Samantha అల్జు అర్జున్‌తో మరోసారి.. పూజా హెగ్డే తర్వాత సమంతను రంగంలోకి దించిన సుకుమార్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న పుష్ప చిత్రం రోజు రోజుకు అభిమానుల్లో అంచనాలు పెంచుతున్నది. ఇప్పటికే తగ్గేదేలే అంటూ తనదైన శైలిలో ట్రెండింగ్‌గా మారిన ఈ సినిమా డైలాగ్స్‌తోపాటు పాటలు కూడా సందడి చేస్తున్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలు ఫ్యాన్స్‌తోపాటు సినీ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో సెన్సేషనల్ విషయాన్ని అభిమానులకు పుష్ప టీమ్ వెల్లడించింది. సమంత, అల్లు అర్జున్ అభిమానులకు అందించి ఆ స్పెషల్ వార్త ఏమిటంటే..

పుష్ప చిత్రంలో సమంత
అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యంత క్రేజీగా నిలిచిన చిత్రంగా పుష్ప ది రైజ్ నిలిచింది. విడుదలకు ముందే ప్యాన్ ఇండియా స్థాయిలో క్రేజీగా పాపులారిటిని సొంతం చేసుకొన్నది. రష్మిక మందన్న, అనుసూయ లుక్స్ సినిమాపై మరింత అంచనాలు పెంచింది. ఇలాంటి పరిస్థితుల్లో పుష్పలో నటించేందుకు సమంత కూడా సిద్దమైందనే చల్లటి వార్తను అందించింది.

స్పెషల్ సాంగ్ కోసం సుకుమార్
పుష్ప చిత్రం మొదటి భాగం కోసం ఐదో పాటను కూడా సిద్దం చేస్తున్నారు. ఈ పాట కోసం పలువురి హీరోయిన్లపై దృష్టిపెట్టారు. అయితే సమంత అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆమెను సంప్రదించారు. ఇప్పటికే రంగస్థలం చిత్రంలో సుకుమార్ దర్శకత్వంలో నటించిన సమంత ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించడంతో ఆమె పుష్ప చిత్రంలోకి చేరింది. దీంతో యూనిట్ ఓ ప్రకటనను విడుదల చేసి ధృవీకరించింది.

పుష్ప మూవీలో ఐదో పాట కోసం..
పుష్ప చిత్రంలో ఐదో పాట చాలా స్పెషల్, ఆ పాటకు స్పెషల్‌గా ఉండే హీరోయిన్ అవసరమైంది. సమంత గారిని మేము అడిగితే అందుకు ఆమె కూడా సానుకూలంగా స్పందించింది. ఈ సినిమాలో స్పెషల్ ఐటమ్ సాంగ్‌లో నటించేందుకు సిద్ధమైంది. అల్లు అర్జున్‌తో కలిసి వెండితెరను సమంత వెలుగు జిలుగులు పంచనున్నది అని యూనిట్ వెల్లడించింది.

సమంత కెరీర్‌లోని తొలిసారి
సమంత తన కెరీర్‌లోనే స్పెషల్ పాటలో నటించడం తొలిసారి. అభిమానులు, సినీ ప్రేక్షకుల హృదయాల్లో మరిచిపోలేని విధంగా ఈ పాటను చిత్రీకరించబోతున్నాం. మీ అంచనాలకు తగినట్టుగా ఈ పాట ఉండబోతుంది అనే విషయాన్ని పుష్ప టీమ్ వెల్లడించింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రాల్లో ఇలాంటి స్పెషల్ పాటలు ప్రేక్షకులకు కిక్కెక్కెంచే విధంగా ఉండటం తెలిసిందే.
Recommended Video

పూజా హెగ్డే తర్వాత సమంతను రంగంలోకి
సుకుమార్ సినిమాల విషయానికి వస్తే.. స్పెషల్ సాంగ్స్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తాయి. గతంలో ఆ అంటే అమలాపురం, రింగ రింగా.., రంగస్థలంలో పూజా హెగ్డేతో స్పెషల్ సాంగ్ టాప్ చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. అంతేకాకుండా సినిమాకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇక పుష్ప చిత్రంలోని స్పెషల్ పాట కూడా అదే రేంజ్‌లో ఉంటుందనే భావనలో అభిమానులు ఉన్నారు. కొద్ది రోజులు ఆగితే ఆ పాట ఏ రేంజ్‌లో మత్తెక్కిస్తుందో చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











