»   » పవన్ కల్యాణ్‌ను అను ఇమాన్యుయేల్ పట్టేసింది ఇలా..

పవన్ కల్యాణ్‌ను అను ఇమాన్యుయేల్ పట్టేసింది ఇలా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిన్న హీరోలకే పరిమితమైన మలయాళ ముద్దుగుమ్మ అను ఇమ్మానియేల్ ఏకంగా పవన్ కల్యాణ్ సరసన నటించే అవకాశం కొట్టేసింది. ఎందరో హీరోయిన్లు ఉండగా కేవలం ఆమెనే పవన్ కల్యాణ్ ఎంపిక చేయడంపై గుసగుసలు మొదలయ్యాయి. ప్రస్తుతం పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలో అను ఇమ్మానియేల్ ఓ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటిలానే పవన్ కల్యాణ్ ఓ కాఫీ షాప్‌లో నిరాడంబరంగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు.

అమెరికాలో పుట్టి..

అమెరికాలో పుట్టి..

అను ఇమ్మానియేల్ అమెరికా నటి. యూఎస్‌లోని ఇల్లినాయిస్‌లో జన్మించింది. ప్రస్తుతం డల్లాస్‌లో నివాసం ఉంటున్న అను దక్షిణాది చిత్ర పరిశ్రమలో నటిస్తున్నది. అను తండ్రి థంకాచన్ ఇమ్మాన్యుల్ సినీ నిర్మాత. స్వప్న సంచారీ అనే మలయాళ చిత్రంలో అను బాలనటిగా నటించింది. యాక్షన్ హీరో బిజు అనే చిత్రంలో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. నవిన్ పాలీకి జంటగా నటించిన ఆమెకు ఈ సినిమా మంచి పేరు తెచ్చింది.

బాలనటిగా మలయాళంలో

బాలనటిగా మలయాళంలో

2011లో స్వప్న పంచారీగా బాలనటిగా నటించిన తర్వాత 2016లో యాక్షన్ హీరో బిజు అనే మలయాళ చిత్రంలో హీరోయిన్‌గా కనిపించింది. ఆ తర్వాత మజ్ను, ఆక్సిజన్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, తిప్పరివాలన్ అనే తమిళ చిత్రంలో నటించింది. ప్రస్తుతం 100 డిగ్రీ సెల్సియస్ అనే మలయాళ చిత్రం, పవన్ కల్యాణ్ చిత్రాల్లో నటిస్తున్నది. మజ్ను, కిట్టు ఉన్నాడు జాగ్రత్త చిత్రాల్లో మంచి నటన అందర్ని ఆకట్టుకొన్నది. ఈ నేపథ్యంలో పవన్, తివిక్రమ్ దృష్టిలో పడిన అను బ్రహ్మండమైన అవకాశాన్ని చేజిక్కించుకొన్నది.

పవన్ 25వ చిత్రంలో అవకాశం

పవన్ 25వ చిత్రంలో అవకాశం

పవన్ కల్యాణ్ కెరీర్‌లో 25వ చిత్రంగా తెరకెక్కిస్తున్న చిత్రానికి సంబంధించిన సన్నివేశాలను ఇటీవల హైదరాబాద్‌లో చిత్రీకరించారు. కాఫీ షాప్‌లో కొన్ని రొమాంటిక్ సీన్లను పవన్, అను ఇమ్మానియేల్ మధ్య షూట్ చేశారు.

భారీ అంచనాలు..

భారీ అంచనాలు..

అక్టోబరులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర నిర్మాత ఎస్‌ రాధాకృష్ణ భావిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఖుష్బూ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో మరో కథానాయికగా కీర్తి సురేశ్ నటించనున్నది. పవన్‌ కల్యాణ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు ఘన విజయం సాధించాయి. దాంతో ప్రస్తుతం ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

English summary
Anu Emmanuel grabs Pawan Kalyan' movie is talk of town. She is born and brought up in US. Anu Emmanuel made her acting debut in Swapna Sanchari. After that She made her acting debut as lead in Nivin Pauly starrer Action Hero Biju.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu