X
తెలుగు » సినిమాలు » మోసగాళ్ళకు మోసగాడు
మోసగాళ్ళకు మోసగాడు

మోసగాళ్ళకు మోసగాడు

Action | Romance | 22 May 2015 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

మోసగాళ్ళకు మోసగాడు స్టోరీ

మోసగాళ్ళకు మోసగాడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుదీర్ బాబు, నందిని రాయి, అబిమన్య సింగ్, తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎ ఎన్ బోస్ నిర్వహిస్తున్నారు. మరియు నిర్మాత చక్రి చిరుగుపతి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణికాంత్ కాద్రి స్వరాలు సమకుర్చుతున్నారు. కథ క్రిష్(సుధీర్ బాబు) ఓ చిన్న దొంగ (ఇదోదో టైటిల్ అనుకునేరు...అలాంటిదేమీ కాదు..చిన్న దొంగతనాలు,మోసాలు గట్రా చేస్తూంటాడు అని). రెగ్యులర్ గానే మంచి పిల్ల అయిన జానికి(నందిని)తో అతను ప్రేమలో పడటం, ఆమెకు ఈ దొంగతనాలు అవీ నచ్చకపోవటం జరుగుతుంది. అంతేకాదు..ఈ మోసాలు,దొంగతనాలు మానేయమని ఆమె సలహా ఇస్తుంది. ప్రేమించిన అమ్మాయి కోసం తన వృత్తికి స్వస్ది చెప్దామనుకున్న మన హీరోకు...ఓ డీల్ వస్తుంది. డాన్ కౌసిక్(జయప్రకాష్ రెడ్డి) ఓ విగ్రహాన్ని ఎత్తుకురమ్మని పురమాయిస్తాడు. ఆ విగ్రహం చూసాక, దాన్ని ఎత్తుకు పారిపోతూంటే...అది ఓ జంట విగ్రహాల సముదాయం అని...రెండోది ఉంటేనే వాల్యూ అని తెలుస్తుంది. ఆ రెండో విగ్రహం కోసం... డాన్ రుద్ర (అభిమన్యు సింగ్) దగ్గరకు వెళ్తాడు. అక్కడ నుంచి రుద్రని ఎలా బోల్తా కొట్టించి ఆ రెండో విగ్రహాన్ని లేపేసి, బయిటపడ్డాడు... ఇంతకీ ఆ జంట విగ్రహాల కహానీ ఏంటి...తన లవర్ కు ఇచ్చిన మాటకు ఎందుకు కట్టుబడలేదు..లాంటి రకరకాల ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి లేదా తెలుసుకోవాలి అంటే సినిమా చూడాల్సిందే. లేదా సినిమా పూర్తి గా చూసినవాడని కలిసి అడగాల్సిందే.
Read More

మోసగాళ్ళకు మోసగాడు కాస్ట్ & క్రూ

మోసగాళ్ళకు మోసగాడు సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఎ ఎన్ బోస్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మణికంఠ కాద్రి
నిర్మాత చక్రి చిరుగుపతి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మోసగాళ్ళకు మోసగాడు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
మొదటి నుంచీ ఈ చిత్రం స్వామిరారా కు సీక్వెల్ అంటూ ప్రచారం జరిగింది. అదే ప్లస్..అదే మైనస్ అయ్యింది. ఓపినింగ్స్ రాబట్టటానికి ఆ ప్రచారం పనికొస్తే...ఆ సినిమాతో పోల్చి చూసుకుని నిరాశపడేలా జరగటం మైనస్ అయ్యింది. వాస్తవానికి ... ఈ సినిమాలో హీరో దొంగ, విగ్రహాలు చుట్టూ కథ జరగటం తప్ప స్వామిరారా తో పోలిక లేదు. సరే ఆ విషయం వదిలేస్తే...దర్శకుడు ఇలాంటి కథకు స్క్రీన్ ప్లే అవసరమనే విషయం మర్చిపోయి...ప్రతీ సీన్ లో కామెడీని ఎలా చొప్పించాలా అని ఆలోచించి,పేర్చుకుంటూ పోయాడు. అంతేగానీ మనం క్రైమ్ కామెడీ జానర్ ఎత్తుకున్నాం...మోసగాళ్లకు మోసగాడు అంటూ టైటిల్ పెట్టాం...ఎత్తుకు పై ఎత్తులు అవసరం అని అనుకోలేదు. ఎలాగోలా కామెడీని అడ్డం పెట్టి బయిటపడాలేనే తాపత్రయమే కనపడింది.

మోసగాళ్ళకు మోసగాడు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

మోసగాళ్ళకు మోసగాడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+