»   » హీరో నాని ఫుల్ బాటిల్ కొట్టాడు, తొడలు కొట్టాడు... అంతుందా?

హీరో నాని ఫుల్ బాటిల్ కొట్టాడు, తొడలు కొట్టాడు... అంతుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాని, నివేదా థామస్, ఆది ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన 'నిన్ను కోరి' చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్ర యూనిట్ వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ సక్సెస్ మీట్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సక్సెస్ మీట్ విజయవాడలో జరిగింది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, స్క్రీన్ ప్లే రైటర్ కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆడియన్స్ కూడా ఒక్కోసారి అర్థం కారు... అన్నీకావాలంటారు, ఏది లేక పోయినా చిన్న ఫీల్ ఉంటే హిట్ చేసేస్తారు అని తమ సినిమా విజయాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.


విజయానికి కారణం

విజయానికి కారణం

కోన వెంకట్ మాట్లాడుతూ.... సినిమా ఎందుకు ఇంత పెద్ద విజయం సాధించింది అని ఆలోచించాను. నాని అద్భుతమైన పెర్ఫార్మెన్సా? అరుణ్ పాత్రలో ఆది డిగ్నిపైడ్‌గా నటించడమా? పల్లవి పాత్రలో నివేదా అద్భుతమైన పెర్ఫార్మెన్సా? నేను అందించిన స్క్రీన్ ప్లేనా? శివ కథ, దర్శకత్వమా? డివివి సంస్థ నిర్మాణ విలువలా? అని బేరీజు వేస్తే... ఇవేవీ కావు మంచి మనసున్న ప్రేక్షకుల వల్లే సినిమా ఇంత పెద్ద హిట్టయింది. వారి వల్లే మాకు ప్యూర్ సక్సెస్ వచ్చిందని కోన వెంకట్ అన్నారు.Nani Emotional Selfie Video On Ninnu Kori Movie Success
కర్త, కర్మ, క్రియ నాని

కర్త, కర్మ, క్రియ నాని

‘నిన్ను కోరి' సినిమా తెరకెక్కడానికి, మీ ముందుకు రావడానికి కర్త, కర్మ, క్రియ నాని. నాని ఈ కథను ఎంతో నమ్మారు, ఆయన నమ్మకాన్ని ప్రేక్షకులు అక్షరాల నిజం చేశారని కోన వెంకట్ వ్యాఖ్యానించారు.నాని మాకంటే ఎక్కువ తొడలు కొట్టాడు, అంతుందా?

నాని మాకంటే ఎక్కువ తొడలు కొట్టాడు, అంతుందా?

‘నిన్ను కోరి' సినిమాకు మా అందరి కంటే ఎక్కువ బాధ్యత తీసుకున్నది హీరో నాని. మా కంటే ఎక్కువ తొడలు కొట్టాడు. మా కంటే ఎక్కువ కథను నమ్మాడు. నాకు అర్థం కాలేదు. ఆ సమయంలో ఈ కథలో అంతుందా అనిపించింది. మేము చూడని సినిమాను నాని ముందే చూశాడు.... అతడి అంచనాలు నిజం అయ్యాయి అని కోన వెంకట్ తెలిపారు.ఫుల్ బాటిల్ కొట్టేశాడు

ఫుల్ బాటిల్ కొట్టేశాడు

అమెరికాలో షూటింగ్ జరిగేపుడు వాతావరణం జీరో డిగ్రీలకు పడిపోయింది. పల్లవి, ఉమ మధ్య అప్పుడు ఓ సీన్ తీశాం. ఈ అమ్మాయిలు కూడా అస్సలు అర్థం కారు బాసూ అన్ని అలవాట్లు ఉన్న వారిని ప్రేమిస్తారు. ఏ అలవాటు లేని వారిని పెళ్లి చేసుకుంటారు అనే డైలాగులో ఫీల్ రావడం కోసం నాని ఫుల్ బాటిల్ కొట్టేశాడు. నాని అంత తాగడంతో మేమంతా కంగారుపడ్డాం. నానికి నేచురల్ స్టార్ అనే పేరు రావడానికి కారణం ఇదేనేమోణ? సీన్ నేచురల్‌గా రావడానికి ఇలా కూడా చేస్తారా? అనిపించింది అని కోన వెంకట్ వ్యాఖ్యానించారు.
English summary
Success meet of Natural Star Nani's latest release 'Ninnu Kori' was held in Vijayawada. Speaking at the function, film's screenplay writer and co-producer Kona Venkat has made an interesting revelation about how Nani drank a full bottle of liquor to bring authenticity to a particular scene.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X