X
తెలుగు » సినిమాలు » జాగ్వార్
జాగ్వార్

జాగ్వార్

Action | Romance | 06 Oct 2016 |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

జాగ్వార్ స్టోరీ

జాగ్వార్ సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు  నిఖిల్ గౌడ, దీప్తి సతి, జగపతి బాబు, రమ్యకృష్ణ, సుమలత్,  రఘుబాబు, బ్రహ్మానందం, సంపత్, అదిత్యమీనన్, భజ్రంగ్ లోకేష్, అవినాష్, వినాయక్ జోషి, రావు రమేష్, సుప్రీత్ రెడ్డి, ప్రశాంత్ తదితరులు నటించారు. ఈ సినిమాకి స్క్రీన్‌ప్లే – మాటలు – దర్శకత్వం: ఎ మహదేవ్‌ నిర్వహించారు మరియు నిర్మాత హెచ్ డి కుమారస్వామి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు యస్ యస్ థమన్ స్వరాలు సమకుర్చరు.  కథ మెడిసిన్ చదవే... ఎస్.ఎస్.కృష్ణ (నిఖిల్ కుమార్) పగలు సరదా ప్రపంచం. రాత్రిళ్లు జాగ్వార్ గా మారి మర్డర్స్ చేసే వేరే ప్రపంచం. సిటీలో పేరున్న ఓ టీవీ ఛాన‌ల్‍నే హ్యాక్ చేసి, మాస్క్ వేసుకొని పలు హత్యలు చేస్తూ అవి లైవ్‌లో వచ్చేలా చేస్తూంటాడు. అది సంచలనంగా మారుతుంది...ఇంతకీ హ్యాక్ కు గురి అయ్యే...ఆ ఛానెల్ ఎవరిదీ అంటే..ఎన్నో వ్యాపారాలు ఉన్న ప్రముఖ వ్యాపార వేత్త శౌర్య ప్రసాద్‌ (సంపత్‌ రాజ్‌)., తన బిజినెస్ లను కాపాడుకునేందుకు ఎస్ ఎస్ టివి అనే న్యూస్ చానల్ ను కంచెలా పెట్టుకుని నిర్వహిస్తుంటాడు. తన టీవీ టీఆర్పీలు పెంచుకునేందుకు ఎలాంటి పనికైనా సిద్ధపడే సంపత్ ఛానల్ ను ఓ ముసుగు మనిషి(నిఖిల్ గౌడ) హ్యాక్ చేసి ఓ మర్డర్ ను లైవ్ టెలికాస్ట్ చేయటంతో షాక్ అవుతాడు. ముసుగు వేసుకుని మన హీరో చేసే లైవ్ లో ఓ జడ్జి(ఆదిత్యా మీనన్ ) ని మర్డర్ చేస్తాడు. ఆ ముసుగు వ్యక్తిని పట్టుకునే బాధ్యత సిబిఐ ఆఫీసర్ జెబి(జగపతిబాబు)కి అప్పగిస్తారు. తను డీల్ చేయబోయే ఆ కేసుకు ఆ మర్డర్ చేసిన వ్యక్తికి జాగ్వర్ అని పేరు పెట్టుకుంటాడు జెబి. మరోవైపు మన హీరో మెడికల్‌ కాలేజీలో మాత్రం చాలా హుషారైన కుర్రాడు. తన సీనియర్లని కూడా ఆట పట్టిస్తూ ఉంటాడు. తనతో పాటు చదువుతున్న ప్రియ(దీప్తి)ని ప్రేమిస్తాడు. ఎస్‌.ఎస్‌ ఛానల్‌ అధినేత శౌర్య ప్రసాద్‌ (సంపత్‌ రాజ్‌). విద్య.. వైద్యాన్ని వ్యాపారాలుగా చూస్తాడు. ఆయనకి సంభందించిందే ఆ కాలేజ్. తనని తాను అనాథగా పరిచయం చేసుకొని శాంతి మెడికల్ కాలేజ్ లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ గా జాయిన్ అయిన మన హీరో ... అదే కాలేజిలో ఫైనల్ ఇయర్ చదివే సిన్సియర్ స్టూడెంట్ ఆర్యతో ఫస్ట్ రోజునుంచే గొడవ పడతాడు. అదే సమయంలో ఆర్య.., కాలేజ్ లో, హాస్పిటల్ లో జరిగే అన్యాయాల మీద పోరాటం మొదలు పెడతాడు...తన కాలేజీలో జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా ఆర్య (అవినాష్‌) అనే విద్యార్థి గళం ఎత్తితే... దాంతో ఆర్యని అడ్డు తొలగించుకోవాలని భావిస్తాడు శౌర్య ప్రసాద్‌. ఎన్‌కౌంటర్‌ శంకర్‌ (కాట్రాజు)ని దింపి చంపించే ప్రయత్నం చేస్తాడు. ఆ పోలీస్‌ ఆఫీసర్‌నీ జాగ్వార్‌ చంపేస్తాడు..ఈలోగా జాగ్వార్‌కి సంబంధించిన ఓ కీలకమైన సమాచారం సీబీఐ ఆఫీసర్‌ జగపతిబాబు కి అందుతుంది. అదేంటి? ఆ జాగ్వార్‌.. ఈ కృష్ణ ఒక్కడేనా..? ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనేదే ‘జాగ్వార్‌' కథ. కృష్ణ ఇలా హత్యలు చేయడానికి గల కారణం ఏంటి? ఆ హత్యలన్నింటినీ లైవ్‌లో ఎందుకు ప్రదర్శిస్తూంటాడు? ఈ కథలో రామ చంద్రయ్య (రావు రమేష్), రమ్యకృష్ణ పాత్రలు ఏమిటి.... ప్రియ (దీప్తి సతి) ప్రేమ వ్యవహాం ఏమైంది? అన్న ప్రశ్నలకు సమాధానమే సినిమా. కేసును డీల్ చేస్తున్న జెబి జాగ్వర్ ను పట్టుకున్నాడా..? అన్నదే మిగతా కథ.
Read More

జాగ్వార్ కాస్ట్ & క్రూ

జాగ్వార్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం మహాదేవ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం తమన్ యస్
నిర్మాత హెచ్ డి కుమారస్వామి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

జాగ్వార్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
విజియేంద్ర ప్రసాద్ ...ఇచ్చిన కథ, కథనమే ఈ సినిమాకు మైనస్ గా మారాయని చెప్పాలి. తమిళ దర్శకుడు శంకర్ డైరక్షన్ లో వచ్చే అపరిచితుడు, జెంటిల్ మెన్ తరహాలో హీరో..వేరే వ్యక్తిగా మర్డర్స్ చేస్తూ సమాజంలో చీడ పురుగులను తొలిగించే కార్యక్రమం చేపట్టడం, అతనికో భారీ ప్లాష్ బ్యాక్ ఉండటం, చివరల్లో భారీ క్లైమాక్స్ లో హీరో రివీల్ అవటం జరుగుతూంటుంది. అలాంటి కథే ఇది. దాంతో చాలా సార్లు చూసిన కథే ఇది అనిపిస్తుంది.

జాగ్వార్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

జాగ్వార్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+