X
తెలుగు » సినిమాలు » మన్మథుడు 2
మన్మథుడు 2

మన్మథుడు 2

Comedy | Romance | 09 Aug 2019 | U/A | 155 Mins
Telugu

2.6 /5 Users

2.5 /5 Filmibeat

మన్మథుడు 2 స్టోరీ

మన్మథుడు 2  సినిమా కామిడి, రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, ఈషా రెబ్బ, వెన్నెల కిశోర్, రావు రమేష్, ఝాన్సి, లక్ష్మి, దేవదర్శిని, కీర్తి సురేష్, సమంత అక్కినేని తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాహుల్ రవీంద్రన్ వహించారు మరియు అక్కినేని నాగార్జున, జెమిని కిరణ్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం చైతన్ భరద్వాజ్ స్వరాలు సమకుర్చరు.  కథ పోర్చుగీసులో స్థిరపడిన కుటుంబానికి చెందిన సాంబశివరావు అలియాస్ సామ్ (నాగార్జున) ప్లే బాయ్. జీవితాన్ని శృంగారమయం చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. వయసుపై పడినా పెళ్లి చేసుకోలేదనే బెంగ తల్లి, అక్కా చెల్లల్లను (లక్ష్మీ, ఝాన్సీ, దేవ దర్శిని) వెంటాడుతుంటుంది. ఎలాగైనా సామ్‌కు పెళ్లి చేయాలని డిసైడ్ చేస్తారు. ఈ క్రమంలో పెళ్లిని తప్పించుకోవడానికి లవర్‌గా నటించమని అవంతిక (రకుల్‌ ప్రీత్ సింగ్)తో కాంట్రాక్టు చేసుకొంటాడు. కాంట్రాక్టు లవర్‌గా ఇంట్లోకి అడుగుపెట్టిన అవంతిక వేసిన ఎత్తులు ఎలాంటి పరిస్థితులకు దారి తీశాయి. సాంబశివ రావు పెళ్లి చేసుకోకపోవడానికి కారణమేమిటి? అవంతిక జీవితంలో చోటు చేసుకొన్న విషాద పరిస్థితులు ఏమిటి? అవంతిక కాంట్రాక్టు లవర్‌గా ఎందుకు ఒప్పుకొన్నది. చివరకు సాంబశివ రావు పెళ్లి జరిగిందా? అవంతిక జీవితంలో చోటుచేసుకొన్న సమస్యలకు పరిష్కారం లభించిందా అనే ప్రశ్నలకు సమాధానమే మన్మథుడు 2 సినిమా కథ.
Read More

మన్మథుడు 2 కాస్ట్ & క్రూ

మన్మథుడు 2 సిబ్బంది సమాచారం

దర్శకత్వం రాహుల్ రవింద్రన్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు చోట కె ప్రసాద్, బొంతల నాగేశ్వర రెడ్డి
సంగీతం చైతన్ భరద్వాజ్
నిర్మాత నాగార్జున అక్కినేని, జెమిని కిరణ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మన్మథుడు 2 విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
మన్మథుడు 2 ఓ పెళ్లి కాని ప్రసాదు కథ. అయితే ఎలాంటి ఎమోషన్స్ లేకుండా, కథ, కథనాలపై కసరత్తు లేకుండా చేసిన ప్రయత్నంగా రూపొందిందని గట్టిగా చెప్పవచ్చు. మన్మథుడు సినిమాలో నాగార్జున లుక్ హైలెట్. ఇక మన్మథుడు 2 సినిమాకు వస్తే ఆ విషయమే మైనస్‌గా మారింది. మన్మథుడులో డైలాగ్స్ ఓ బలం. ఈ సినిమాలో డైలాగ్సే బలహీనతగా మారిందనే స్పష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్‌గా వెన్నెల కిషోర్ హాస్యం తప్ప ఏ రకంగా ఆకట్టుకొలేని సినిమాగా తెరకెక్కించారనే అభిప్రాయం కలుగుతుంది. ఓవర్సీస్, మల్టీప్లెక్స్ ఆడియెన్స్‌కు చేరువైతే ఈ సినిమా కమర్షియల్‌గా నిలబడుతుంది. ఈ సినిమా విజయం ఏ రేంజ్ అనేది తెలియాలంటే వారాంతం ఆగితే తెలుస్తుంది.

మన్మథుడు 2 సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

మన్మథుడు 2

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+