Don't Miss!
- Sports
INDvsNZ : నువ్వూ.. నీ ఆట.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్!
- Technology
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- Finance
Wheat Price: సామాన్యులకు శుభవార్త.. తగ్గనున్న గోధుమ పిండి ధర..
- Automobiles
కొత్త సంవత్సరంలో కూడా తగ్గని ధరల మోత: XUV700 ధరలు మళ్ళీ పెరిగాయ్..
- News
ఫ్లోరోసిస్ రక్కసిపై యుద్ధం చేసిన నల్గొండవాసి అంశాల స్వామి కన్నుమూత; కేటీఆర్ ట్వీట్!!
- Lifestyle
Chanakya Niti: ఈ పనులతో పేదలు కూడా ధనవంతులు అవుతారు, అవేంటంటే..
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
18 Pages: టైమ్ ఇవ్వు పిల్లా సాంగ్ వచ్చేసింది.. మరోసారి గాత్రంతో అదరగొట్టిన శింబు
కార్తికేయ 2 సినిమాతో ఫ్యాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నెక్స్ట్ 18 పెజెస్ అనే సినిమాతో రాబోతున్నాడు. ప్యూర్ లవ్ స్టోరీ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సుకుమార్ కథను అందించారు. ఇక ఇంతకుముందు కుమారి 21ఎఫ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
అసలైతే ఈ సినిమాను కొన్ని నెలల క్రితం విడుదల చేయాలని అనుకున్నారు. కానీ సినిమా వివిధ కారణాల వలన వాయిదా పడుతూ వస్తోంది. గీత ఆర్ట్స్ తో కలిపి బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమాకు సంబంధించిన అన్ని పనులు కూడా ముగిశాయి. ప్రస్తుతం ప్రమోషన్స్ తో చిత్ర యూనిట్ సభ్యులు సినిమాపై మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇటీవల తమిళ స్టార్ హీరో శింబు ఈ సినిమాలో పాట పాడబోతున్నట్లు క్లారిటీ ఇవ్వడంతో కొంత హైప్ అయితే క్రియేట్ అయింది.

'టైం ఇవ్వు పిల్ల' అనే పాటను పాడబోతున్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక మొత్తానికి కొద్దిసేపటి క్రితమే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. శింబు ఇంతకుముందే కొన్ని పాటలతో సినిమాలకు మంచి హైప్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు నిఖిల్ సినిమాలో అతను పాడిన విధానం కూడా ఓ వర్గం వారిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందించగా టైమ్ ఇవ్వు పిల్లా పాటను శ్రీమణి అద్భుతంగా రచించారు. ఇక ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. నిఖిల్ కు జోడిగా అనుపమ పరమేశ్వరుని హీరోయిన్ గా నటించగా ఏ వసంత్ సినిమాటోగ్రర్ వర్క్ చేశారు. అలాగే సుకుమార్ రైటింగ్స్ GA2 ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా 18 పేజెస్ సినిమాను డిసెంబర్ 23వ తేదీన విడుదల చేస్తున్నారు.