ఆ ఒక్క రొమాంటిక్ సీన్ వల్ల నాగార్జున మూవీ డిజాస్టర్.. అభిమానుల ప్రశ్నకు తప్పు ఒప్పుకున్న దర్శకుడు
టాలీవుడ్ ఇండస్ట్రీలో మన్మథుడు సినిమాతో ఒక సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన నాగార్జున ఆ తరువాత చాలా వరకు అదే ట్యాగ్ తో కంటిన్యూ అవుతూ వచ్చాడు. నాగార్జున అనగానే అందరికి గుర్తొచ్చేది అదే టైటిల్. అయితే అలాంటి అద్భుతమైన టైటిల్ తో మరోసారి బోల్డ్ గా చేసిన ప్రయత్నం అభిమానులను షాక్ కు గురి చేసింది. దర్శకుడు కూడా ఇటీవల ఆ సినిమాలో చేసిన ప్రధాన పొరపాటుపై స్పందించాడు.

మొదటి మన్మథుడు.. ట్రెండ్ సెట్టర్
2002లో విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మన్మథుడు సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక ట్రెండ్ సెట్ చేసిన విషయం తెలిసిందే. రైటర్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ కామెడీ పంచ్ లు ఆ సినిమాతోనే బాగా పేలాయి. అందులో కామెడీ పాత్రలు లవంగం, బాంకు శీను ఇప్పటికి మీమ్స్ లో వైరల్ అవుతూనే ఉంటాయి.

అలాంటి సినిమా తీస్తాడాని ఎవరు అనుకోలేదు.
ఇక అలాంటి ఐకానిక్ సినిమా టైటిల్ ను వాడుకొని మన్మథుడు 2 అంటూ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ పెద్ద ప్రయోగమే చేశాడు. చిలసౌ వంటి సింపుల్ క్యూట్ లవ్ స్టోరీతో ఓ వర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న రాహుల్ నాగార్జునలో అలాంటి సినిమా తీస్తాడాని ఎవరు అనుకోలేదు. నిజానికి ఆ సినిమాను ఫ్రెంచ్ సినిమా కథ ఆధారంగా తెరకెక్కించినట్లు నాగార్జున ముందుగానే వివరించాడు.

ఆ ఒక్క సీన్ వల్ల..
అయితే మన్మథుడు అనగానే అందరూ అదేదో ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా అనుకోని వచ్చారు. కానీ మొదటి 20 నిమిషాల్లో సినిమాపై విమర్శలు వెల్లువెత్తాయి. ఒక సీన్ లో అయితే నాగార్జున రూమ్ షేక్ అయ్యేలా శృంగార సన్నివేశంలో నటించడం అభిమానులకు సైతం ఎబ్బెట్టుగా అనిపించింది. అనేక విమర్శలు కూడా వచ్చాయి.
Recommended Video

క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
అదే విషయాన్ని ఇటీవల సోషల్ మీడియా ద్వారా అభిమానులు అడుగగా రాహుల్ ఓపెన్ గానే క్లారిటీ ఇచ్చాడు. నిజానికి ఆ సన్నివేశం షూట్ చేసినప్పుడు చాలా నవ్వుకున్నామని అయితే థియేటర్స్ లో ప్రేక్షకులకు మాత్రం అది నచ్చలేదని తనకు తొందరగానే అర్థమయినట్లు చెప్పాడు. అంతే కాకుండా ఆ ఒక్క సీన్ వల్లే సినిమా రిజల్ట్ మారిపోయిందని కూడా చెప్పాడు.


Click it and Unblock the Notifications











