఫిర్యాదుతో శ్రీనాథ్‌ను అరెస్ట్ చేశారు. మరుసటి దినం బెయిల్ బయటకు వచ్చిన తర్వాత తనకు వ్యతిరేకంగా పరిస్థితులు ఉండటం గ్రహించాడు. తన పేరు ప్రతిష్టలు దెబ్బ తింటున్నాయని, తన కుటుంబానికి ఇబ్బందికరంగా ఉందని గ్రహించాడు. ఆ తర్వాత తనకు క్షమాపణలు చెప్పాడు అని యాంకర్ ఓ ప్రశ్నకు సమాధానం చెప్పింది.

 నిర్మాతల మండలి చురుకుగా

నిర్మాతల మండలి చురుకుగా


ఇదిలా ఉండగా, యాంకర్‌తో అసభ్యంగా ప్రవర్తించిన వ్యవహారంలో కేరళ నిర్మాతల మండలి చురుకుగా వ్యవహరించింది. ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీనాథ్ భాసీతో నిర్మాతల మండలి వివరణ తీసుకొన్నది. అలాగే బాధితురాలు, యాంకర్‌ను కలిసి ఆమె వివరణను నిర్మాతల మండలి తీసుకోవడం జరిగింది.

శ్రీనాథ్ భాసీపై అనధికార నిషేధం

శ్రీనాథ్ భాసీపై అనధికార నిషేధం


అనంతరం నటుడు శ్రీనాథ్ భాసీ అసభ్యప్రవర్తనపై కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది. కొత్తగా వచ్చే ప్రాజెక్టుల్లో ఆయనకు ఆఫర్లు ఇవ్వవద్దని నిర్ణయం తీసుకొన్నారు. ఇప్పటికే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదు. తదుపరి చిత్రాల్లో ఆయనను తీసుకోకూడదు అని నిర్మాతల మండలి సంచలన నిర్ణయం తీసుకొన్నది.

డ్రగ్స్ కోణంలో దర్యాప్తు ముమ్మరం

డ్రగ్స్ కోణంలో దర్యాప్తు ముమ్మరం


యాంకర్‌తో ఇంటర్యూ సమయంలో లైంగిక వేధింపులకు పాల్పడినట్టు వచ్చిన నేపథ్యంలో శ్రీనాథ్ భాసీ డ్రగ్స్ తీసుకొన్నట్టు అనుమానాలు వచ్చాయి. దాంతో డ్రగ్స్ మత్తులో ఉన్నాడా? లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి.. గోళ్లు, వెంట్రుకలు, రక్త నమూనాలు సేకరించారు. త్వరలోనే డ్రగ్స్ వినియోగించాడా అనే కోణంలో రిపోర్టు రానున్నది. ఒకవేళ డ్రగ్స్ తీసుకొన్నారంటే.. ఈ కేసు మరింత తీవ్రతరం కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X