»   » చెవుల్లో పువ్వులు పెట్టుకున్నవాళ్లకు చెప్పండి...అవన్నీ అంటున్నారు

చెవుల్లో పువ్వులు పెట్టుకున్నవాళ్లకు చెప్పండి...అవన్నీ అంటున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బెంగళూరు : కొన్ని వింటూంటే నమ్మబుద్ది కాదు..కానీ నిజమే అని చెప్తూంటారు. హీరో తొలి చిత్రం, ఇప్పటికి కేవలం ట్రైలర్ మాత్రమే రిలీజైంది. అయితేనేం తొలి టిక్కెట్ 10 లక్షలకు అమ్ముడుపోతోంది. ఈ సినిమా టిక్కెట్ల కోసం టీమ్ కు తెగ ఫోన్స్ వస్తున్నాయని, లక్ష రూపాయలు పైగా ఒక టిక్కెట్ కోసం ఖర్చు పెట్టడానికి సిద్దంగా ఉన్నామని చెప్తున్నారట.

  అయితే ఊహించని విధంగా వ్యక్తి పది లక్షలు ఇచ్చి తొలి టిక్కెట్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ అని కొందరు కొట్టిపారేస్తున్నారు. మరికొందరు అయితే ఇందులో వింతలేదు హీరో తండ్రి,తాతలకు ఉన్న పలుకబడి అలాంటిది అని చెప్తున్నారు.


  పూర్తి విరాల్లోకి వెళితే... ఇపుడెక్కడ చూసిన 'జాగ్వర్'.. ఎవ్వరినోట విన్నా 'జాగ్వర్'. మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ మంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ తెరంగేట్రం చేస్తోన్న చిత్రం 'జాగ్వార్'.


  మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామి నిర్మాతగా ఆయన తనయుడితో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన జాగ్వార్ చిత్రంపై శాండల్‌వుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి చిత్రంతో తన నటన, స్టంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో నిఖిల్‌కుమార్ గౌడ భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు.


   పోటీ పడి మరీ ఫ్యాన్స్

  పోటీ పడి మరీ ఫ్యాన్స్

  అక్టోబర్ మొదటి వారంలో విడుదల కానున్న ఆయన నటించిన జాగ్వార్ చిత్రం టికెట్ల కోసం చిత్ర యూనిట్ నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో టికెట్ల కోసం అభిమానులు పోటీ పడ్డారు. ఈ విషయం కన్నడ పరిశ్రమలోనే కాక అంతటా హాట్ టాపిక్ గా మారింది. కొత్త హీరోకు ఇంత డిమాండా అని ఆశ్చర్యపోతున్నారు.   అయితే ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు

  అయితే ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు


  మైసూరుకు చెందిన లోకేశ్ అనే వ్యక్తి అత్యధికంగా రూ. పది లక్షలకు జాగ్వార్ సినిమా మొదటి టికెట్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచారం.
  దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చిత్రం విడుదల రోజున టికెట్‌ను సొంతం చేసుకున్న వ్యక్తి పేరును వెల్లడించనున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు.  ఆశ్చర్యమే మరి

  ఆశ్చర్యమే మరి


  కాగా కొత్త నటుడి మొదటి చిత్రం టికెట్ కోసం ఇంత పోటీ నెలకొనడం చాలా ఆశ్చర్యంగా ఉందని చిత్ర సహ నిర్మాత ఒకరు తెలిపారు. పది లక్షల రూపాయలు కేవలం రజనీకాంత్ వంటి హీరోల తొలి టిక్కెట్ కు పలికిందంటే అర్దం ఉంది కానీ ఇలా ... అసలు ఎలా చేస్తాడో...ఏం చేస్తాడో తెలియని కొత్త హీరో కోసం ఖర్చు పెట్టాలనుకోవటం ఆశ్చర్యమే అంటున్నారు.  ఇదో స్ట్రాటజీ

  ఇదో స్ట్రాటజీ  వార్తల్లో నిలవటానికి కేవలం ఆ సినిమాకు చెందిన వారి వ్యక్తే పది లక్షలు పెట్టి తీసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ఒక సినిమా కూడా రిలీజ్ కాకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం ఎలా సాధ్యమని, అంత డబ్బు ఎందుకు ఖర్చు ఎందుకు పెడతారని, హీరో ఫ్యామిలీకి తెలిసున్న వాళ్ల ద్వారా పది లక్షల బిడ్ చేయించి ఉంటారంటున్నారు.  16 దేశాల్లో రిలీజ్

  16 దేశాల్లో రిలీజ్  తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సుమారు 16 దేశాలలో వెయ్యికి పైగా స్క్రీన్లలో విడుదల చేస్తున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు. ఇదీ ఒక రికార్డే. ఎందుకంటే కొత్త హీరో సినిమాని కబాలి రేంజిలో రిలీజ్ చేస్తున్నారు. కేవలం సూపర్ స్టార్స్ సినిమాలకే ఇలాంటి బారీ రిలీజ్ దక్కుతూంటుంది.   ఇంతకు ముందు తెలుగులో చేసినవాడే

  ఇంతకు ముందు తెలుగులో చేసినవాడే


  ఇక ఈ చిత్రం దర్శకుడు కన్నడ పరిశ్రమకు కొత్తేమో కానీ తెలుగులో ఇంతకు ముందు సినిమా చేసినవాడే. బాలయ్యతో మిత్రుడు సినిమా చేసిన మహదేవ్..ఆ సినిమా పరాజయంతో మరో సినిమా చేయలేదు. తన గురువు విజయేంద్రప్రసాద్ అండతో ఈ కన్నడ చిత్రం చేస్తున్నారు. ఆయన రాజమౌళి దగ్గర చాలా కాలం పనిచేసిన అసోశియేట్.  తమన్నా ని చూపెట్టి ఇక్కడ

  తమన్నా ని చూపెట్టి ఇక్కడ

  భారీ బడ్జెట్ తో రూపొందుతోన్నబ‌హుభాషా చిత్రం ‘జాగ్వార్ సినిమాలో తమన్నా ఒక స్పెషల్ సాంగ్ చేసింది. ఇది మన తెలుగు వాళ్లలో మరింతగా ఆసక్తిని పెంచుతోంది. రీసెంట్ గా ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ ను తమన్నా పూర్తి చేసింది. హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో తమన్నా - నిఖిల్ కుమార్ జంటపై గత ఈ స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించారు. తాజాగా ఈ సాంగ్ చిత్రీకరణతో షూటింగ్ పార్టును పూర్తిచేశారు.   ఇంత బడ్జెట్టా , నోరు వెళ్లబెట్టకండి

  ఇంత బడ్జెట్టా , నోరు వెళ్లబెట్టకండి


  ఇప్పటికే తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్, అఖిల్ లాంటి హీరోలు అలా భారీ బడ్జెట్ సినిమాలతో పరిచయమయ్యి నష్టపోయారు. ఈ ఇద్దరు హీరోలు పరిచయం అయ్యింది దాదాపు 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలతోనే. ఇప్పుడు ఈ రికార్డ్ లన్నింటినీ బ్రేక్ చేస్తూ తన తొలి సినిమాకే 75 కోట్ల బడ్జెట్ తో బరిలో దిగుతున్నాడు ఈ యంగ్ హీరో.   మామూలోడు కాదు

  మామూలోడు కాదు


  మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు అయిన నిఖిల్ కుమార్ జాగ్వర్ సినిమాతో హీరోగా పరిచయం అవుతూండటంతో కర్ణాటకలో ఓ రేంజిలో ఆసక్తి నెలకొని ఉంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను 75 కోట్ల రూపాయలతో తెరకెక్కించటంతో జనాల్లో అంత ఖర్చేమి పెట్టారు అనేది మరో అంశం.   రికవరి అవుతుందా

  రికవరి అవుతుందా


  ఎక్కువ భాగం విదేశాల్లో చిత్రీకరించిన జాగ్వర్ యాక్షన్ సీన్స్ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు వర్క్ చేసారు. కన్నడ మార్కెట్ పరంగా చూస్తే మాత్రం ఇంత భారీ బడ్జెట్ చాలా పెద్ద రిస్క్ అన్న టాక్ వినిపిస్తోంది. అయితే తెలుగులో కూడా భారీ ఎత్తున విడుదల చేయటం ప్లస్ అవుతోంది.   బాహుబలి రైటర్ కథతో...

  బాహుబలి రైటర్ కథతో...


  బాహుబలి, భజరంగీ బాయిజాన్ లాంటి సినిమాలకు కథ అందించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విజయేంద్ర ప్రసాద్, ఈ సినిమాకు కథ అందిస్తుండగా, బాలకృష్ణ హీరోగా మిత్రుడు సినిమాను తెరకెక్కించిన మహదేవ్ దర్శకత్వం వహించటం తెలుగు మార్కెట్ కు ఎస్సెట్ గా నిలుస్తాయి.   కథ ఎంత పెట్టి కొన్నారంటే

  కథ ఎంత పెట్టి కొన్నారంటే


  ఇక ఈ చిత్రం కథకు ఓ స్టార్ హీరో సినిమా స్టోరీకు ఇచ్చినంత రెమ్యునేషన్ ఇచ్చి అందరకీ షాక్ ఇచ్చారు. ఆ మొత్తం 75 లక్షలు అని తెలుస్తోంది. బాహుబలి చిత్రం రైటర్ కు ఆ మాత్రం రెమ్యునేషన్ లేకపోతే ఎలా అనుకున్నారో ఏమో కానీ తెలుగువాళ్లు గర్వపడేంత రెమ్యునేషన్ అది.   మీరు నమ్మలేనంత పబ్లిసిటీ ఖర్చు

  మీరు నమ్మలేనంత పబ్లిసిటీ ఖర్చు


  ఇక ఈ చిత్రం పబ్లిసిటీకి ఎంత ఖర్చు పెడుతున్నారో తెలిస్తే కళ్లు తిరుగుతాయి. అక్షరాలా ఏడు కోట్ల రూపాయలు ఈ చిత్రం పబ్లిసిటీ కోసం ఖర్చు పెడుతున్నారు. కుమార స్వామి ఎంత ఖర్చైనా ఫరవాలేదు. కానీ అందరూ మన సినిమా గురించే మాట్లాడుకోవాలని అని నిర్ణయించుకునే డబ్బుని నీళ్లలా పోస్తున్నారు.   ఇక్కడా రాజీపడలేదు

  ఇక్కడా రాజీపడలేదు


  ఎన్నో సూపర్‌డూపర్‌ హిట్‌ చిత్రాలకి మ్యూజిక్‌ చేసిన సక్సెస్‌ఫుల్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ ఈ చిత్రానికి ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ని అందించారు. రామ జోగయ్య శాస్త్రి ఈ చిత్రంలో అన్ని పాటల్ని ఒకదాన్ని మంచి మరొకటి అద్భుతంగా వుండేలా రాశారు.  పొలిటికల్ పవర్ ని సైతం.,,,

  పొలిటికల్ పవర్ ని సైతం.,,,


  ఇక ఆడియో ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మానికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేటీఆర్ హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ భాషాభేదాలతో సంబంధం లేకుండా ప్రతిభను ప్రోత్సహించడంలో తెలుగు ప్రజలు ముందుంటారన్నారు. జాగ్వార్ ట్రైలర్, పాటల్లో నిఖిల్ పడిన కష్టం కనిపిస్తుందని పేర్కొన్నారు. తాతగారు దేవెగౌడ, అమ్మానాన్నల పేరును నిఖిల్ నిలబెట్టుతాడనే నమ్మకముందని తెలిపారు.  rn

  ట్రైలర్ తోనే అంచనాలు రెట్టింపు


  రీసెంట్ గా ఈ చిత్రం తెలుగు ట్రైలర్ ని విడుదల చేసారు. ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు. మహదేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో జగపతి, రమ్యకృష్ణ లాంటి స్టార్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. తమన్నా ఓ ఐటమ్ సాంగ్‌లో కనిపించనుండడం ఈ సినిమాకు అంచనాలను పెంచింది.  ఏం సెట్స్ రా బాబూ...


  ఈ చిత్రంలో హీరోగా దీప్తి సతి నటించగా ముఖ్య పాత్రలో జగపతి బాబు, రమ్యకృష్ణ లు కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి సాంగ్ టీజర్ విడుదల చేశారు. ఇందులో భారీ సెట్స్ కనిపిస్తోండగా, నిఖిల్ వేసే స్టెప్పులు అభిమానులని అలరిస్తున్నాయి. మరి తాజాగా విడుదల చేసిన సాంగ్స్ పై మీరు ఓ లుక్కేయండి.   అందుకే తమన్నా వెంటనే ఓకే

  అందుకే తమన్నా వెంటనే ఓకే

  ఈ సినిమాలో ఓ ఐటం సాంగ్ కోసం జాగ్వర్ యూనిట్ శృతిహాసన్ ను కలిసింది. కాని శృతి టైమింగ్స్ కుదరవని, చేయలేనని సున్నితంగా చెప్పింది . ఒక్కపాట చేస్తే రెండు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తామని శృతికి చెప్పారు అయినా శృతిహాసన్ ఒప్పుకోలేదు. శృతి హాసన్ వదిలేసిన ఈ బిగ్ ఆఫర్ తమన్నాను వరించింది. ఒక పాటకు రెండు కోట్లంటే మాటలు కాదు. తమన్నా తెలివిగా...వెంటనే ఒప్పేసుకుని చేసేసింది.  rn

  పంచ్ డైలాగులు గట్టిగా...

  తన కుమారుడిని స్టార్ హీరోగా చేయాలనే ఉద్దేశంతో స్వయంగా కుమారస్వామే రంగంలోకి దిగి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హాలీవుడ్ తరహాలో ఉండేలా ఈ మూవీని రూపొందిస్తున్నారట. దర్శకుడు మహదేవ్ ప్రతి ఫ్రేమును చాలా అందంగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలై మంచి క్రేజ్ ని క్రియేట్ చేసింది.  తెర వెనక, ముందు

  తెర వెనక, ముందు

  జగపతిబాబు, రఘుబాబు, బ్రహ్మానందం, సంపత్‌, ఆదిత్యమీనన్‌, భజ్రంగ్‌ లోకేష్‌, అవినాష్‌, వినాయక్‌ జోషి, ప్రశాంత్‌, సుప్రీత్‌ రెడ్డి, రావు రమేష్‌, రమ్యకృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి సమర్పణ: హెచ్‌.డి. కుమారస్వామి, కథ: విజయేంద్ర ప్రసాద్‌, సినిమాటోగ్రఫి: మనోజ్‌ పరమహంస, మ్యూజిక్‌: యస్‌.యస్‌. థమన్‌, ఆర్ట్‌: నారాయణరెడ్డి, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, ఫైట్స్‌: రవివర్మ, రామ్‌-లక్ష్మణ్‌, కలోయాన్‌ (బల్గేరియా), సెల్వ, కో డైరెక్టర్‌: అమ్మినేని మాధవసాయి, నిర్మాత: శ్రీమతి అనితా కుమారస్వామి, స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: ఎ. మహదేవ్‌.  English summary
  Nikhil Kumar is getting unprecendent attention with his debut Jaguar. The newcomer has created a huge buzz in Sandalwood and already has a crazy fan following. The team of Jaguar has been receiving continuous calls from people who are ready to buy that first ticket at a high price. While a few are ready to pay a lakh for one ticket, Lokesh from Mysuru is bidding for 10 lakh.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more