»   » ఇలా అయితే డిస్ట్రిబ్యూటర్లకు బోడి గుండే?: నిర్మాతలకు పట్టదా!..

ఇలా అయితే డిస్ట్రిబ్యూటర్లకు బోడి గుండే?: నిర్మాతలకు పట్టదా!..

Subscribe to Filmibeat Telugu
ఇలా అయితే డిస్ట్రిబ్యూటర్లకు బోడి గుండే..!

నిన్న మొన్నటిదాకా పైరసీపై గగ్గోలు పెట్టిన సినీ ఇండస్ట్రీ.. డిస్ట్రిబ్యూటర్ల విషయంలో మాత్రం ద్వంద్వ నీతిని పాటిస్తుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. తమదాకా వస్తేనే బాధ అన్నట్లుగా డిస్ట్రిబ్యూటర్ల విషయాన్ని మాత్రం గాలికొదిలేసిందంటున్నారు. సినిమా విడుదలైన నెల రోజులకే ఆన్ లైన్ వెబ్‌సైట్స్‌లో వచ్చేలా డీల్ కుదుర్చుకోవడం డిస్ట్రిబ్యూటర్లకు తీరని అన్యాయం చేయడమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విలవిల్లాడుతున్నారు: 'స్టార్స్' దెబ్బకు నిజంగా చుక్కలే.., 'అజ్ఞాతవాసి'తో అగమ్యగోచరంగా..

 ఏంటీ సమస్య:

ఏంటీ సమస్య:

సినిమా ఇంకా థియేటర్ లో ఉండగానే.. ఆమెజాన్ ప్రైమ్ లాంటి వెబ్ సైట్లలో దర్శనమిస్తుండటంతో డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి. ఈ పరిస్థితికి కారణం నిర్మాతలే అవడం మరింత శోచనీయం. కోట్లు పెట్టి సినిమాలు కొనుగోలు చేసే డిస్ట్రిబ్యూటర్ల గురించి నిర్మాతలు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

డిస్ట్రిబ్యూటర్ల ఆవేదన:

డిస్ట్రిబ్యూటర్ల ఆవేదన:

పైరసీని ఎంకరేజ్ చేయవద్దని చెప్పే నిర్మాతలు.. డిస్ట్రిబ్యూటర్ల విషయంలో మాత్రం ద్వంద్వ నీతితో వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆన్‌లైన్ వెబ్‌సైట్లకు అమ్ముకుని సొమ్ము చేసుకోవడం ఓకె కానీ.. సినిమా థియేటర్ లో ఉండగానే సైట్లలో అందుబాటులోకి వస్తే ఇక తాము పెట్టిన డబ్బులు ఎక్కడ వెనక్కి వస్తాయని డిస్ట్రిబ్యూటర్లు ప్రశ్నిస్తున్నారు.

ఆమెజాన్ ప్రైమ్‌లో 'ఎంసీఏ' :

ఆమెజాన్ ప్రైమ్‌లో 'ఎంసీఏ' :

గతేడాది విడుదలైన ఎంసీఏ విషయంలోనూ ఇదే జరిగింది. థియేటర్స్ లో జనం సందడి తగ్గకముందే ఆమెజాన్ ప్రైమ్ లో సినిమా అందుబాటులోకి వచ్చింది.

నిర్మాత దిల్ రాజు నుంచి అఫీషియల్‌గా హక్కులు కొన్న అమేజాన్ ప్రైమ్ సంస్థ దర్జాగా ఈ సినిమాను తమ సబ్ స్క్రైబర్స్ కోసం నెట్‌లో ఉంచింది. దీంతో కోట్లు పోసి పంపిణి హక్కులు కొన్న డిస్టిబ్యూటర్స్, థియేటర్ యాజమాన్యాలు మాత్రం నిర్మాతల వైఖరి వల్ల భారీ ఎత్తున నష్టపోతున్నారు.

 టీవి చానెల్స్ కు కూడా దెబ్బే:

టీవి చానెల్స్ కు కూడా దెబ్బే:

సినిమా విడుదలైన నెల రోజులకే తమ వెబ్ సైట్లలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలతో సైట్లు ఒప్పందం చేసుకుంటున్నాయి. ఈ వైఖరి వల్ల టీవి చానెల్స్ కు కూడా నష్టం జరుగుతోంది.

కోట్లు పోసి శాటిలైట్ రైట్స్ కొనుక్కుంటే.. అంతకన్నా ముందే వెబ్ సైట్లలో వస్తుండటంతో టీవిలకు టీఆర్పీ పడిపోయే ప్రమాదం ఏర్పడింది. వెబ్ సైట్లలో అందుబాటులోకి వచ్చిన వెంటనే చాలామంది చూసేస్తుండటంతో టీవిల్లో ప్రసారమైనప్పుడు చూసేవారు తగ్గిపోతున్నారు.

 డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద దెబ్బ?:

డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద దెబ్బ?:

కోట్లు వెచ్చించి సినిమాలను కొనుగోలు చేసే డిస్ట్రిబ్యూటర్ల భవిష్యత్తు గురించి ఇకనైనా ఆలోచించకపోతే.. భవిష్యత్తులో సినిమాలు కొనేవారే లేకుండా పోతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాబట్టి నిర్మాతలంతా ఇప్పటికైనా ఈ విషయంపై సీరియస్‌గా దృష్టి పెట్టాలని వారు కోరుకుంటున్నారు.

English summary
Distributors are getting huge losses due to the deal with Amazon prime. Just after one month of release movies are available to the online viewers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu