X
తెలుగు » సినిమాలు » కిట్టు ఉన్నాడు జాగ్రత్త
కిట్టు ఉన్నాడు జాగ్రత్త

కిట్టు ఉన్నాడు జాగ్రత్త

Comedy | Romance | 03 Mar 2017 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

కిట్టు ఉన్నాడు జాగ్రత్త స్టోరీ

కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాజ్ తరుణ్, అను ఇమ్మాన్యుయెల్, అర్బాజ్ ఖాన్, పృద్వి, నాగ బాబు, రఘు బాబు, తాగుబోతు రమేష్, ప్రవీణ్, ఫిస్ వెంకట్, పోసాని కృష్ణ మురళి, ప్రిద్వీ, రాజ రవింద్ర, సుధర్శన్, తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వంశీ కృష్ణ నిర్వహించారు మరియు నిర్మాత అనిల్ సుంకర నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అనూప్ రుబెన్స్ స్వరాలు సమకుర్చురు.  కథ అనాధ అయిన కిట్టు(రాజ్‌తరుణ్‌) మెకానికల్‌ ఇంజనీరింగ్ చదివిన తన స్నేహితులతో కలసి ఓ గ్యారేజీ నడుపుతుంటాడు. ఆడుతూ, పాడుతూ హ్యాపీగా బ్రతికేస్తున్న అతని జీవితంలోకి జానకి(అను ఇమ్మాన్యుయేల్‌) ప్రవేశించటంతో , ఆమె ప్రేమలో పడటంతో అతని లైఫ్ టర్న్ అవుతూుంది. ఓ రోజు జానికి యాక్సిడెంటల్ గా అతని గ్యారేజ్ లో ఓ పాతిక లక్షలు రూపాయల బ్యాగ్ పెట్టి మరిచిపోతుంది. మరుసటి రోజు ఆ బ్యాగ్ పట్టుకెళ్దామనుకునేలోగా ...కిట్టు ఫ్రెండ్స్ లో ఒకరు ..దాన్ని పట్టుకుని పారిపోతాడు. దాంతో తన ప్రేమ పై మచ్చపడకుండా ఉండటానికి కిట్టు తాము దాచుకున్న డబ్బుకు, ఓ పదిహేను లక్షలు, ఎక్కువవడ్డీ రేటుకు అప్పు చేసి ఇచ్చేస్తాడు. అయితే తాము గ్యారేజ్ లో పనిచేస్తూ..చేస్తూ అంత పెద్ద మొత్తం తీర్చలేమని కిట్టు తన ఫ్రెండ్స్ తో కలిసి కుక్కుల కిడ్నాపర్ అవతారం ఎత్తి ఆ డబ్బుని అప్పు తీరుస్తూంటారు. ఈ విషయం జానకికి తెలిసిపోయి నిలదీస్తుంది. కిట్టు నిజం చెప్పలేకపోతాడు. దాంతో కిట్టూ, జానకి విడిపోతారు. ఇదిలా ఉంటే మరోవైపు ఏఆర్‌(అర్ఫాజ్‌ఖాన్‌) సెలబ్రెటీలను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ వారి ద్వారా తన అవసరాలను తీర్చుకుంటుంటాడు. ఈ నేపథ్యంలో ఐటీశాఖ ఏఆర్‌ ఇంటిపై దాడి చేస్తుంది. బ్లాక్‌మెయిల్‌ చేయాలనుకున్న సెలబ్రెటీల జాబితా ఉన్న లాకర్‌ను ఐటీ ఆఫీసర్‌(నాగేంద్రబాబు) సీజ్‌ చేసి తీసుకెళ్లిపోతాడు. దీంతో ఐటీ ఆఫీసర్‌ కుమార్తె అయిన జానకిని ఏఆర్‌ కిడ్నాప్‌ చేయిస్తాడు. అదే సమయంలో కిట్టు సైతం తెలియక ..తన లవర్ జానికి కుక్కను కిడ్నాప్ చేస్తారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసేలోగా జానికి కిడ్నాప్ ... నేరం కిట్టుపై పడుతుంది. దాని నుంచి కిట్టు ఎలా బయటపడ్డాడు? జానకిని ఏ విధంగా బయటకు తీసుకొచ్చాడు. తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  
Read More

కిట్టు ఉన్నాడు జాగ్రత్త కాస్ట్ & క్రూ

కిట్టు ఉన్నాడు జాగ్రత్త సిబ్బంది సమాచారం

దర్శకత్వం వంశీ క్రిష్ణా
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అనూప్ రుబెన్స్
నిర్మాత అనిల్ సుంకర
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కిట్టు ఉన్నాడు జాగ్రత్త విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఇలాంటి క్రైమ్ కామెడీలో నిజానికి చెప్పుకోదగ్గ కథ ఉండదు. చిన్న లైన్ అనుకుని ...కథనం పరుగెట్టిస్తారు.మని, అనగనగా ఒక రోజు,స్వామి రారా వంటి చిత్రాలు ఈ కోవలోకి వస్తాయి. అయితే ఈ సినిమాకు స్క్రీన్ ప్లే నే మైనస్ అయ్యింది. ఎక్కడా ట్విస్ట్ లు ఉండవు. చాలా ప్లాట్ గా సాగుతూంటుంది. ఫస్టాఫ్ మొత్తం కుక్కల కిడ్నాప్ లు, తన లవ్ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ ని ఓ డాన్ కు చెప్పటం వంటి వాటితో నిండిపోయింది. అంటే సెటప్ తోనే ఫస్టాఫ్ మొత్తం నింపేసారు. ఇంటర్వెల్ దాకా అసలు కథలోకే రాలేదు. దాంతో ఏదో జరుగుతోంది అంటే జరుగుతోంది అన్నట్లుగా సీన్స్ వచ్చి పోతున్నట్లుగా ఫస్టాఫ్ లో అనిపించాయి. ఇంటర్వెల్ ముందు హీరో,హీరోయిన్స్ విడిపోవడం, హీరోయిన్ కిడ్నాప్ కు గురికావడంతో కథలోఇంట్రెస్ట్ మొదలవుతుంది. ఇంటర్వెల్ దగ్గర కథ మొదలెట్టిన దర్శకుడు సెకండాఫ్ ని పరుగెట్టించాలనే ప్రయత్నం చేసాడు. అలాగే ...విలన్ క్యారక్టర్ కూడా సెకండాఫ్ లోనే మొదలవుతుంది. అయితే విలన్ కు, హీరో కు మధ్య పోరు మాత్రం ప్రీ క్లైమాక్స్ అంటే క్లైమాక్స్ కు పది నిముషాల ముందు దాకా మొదలు కాలేదు. దాంతో ప్రీ క్లైమాక్స్ నుంచే కథ బాగున్నట్లు అనిపిస్తుంది.

కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

కిట్టు ఉన్నాడు జాగ్రత్త

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+