Just In
- 5 min ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 42 min ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 1 hr ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 2 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- News
కల్నల్ సంతోష్ బాబుకు మహవీర్ చక్ర పట్ల తండ్రి అసంతృప్తి, గర్వంగా ఉందంటూ భార్య సంతోషి
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Sports
టీమిండియాను బలమైన జట్టుగా ఆయనే తీర్చిదిద్దాడు: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్
- Automobiles
ఇంటర్నేషల్ మార్కెట్లలో బజాజ్ పల్సర్ మోటార్‌సైకిళ్లకు భలే డిమాండ్!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వర్తమానం సినిమాకు సెన్సార్ నిరాకరణ.. రాజకీయాలు చేస్తున్నారంటూ అధికారులపై నిర్మాత ఆగ్రహం
దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనను కథా నేపథ్యంగా తెరకెక్కించిన వర్తమానం సినిమాకు సెన్సార్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ బ్రేకులు వేసింది. అభ్యంతరకరమైన సన్నివేశాలున్నాయనే ఆరోపణలపై సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించినట్టు తెలిసింది.
టాలెంటెడ్ యాక్టర్ పార్వతి తిరువోత్ ప్రధాన పాత్రలో వర్తమానం చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సిద్దార్థ శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేరళ నుంచి పీహెచ్‌డీ చేయడానికి ఢిల్లీలోని జేఎన్‌యూ క్యాంపస్‌కు వెళ్లిన సందర్భంగా ఆమె జీవితంలో చోటుచేసుకొన్న సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
వర్తమానం సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించడంపై నిర్మాత, స్క్రిప్టు రైటర్, కాంగ్రెస్ నేత ఆర్యదన్ షౌకత్ స్పందించారు. కారణాలు చెప్పకుండా సర్టిఫికెట్ నిరాకరించారని ఆయన ఆరోపించారు. ఈ సినిమాను రివైజింగ్ కమిటీకి పంపించామని సీబీఎఫ్‌సీ అధికారులు చెప్పరాని పేర్కొన్నారు.

డిసెంబర్ 31వ తేదీలోపు సీబీఎఫ్‌సీ సర్టిఫికెట్ ఇవ్వకపోతే.. ఎలాంటి అవార్డులకు పంపడానికి వీలుండదు. కేవలం రాజకీయ కారణాలతోనే సినిమాను అడ్డుకొంటున్నారు అని షౌకత్ ఆరోపించారు.
వర్తమానం సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరించినట్టు బోర్డు సభ్యుడు వీ సందీప్ కుమార్ చేసిన ట్వీట్‌ను షౌకత్ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో షేర్ చేశారు.