శ్రీమన్నారాయణ స్టోరీ
శ్రీమన్నారాయణ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నందమూరి బాలకృష్ణ, పార్వతీమెల్టన్, ఇషాచావ్లా, విజయ్‌కుమార్, సురేష్, వినోద్‌కుమార్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్‌రెడ్డి, కృష్ణ్భగవాన్, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, రాజా రవీందర్, దువ్వాసి మోహన్, రావు రమేష్, నాగినీడు, సుప్రీత్, సుధ, సత్యకృష్ణ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, కథనం, దర్శకత్వం: రవికుమార్ చావలి నిర్వహించారు మరియు నిర్మాత రమేష్ పుప్పాల నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రి స్వరాలు సమకుర్చారు. కథ అత్యంత సాహసంతో జేమ్స్ బాండ్ తరహాలో స్కూప్ లు బయటకు తీసే జర్నలిస్టు శ్రీమన్నారాయణ(బాలకృష్ణ). అతని తండ్రి కల్కి నారాయణ మూర్తి(విజయకుమార్) పేదలు అంటే ప్రాణమిచ్చే వ్యక్తి. ఆయన జై కిసాన్ అనే సంస్ధను ఏర్పాటు పేద రైతుల కోసం ఐదు వేల కోట్లు ఫండ్ వసూలు చేస్తాడు. ఈ విషయం రొటీన్ గా విలన్స్ (జయప్రకాష్ రెడ్డి, నాగినీడు, సురేష్, కోట వగైరా) బ్యాచ్ కి తెలుస్తుంది. దాంతో వారు రంగంలోకి దిగి ఆ ఐదు వేలు కోట్లు నొక్కేసి తమకు అన్నిటికీ అడ్డుపడుతున్న మన జర్నలిస్ట్ హీరోని ఆ కేసులో ఇరికించేసి (అంత తెలివైన వాడిని ఎలా ఎరికించాడని అడగొద్దు) జైలుకు పంపేస్తారు. అప్పుడు జైల్లో ఉన్న శ్రీమన్నారాయణ ఏ విధంగా తన తండ్రిని చంపిన వారిపై పగ తీర్చుకుని, ఆ జై కిసాన్ ఫండ్ ని రైతులుకు చేరేలా చేసాడు....అలాగే హీరోయిన్స్ (ఇషా ఛావ్లా, పార్వతి మిల్టన్) కి ఈ కథలో పాత్రేమిటి..అన్న విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చివరి వరకూ చూడాల్సిందే.
Read More