‘శశి’ ఫస్ట్ సింగిల్ రేపే.. సిధ్ శ్రీరామ్ మ్యాజిక్ చేస్తాడా?
ఆది సాయి కుమార్ సరైన హిట్ కోసం ఎన్ని రోజుల నుంచి శ్రమిస్తున్నాడో అందరికీ తెలిసిందే. ప్రేమ కావాలి, లవ్‌లీ వంటి చిత్రాల తరువాత మళ్లీ ఆ రేంజ్‌లో హిట్ కొట్టలేకోపోయాడు. ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అంటూ చివరగా పలకరించాడు. కానీ అది కూడా అంతగా వర్కవుట్ కాలేదు. అంతకు ముందు జోడి, బుర్రకథ, నెక్స్ట్ నువ్వే వంటి చిత్రాలతో ఎంతగా ట్రై చేసిన హిట్టు కొట్టలేకపోయాడు.
అయితే చాలా కాలం తరువాత ఆది మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. చిరంజీవి చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేయించి అందరినీ ఆకట్టుకున్నారు. టీజర్‌లో డైలాగ్స్ అందరినీ ఆశ్చర్యపోయాయి. ప్రేమ కోసం పాటు పడే యువకుడిగా ఆది సాయి కుమార్ నటించాడు. యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ సింగిల్ రేపు (జనవరి 3)న విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు.

ఒకే ఒక లోకం నువ్వే అనే ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించాడు. ఈ పాటను చంద్రబోస్ రచించాడు. అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్న ఈ పాటను తమన్ విడుదలు చేస్తుండటంతో అందరికీ అంచనాలున్నాయి. పైగా సిధ్ శ్రీరామ్ మంచి ఊపులో ఉన్నాడు. ఇక ఈ పాట రేపు విడుదలయ్యాక సినిమాపై అంచనాలు భారీగానే పెరిగేలా ఉన్నాయి. సురభి, రాశీ సింగ్‌లు ఈ సినిమాలో హీరోయిన్‌లుగా నటించారు.


Click it and Unblock the Notifications











