X
మజ్ను

మజ్ను

Comedy | Romance | 23 Sep 2016 | U/A | 138 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

మజ్ను స్టోరీ

మజ్ను సినిమా కామిడి రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాని, ఇమ్మాన్యుయేల్, ప్రియాశ్రీ, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణమురళి, సప్తగిరి ,  ఎస్ ఎస్ రాజామౌ ళి సత్య తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విరించి వర్మ నిర్వహించారు మరియు నిర్మాతలు దిల్ రాజు, బెక్కం వేణుగోపాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు గోపి సుందర్ స్వరాలు సమకుర్చరు. కథ భీమవరం కుర్రాడు ఆదిత్య (నాని) రాజమౌళి దగ్గర బాహుబలికి అసిస్టెంట్ డైరెక్టర్.అతను..సుమ(ప్రియా శ్రీ) తో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లుగా ప్రేమలో పడి, తన ప్రేమలో నిజాయితీ నిరూపించుకోవటానికి గతంలో తన సొంత ఊరు భీమవరం లో జరిగిన తన ప్రేమ, బ్రేకప్ తో కూడిన ప్లాష్ బ్యాక్ ఆమెకు చెప్తాడు. దాంతో ఆమె ప్లాటై ప్రేమలో పడుతుంది. కానీ ఈ ప్రేమ కథ చెప్తూ ఆదిత్య తన మనస్సు తన పాత ప్రేయసి కిరణ్ (అను ఇమ్మాన్యుయేల్‌) చుట్టూనే తిరుగుతోందని గమనిస్తాడు. ఆమెను కలసి, కన్వీన్స్ చేయాలి అని ఫిక్సైనప్పుడు అతనికో ట్విస్ట్ పడుతుంది. అక్కడ నుంచి కథ కొత్త మలుపు తిరుగుతుంది. ఆ ట్విస్ట్ ఏమిటి...ఆదిత్య ప్రేమ కథ ఎవరితో ముగింపు కు వస్తుంది, ఇక ఆదిత్య తన పాత, కొత్త ప్రేయసిలను ఒకేసారి ఎలా ఫేస్ చేశాడు? చివరికి ఎవరి ప్రేమను దక్కించుకున్నాడు ? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Read More

మజ్ను కాస్ట్ & క్రూ

మజ్ను సిబ్బంది సమాచారం

దర్శకత్వం విరించి వర్మ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం గోపి సుందర్
నిర్మాత గీత గొల్లా
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మజ్ను విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
సినిమా ట్రైలర్స్, ఫస్ట్ లుక్ చూసి, నాని ఈ కథను ఒప్పుకున్నాడంటే ఏదో కొత్తగా చెప్పే ట్రెండీ లవ్ స్టోరీ ఉంటుదంని భావిస్తాం. కానీ రెగ్యులర్ గా వచ్చే ఇద్ద‌ర‌మ్మాయిలు ఒక అబ్బాయిని ప్రేమించటం, అబ్బాయి మాత్రం ఒక అమ్మాయినే ప్రేమిచటం, . ఆ అమ్మాయికేమో వేరే వారితో నిశ్చితార్థం జ‌రుగి, పెళ్లి దాకా వెళ్లటం. చివ‌ర‌కు హీరో అమ్మాయిని ఎలా ద‌క్కించుకుంటాడ‌నేదే క‌థ‌నే చెప్పారు. దాదాపు రొమాంటిక్ కామెడీలు, లవ్ స్టోరీల క్లైమాక్స్ లు ఒకేలా ఉంటూంటాయి. ఫస్టాఫ్ లో ఇంటర్వెల్ దగ్గర హీరో గతంలో తన ప్రేమ కథ చెప్తూ...ఆమెతో ప్రేమలో ఉన్నానని గ్రహించటం అనేది వినటానికి బాగానే ఉన్నా...తెరపై సరిగ్గా అది ఎగ్జిక్యూట్ కాలేదు. ద్వితీయ విఘ్నం దాటటానికి రొటీన్ పంధానా ఎంచుకున్నాడు...ఎంత రొటీన్ అంటే సెకండాప్ లో వచ్చే సీన్స్ అన్ని మనకు ఎక్కడో చూసినట్లే అనిపిస్తూంటాయి. అప్పట్లో వచ్చి హిట్టైన అల్లరి మొగుడు తరహా చిత్రా టైప్ లో ఇద్దరి హీరోయిన్స్ మధ్య నలిగే హీరో కథలా అనిపిస్తూంటాయి. ఈ సినిమాకు ప్లస్ నాని అనే దాని కన్నా నాని లేకపోతే ఈ సినిమా లేదు అనటం మేలు. ఎందుకంటే కేవలం నాని తన నటనతో ,కామెడీతో , డైలాగు విరుపుతో చాలా భాగం లాక్కొచ్చాడు. సీన్స్ లో బలం లేక తేలిపోయే చోట కూడా మ్యానేజ్ చేసాడు. కాబట్టి ఇది నాని వన్ మ్యాన్ షో అనే చెప్పాలి.

మజ్ను సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

మజ్ను

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+