X
తెలుగు » సినిమాలు » పూల రంగడు
పూల రంగడు

పూల రంగడు

Comedy | Romance | 18 Feb 2012 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

పూల రంగడు స్టోరీ

పూల రంగడు సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సునీల్‌, ఇషాచావ్లా , దేవ్‌గిల్‌, కోట శ్రీనివాసరావు, ప్రదీప్‌రావత్‌, అలీ, రఘుబాబు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వీరభద్రమ్ నిర్వహించారు మరియు నిర్మాత కె అచ్చిరెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్ స్వరాలు అందించారు. కథ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దెబ్బ తిన్న వారిలో ఒకడు రంగా(సునీల్‌). అప్పులు చేసి తప్పించుకుని తిరుగుతున్న అతనికి వరంగల్ నుంచి ఓ రియల్ ఎస్టేట్ ఆఫర్ వస్తుంది. ఆ బిజినెస్ లో ఉన్న లిటిగేషన్ వల్ల రంగా ... ఇద్దరు ప్రత్యర్దులు (దేవ్ గిల్, ప్రదీప్ రావత్)ల మధ్య ఇరుక్కుపోతాడు. వారి నుంచి తప్పించుకుంటూ ఆ బిజినెస్ లో ఎలా సక్సెస్ అయ్యాడు. అతన్ని ఇష్టపడ్డ ప్రత్యర్ది కూతురు అనిత (ఇషాచావ్లా)ని ఎలా దక్కించుకున్నాడు అనేది తెరపై చూడాల్సిన కథ.
Read More

పూల రంగడు కాస్ట్ & క్రూ

పూల రంగడు సిబ్బంది సమాచారం

దర్శకత్వం వీరభద్రం
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అనూప్ రుబెన్స్
నిర్మాత కె అచ్చి రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

పూల రంగడు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
నటీనటుల్లో సునీల్ ... సిక్స్ ప్యాక్ బాగున్నా.. హీరో కాక ముందు ఫ్యామిలీ ప్యాక్ తో చేసిన కామెడీ మిస్సైంది. హీరోయిన్ గా ఇషా ఛావ్లా మైనస్. కాస్తో కూస్తో బాగున్నాయి అనుకున్న సన్నివేశాలకి అలీ ప్లస్ అయ్యాడు. అలాగే కోట, సుమిత్ర,సుధ, సత్యం రాజేష్, పృథ్వీ, దువ్వాసి మోహన్ వంటి రెగ్యులర్ నటుల వల్ల సినిమాకు నిండుతనం వచ్చింది. ఇలాంటి సినిమాలకు కీలకమైన పంచ్ డైలాగులు పెద్దగా పేలలేదు. అనూప్ రూబెన్స్ సంగీతం ఓకే అనిపిస్తుంది. ఎడిటింగ్ మరింత షార్పుగా చేస్తే బాగుండేది. కెమెరా వర్కు బాగుంది. సినిమాను నిలబెట్టిన క్లైమాక్స్ క్రెడిట్ మాత్రం ఫైట్ మాస్టర్ కనల్ కణ్ణన్ దే. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు ద్వితీయ విఘ్నాన్ని సునిల్ ని అడ్డం పెట్టుకుని దిగ్విజయింగా దాటేసాడు. ఫైనల్ గా సునీల్ కోసమే ఈ చిత్రాన్ని చూడాలి.

పూల రంగడు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

పూల రంగడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+