Don't Miss!
- News
Republic Day 2023: తొలిసారిగా రాష్ట్రపతి హోదాలో జాతీయ జెండా ఎగురవేయనున్న ద్రౌపది ముర్ము..!
- Lifestyle
కోడళ్లకు అత్తలంటే ఎందుకు ఇష్టముండదో తెలుసా?
- Sports
WPL:మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆర్సీబీ, ముంబై ఇండియన్స్.. బీసీసీఐకి రూ.4670 కోట్లు!
- Technology
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- Finance
Stock Market Crash: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. రూ.4 లక్షల కోట్లు ఆవిరి.. బ్యాంక్ స్టాక్స్ ఫసక్
- Automobiles
'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' లాంచ్ చేసిన మహీంద్రా.. ధర ఎంతో తెలుసా?
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Maa Bava Manobhavalu: యూట్యూబ్ ను షేక్ చేస్తున్న బాలయ్య సాంగ్.. అదిరిపోయే స్టెప్పులతో ట్రెండింగ్!
మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనే దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం వీర సింహా రెడ్డి. ఇటీవల బాలకృష్ణ అఖండ సినిమాతో, గోపిచంద్ మలినేని క్రాక్ మూవీతో మంచి జోష్ మీదున్నారు. ఇక వీరిద్దరి కలయికలో సినిమా వస్తుందనే టాపిక్ రాగానే నందమూరి అభిమానులు, మాస్ ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన షూటింగ్ స్పాట్ పిక్స్, వీడియోలు, సాంగ్స్ తెగ వైరల్ అయ్యాయి. ఇక ఈ చిత్రం నుంచి తాజాగా విడుదలైన మా బావ మనోభావాలు సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ క్రియేట్ చేస్తోంది.

రెట్టించిన ఉత్సాహంతో..
ఆ మధ్య కొంతకాలం పరాజయాలతో ఇబ్బంది పడినా నందమూరి నటసింహం బాలకృష్ణ గతేడాది వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 'అఖండ' తర్వాత రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతోన్నారు. ఈ ఊపులోనే ఆయన కొత్త సినిమాలను వరుసగా లైన్‌లో పెట్టుకుంటోన్నారు. ఇలా ఇప్పటికే టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'వీరసింహారెడ్డి' సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. పల్నాడు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని హై లెవెల్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా బ్యూటిఫుల్ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

సంక్రాంతి కానుకగా..
బాలకృష్ణ
డ్యుయల్
రోల్
చేస్తున్న
వీర
సింహా
రెడ్డి
చిత్రంలో
కోలీవుడ్
స్టార్
నటి
వరలక్ష్మీ
శరత్
కుమార్,
దునియా
విజయ్
మరో
కీలక
పాత్రల్లో
అలరించేందుకు
సిద్ధమయ్యారు.
ఈ
సినిమాను
టాలీవుడ్
బడా
నిర్మాణ
సంస్థ
మైత్రీ
మూవీ
మేకర్స్
బ్యానర్‌పై
యలమంచిలి
రవి,
నవీన్
యెర్నేని
నిర్మిస్తున్నారు.
అఖండ
తర్వాత
బాలకృష్ణ
నటిస్తున్న
ఈ
సినిమాకు
థమన్
సంగీతం
అందిస్తున్నాడు.
పవర్‌ఫుల్
కాంబినేషన్‌లో
ఫుల్
లెంగ్త్
యాక్షన్
ఎంటర్‌టైనర్‌గా
తెరకెక్కుతోన్న
ఈ
చిత్రాన్ని
సంక్రాంతి
కానుకగా
జనవరి
12న
విడుదల
చేస్తున్నారు.
దీంతో
చిత్ర
యూనిట్
ప్రమోషన్‌ను
ఇప్పటికే
మొదలు
పెట్టింది.
|
7 మిలియన్ వ్యూస్ రాగా..
సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే డిసెంబర్ 24న మా బావ మనోభావాలు అనే స్పెషల్ సాంగ్ ను విడుదల చేసింది. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉన్న సంధ్య థియేటర్‌లో స్పెషల్ ఈవెంట్‌ను నిర్వహించి అభిమానుల మధ్య ఈ పాటను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఈ లిరికల్ సాంగ్ కు ఇప్పటికే 7 మిలియన్ వ్యూస్ రాగా 1.26 లక్షల లైక్స్ వచ్చాయి. అంతేకాకుండా యూట్యూబ్ లో నెంబర్ 1 ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ పాటలో బాలకృష్ణ మాస్ స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక ఈ సాంగ్ కు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.