For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Neha Shetty's Lip lock..యువ హీరోను అలా కవ్వించిన భామ.. పటాస్ పిల్లా అంటూ వెంటపడి..

  |

  టాలీవుడ్‌లో లవ్, రొమాంటిక్ అంశాలతో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న డీజే టిల్లు చిత్రం యువతరాన్ని విశేషంగా ఆకర్షిస్తున్నది. ఇప్పటి వరకు విడుదలైన టీజర్ల్, పాటలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు డీజె టిల్లుపై అంచనాలు పెంచుతున్నాయి. యువ హీరో సిద్దూ జొన్నలగడ్డ, నేహా శెట్టి మధ్య ఉన్న సన్నివేశాలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

  వెనుకకు తగ్గిన డీజే టిల్లు

  వెనుకకు తగ్గిన డీజే టిల్లు

  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నూతన దర్శకుడు విమల్ కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న చిత్రం డీజే టిల్లు. ఈ సినిమాను జనవరి 14వ తేదీన సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ కరోనావైరస్ పరిస్థితులు, ఏపీలో 50 శాతం అక్యుపెన్సీ, నైట్ కర్ఫ్యూలు లాంటి అంశాలు తెరపైకి రావడంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తూ నిర్మాత నాగవంశీ నిర్ణయం తీసుకొన్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్లాన్ చేస్తున్నారు.

  లాలాగూడా, అంబర్ పేట అంటూ

  లాలాగూడా, అంబర్ పేట అంటూ

  డీజే టిల్లు సినిమా మ్యూజిక్ ప్రధానంగా రూపొందుతున్న ప్రేమ కథ కాబట్టి సంగీతానికి పెద్ద పీట వేస్తున్నట్టు ప్రచార కార్యక్రమాలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన 'లాలాగూడా అంబర్ పేట మల్లేపల్లి మలక్ పేట.. టిల్లు అన్న డీజే పెడితే డిల్లా డిల్లా ఆడాల.. మల్లేశన్న దావత్ ల బన్ను గాని బారాత్‌ల.. టిల్లు అన్న దిగిండంటే డించక్ డించక్ దుంకాల' అంటూ గేయ రచయిత కాసర్ల శ్యామ్ రాసిన పాట వైరల్ అయింది. మంచి బీట్‌తో సాగే పాటను రామ్ మిరియాల ట్యూన్ చేయడం తెలిసిందే. హైదరాబాద్ గల్లీలల్లో ఉండే యూత్‌ను టార్గెట్ చేస్తూ ఈ పాటను రూపొందించామని రామ్ మిరియాల తెలిపారు.

  పటాస్ పిల్లా సాంగ్‌లో

  పటాస్ పిల్లా సాంగ్‌లో

  డీజే టిల్లు సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేశారు. ఈ సినిమాలోని పటాస్ పిల్లా పాటను జనవరి 24వ తేదీన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. సోమవారం ఉదయం 10.08 గంటల ప్రాంతంలో సంగీత ప్రియులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకత్వంలో రాక్ స్టార్, సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ ఆలపించారు. ఫుల్ రొమాంటిక్‌గా సాగే ఈ పాటలో హీరో, హీరోయిన్ల మధ్య సన్నివేశాలు మరింత హాట్‌గా ప్రోమోలో కనిపించాయి.

  బొడ్డును చూపిస్తూ రెచ్చగొట్టిన హీరోయిన్

  బొడ్డును చూపిస్తూ రెచ్చగొట్టిన హీరోయిన్

  హీరో సిద్దూ జొన్నలగడ్డను హీరోయిన్ నేహా శెట్టి తన బొడ్డును చూపిస్తూ రెచ్చగొడుతూ కవ్వించే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించింది. అంద చందాలతో కవ్విస్తున్న భామను వెంటాడుతూ సిద్దూ వెళ్లడం ప్రోమోలో కనిపించింది. వీరిద్దరి మధ్య ఉన్న లిప్‌లాక్ ఫోటో వైరల్‌గా మారింది. పటాస్ పిల్ల పాట యూత్‌ను ఏ రేంజ్‌లో ఆకట్టుకొంటుందో వేచి చూడాల్సిందే.

  Sankranthi Festival Should've A Movie Like Bangarraju | Tollywood | Filmibeat Telugu
  డీజే టిల్లులో నటీనటులు, సాంకేతిక నిపుణులు

  డీజే టిల్లులో నటీనటులు, సాంకేతిక నిపుణులు


  నటీనటులు: సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి తదితరులు
  రచన: విమల్ కృష్ణ, సిద్దు జొన్నలగడ్డ
  మాటలు: సిద్దు జొన్నలగడ్డ
  సంగీతం: శ్రీచరణ్ పాకాల
  సినిమాటోగ్రఫి: సాయిప్రకాష్ ఉమ్మడి సింగు
  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలి నేని
  పీఆర్వో: లక్ష్మీవేణుగోపాల్
  సమర్పణ: పి. డి. వి. ప్రసాద్
  నిర్మాత: సూర్యదేవర నాగవంశి
  దర్శకత్వం: విమల్ కృష్ణ

  English summary
  DJ Tillu, starring Siddhu Jonnalagadda and Neha Shetty in the lead roles, is a mad-cap thriller directed by debutant Vimal Krishna and produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments.This movie second single to release on January 24th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion