»   » దుబాయ్‌లో బాలీవుడ్ ప్రముఖుడి అరెస్ట్.. యువతితో అసభ్యంగా, వేధింపులపై కేసు

దుబాయ్‌లో బాలీవుడ్ ప్రముఖుడి అరెస్ట్.. యువతితో అసభ్యంగా, వేధింపులపై కేసు

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రముఖ బాలీవుడ్ సింగర్ మికా సింగ్‌‌‌ను దుబాయ్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళ చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొని అదుపులోకి తీసుకొన్నట్టు తెలిసింది. మికా సింగ్ అరెస్ట్ వార్తతో బాలీవుడ్ షాక్ గురైంది. మీడియాలో గాయకుడి వేధింపుల వార్త ప్రముఖంగా మారింది. వివరాల్లోకి వెళితే..

  మీ టూపై మికా సింగ్

  మీ టూపై మికా సింగ్

  సినీ పరిశ్రమలో మీ టూ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో మికా సింగ్ స్పందించాడు. మీ టూ ఉద్యమానికి తాను చేయూతనిస్తాను అని ఇటీవల ప్రకటించాడు. ఇండస్ట్రీలో బాధలు అనుభవిస్తున్న మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి తెలుపడం సంతోషం కలిగిస్తుందని ఇటీవల మికా సింగ్ పేర్కొన్నాడు. అలాంటి వ్యక్తి లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ కావడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.

  బ్రెజిల్ యువతిపై వేధింపులు

  బ్రెజిల్ యువతిపై వేధింపులు

  దుబాయ్ పోలీసుల కథనం ప్రకారం.. మికా సింగ్‌పై బ్రెజిల్ అమ్మాయి ఫిర్యాదు చేసింది. అసభ్యకరమైన ఫొటోలు తనకు పంపిస్తూ వేధించాడు. మురక్కాబాత్ పోలీస్ స్టేషన్‌లో మహిళ ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేశాం అని తెలిపారు.

  మా కస్టడిలోనే మికా సింగ్

  మా కస్టడిలోనే మికా సింగ్

  మికా సింగ్ మా కస్టడిలో ఉన్నాడని దుబాయ్ పోలీసులు ధృవీకరించారు. బాలీవుడ్ ఈవెంట్‌ కోసం దుబాయ్ వచ్చిన గాయకుడు మహిళతో అనుచితంగా ప్రవర్తించాడు అని పోలీసులు పేర్కొన్నారు. మికాను జైలు నుంచి విడిపించడానికి ఆయన స్నేహితులు తీవ్రంగా ప్రయత్నాలు చేపట్టారని ప్రముఖ వార్తా ఏజెన్సీ పేర్కొన్నది.

  యూఏఈలో ఈవెంట్ కోసం

  యూఏఈలో ఈవెంట్ కోసం

  ఓ సంగీత కచేరి కోసం వచ్చిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మికా సింగ్ అరెస్టయ్యాడు. ఈవెంట్ ముగిసిన తర్వాత ఈ ఘటన జరిగింది. ఈవెంట్ నేపథ్యంలో తనను లైంగికంగా వేధించాడని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో అదుపులోకి తీసుకొన్నారు. ప్రస్తుతం ఆయనను పోలీసులు ప్రశ్నిస్తున్నారు అని మికాసింగ్ బృందం సభ్యుడు వెల్లడించాడు.

  దలేర్ మెహందీ సోదరుడిగా

  దలేర్ మెహందీ సోదరుడిగా

  ప్రముఖ గాయకుడు దలేర్ మెహందీ సోదరుడిగా మికాసింగ్ చిత్ర సీమకు పరిచయం అయ్యాడు. బాలీవుడ్‌లో పలు విజయవంతమైన చిత్రాలకు పాటలు పాడారు. ఆ తర్వాత తెలుగు, తమిళ ఇతర భాషల్లో కూాడా పాటలు పడి ప్రజాదరణ పొందారు.

  English summary
  Bollywood singer Mika Singh has been arrested in Dubai on the alleged sexual misconduct charges at Bur Dubai at Thursday dawn. Reports suggest that, The singer is accused of sending inappropriate photographs to a 17-year-old Brazilian girl. The complaint has been registered against him in the Muraqqabaat police station.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more