X
తెలుగు » సినిమాలు » ఎక్స్ ప్రెస్ రాజా
ఎక్స్ ప్రెస్ రాజా

ఎక్స్ ప్రెస్ రాజా

Romance | 14 Jan 2016 | U |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

ఎక్స్ ప్రెస్ రాజా స్టోరీ

ఎక్స్ ప్రెస్ రాజా సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శర్వనంద్, సురభి, హరిష్ ఉత్తమన్, ఊర్వషి, సప్తగిరి, సుప్రీత్, శకలక శంకర్, ప్రభాస్ శ్రీను, దువ్వసి మోహన్, నాగినీడు తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మేర్లపాకా గాంధి నిర్వహించారు మరియు నిర్మాతలు వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు పవన్ లక్కరాజు స్వరాలు సమకుర్చరు.  కథ వైజాగ్‌లో బేవార్స్‌గా తిరిగే రాజా (శర్వానంద్), అతని ఫ్రెండ్ (ప్రభాస్ శ్రీను)లకు హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ కాంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తాడు పోలీస్ ఆఫీసర్ పోసాని. వీరిద్దరు బేవార్స్ అయిన తెలిసానా రాజా తండ్రి (నాగినీడు)పై ఆ పోలీస్ అధికారికి గల అభిమానంతో వారికి ఉద్యోగం ఇప్పిస్తాడు. హైదరాబాద్ లో అమూల్య (సురభి) ప్రేమలో పడతాడు రాజా. రాజాకు కుక్కలంటే అస్సలు పడదు. అమూల్య తన కుక్కని ప్రాణంగా పెంచుకుంటుంది. రాజా ప్రేమను అమూల్య అంగీకరించే సమయంలో కుక్క తప్పిపోతుంది. వాస్తవానికి ఆకుక్కను రాజాయే మున్సిపాలిటీ వాళ్లు పట్టిస్తాడు. దీంతో చాలా డిస్ట్రబ్ అయిన అమ్యూల్య కుక్కని తిరిగి తెచ్చిస్తేనే ప్రేమిస్తాను అని తేల్చి చెబుతుంది. కుక్కను వెతికే ప్రయత్నం మొదలు పెట్టిన రాజా... మరికొందరు కూడా అదే కుక్క కోసం వెతకడం చూసి ఆశ్చర్య పోతాడు. ఈ క్రమంలో కథ ఆసక్తికరంగా సాగుతుంది. అసలు ఆ కుక్క కోసం అంత మంది ఎందుకు వెతుకుతున్నారు? రాజా ప్రేమను ఎలా గెలుచుకున్నాడు అనేది తెరపై చూడాల్సిందే.
Read More

ఎక్స్ ప్రెస్ రాజా కాస్ట్ & క్రూ

ఎక్స్ ప్రెస్ రాజా సిబ్బంది సమాచారం

దర్శకత్వం మేర్లపాక గాంధీ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ప్రవీణ్ లక్కరాజు
నిర్మాత వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఎక్స్ ప్రెస్ రాజా విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఎక్స్ ప్రెస్ రాజాకి కార్తీక్ ఘట్టమనేని కెమెరా, ప్రవీణ్ లక్కరాజు పాటలు జె.బి. నేపథ్య సంగీతం బాగా కుదిరాయి. సినిమాటోగ్రఫీ బావుంది. సినిమా ఫస్టాఫ్ వినోదాత్మకంగా ఉంది. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ కాస్త నిరాశ పరిచింది. స్క్రీన్ ప్లే పెద్దగా ఆకట్టుకోలేదు. పాత్రలు ఎక్కువగా ఉండటం, సినిమా వేగంగా రన్ చేయడం వల్ల కొన్ని పాత్రల్లో స్పష్టత కొరవడింది. కొన్ని కామెడీ సీన్లు ఓవర్ అనిపించాయి.

ఎక్స్ ప్రెస్ రాజా సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఎక్స్ ప్రెస్ రాజా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+