»   » చరిత్ర వీడ్కోలు పలకదు: శ్రీదేవి మరణంపై ప్రియా వారియర్ (ట్రిబ్యూట్ వీడియో)

చరిత్ర వీడ్కోలు పలకదు: శ్రీదేవి మరణంపై ప్రియా వారియర్ (ట్రిబ్యూట్ వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu
చరిత్ర వీడ్కోలు పలకదు: శ్రీదేవి మరణంపై ప్రియా వారియర్ (ట్రిబ్యూట్ వీడియో)

ఇంటర్నెట్ సంచలనంగా మారిన ప్రియా వారియర్ శ్రీదేవి మరణంపై ఓ ట్రిబ్యూట్ వీడియో విడుదల చేశారు. పాటపాడుతూ నివాళి అర్పించారు. తన అభిమాన నటీమణుల్లో శ్రీదేవి ఒకరని, ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అని ప్రియా వారియర్ వెల్లడించారు.

ఆ సినిమా పాట పాడుతూ

ఆ సినిమా పాట పాడుతూ

ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్‌ జోహార్‌ మూవీ ‘కభి అల్విదా నా కెహనా' చిత్రంలోని ‘తుమ్‌ కభి హై ఖబర్‌ ముఝ్ కో భి.. హో రహా హే జుదా..' పాటను ఆలపిస్తూ శ్రీదేవికి నివాళులర్పించారు ప్రియా వారియర్.

చరిత్ర ఎప్పుడూ వీడ్కోలు పలకదు

‘చరిత్ర ఎప్పుడూ వీడ్కోలు పలకదు.. కేవలం తర్వాత కలుద్దాం అని మాత్రమే చెబుతుంది' అంటూ ప్రియా వారియర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె ‘కభి అల్విదా నా కెహనా' చిత్రంలోని పాట పాడటం గమనార్హం. ‘కభి అల్విదా నా కెహనా' అంటే ఎప్పుడూ వీడ్కోలు చెప్పొద్దు అని అర్థం.

దిగ్భ్రాంతిలో ప్రియా వారియర్

దిగ్భ్రాంతిలో ప్రియా వారియర్

శ్రీదేవి మరణంతో ప్రియా వారియర్ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె భౌతికంగా మన మధ్య లేక పోయినా అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుందని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్ చేశారు.

 శ్రీదేవి అంత్యక్రియలు

శ్రీదేవి అంత్యక్రియలు

శ్రీదేవి భౌతిక కాయానికి బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు అంత్యక్రియలు జరుగనున్నాయి. మంగళవారం రాత్రి దుబాయ్ నుండి శ్రీదేవి భౌతిక కాయం ముంబైలోని లోఖండ్ వాలా, గ్రీన్ ఏకర్స్ లోని ఆమె స్వగృహానికి చేరుకోవడంతో సినీ ప్రపంచం మొత్తం అక్కడికి చేరుకుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ కి చెందిన పలువురు నటీనటులు ఆమెను కడసారి చూసేందుకు తరలివచ్చారు.

ప్రజల సందర్శనార్ధం సెలబ్రేషన్స్ క్లబ్ వద్ద

ప్రజల సందర్శనార్ధం సెలబ్రేషన్స్ క్లబ్ వద్ద

బుధవారం ఉదయం శ్రీదేవి భౌతిక కాయాన్ని ముంబై లోఖండ్ వాలా ప్రాంతంలోని గ్రీన్ ఏకర్స్ లో ఉన్న నివాసం నుంచి సెలబ్రేషన్స్ క్లబ్ కు తరలించారు. ఇక్కడ భౌతికకాయాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్ధం ఉంచనున్నారు. 2 గంటలకు శ్రీదేవి అంతిమయాత్ర మొదలు కానుంది. విల్లేపార్లలోని హిందూ స్మశాన వాటికలో శ్రీదేవిని ఖననం చేయనున్నారు.

English summary
After the news of Sridevi's death surfaced, tributes started pouring in for her from fans and friends from the industry alike. Internet sensation, Priya Prakash Varrier, took to Twitter to pay a tribute to Sridevi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu