For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Waltair Veerayya నుంచి అదిరిపోయే మాస్ న్యూస్.. ఇక ఫ్యాన్స్ కు రేపు 'పూనకాలే'!

  |

  సినీ లవర్స్ కు ఉన్న ఏకైక ఎంటర్టైన్ మెంట్ సినిమా. వరుసపెట్టి సినిమాలు విడుదలైన అలసిపోకుండా చూస్తూ ఎంకరేజ్ చేస్తుంటారు. అలాగే వాళ్ల అభిమాన హీరో మూవీ ఎప్పుడెప్పుడూ రిలీజ్ అవుతుందా వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఇక తమ అభిమాన హీరోతోపాటు మరో స్టార్ హీరో ఉంటే.. ఇక వాళ్ల ఆనందానికి అవధుల్లేవు. ఇక మల్టీ స్టారర్ చిత్రాలు అంటే అభిమానుల్లో ఫుల్ జోష్ వస్తుంది.

  తమ ఫేవరెట్ హీరోలు కలిసి ఒకే ఫ్రేమ్ లో వెండితెరపై కనిపిస్తే విజిల్స్, అరుపులు, కేకలతో ఆ థియేటర్ దద్దరిల్లిపోతుంది. ఇటీవల కాలంలో మెగాస్టార్ చిరంజీవి మల్టీ స్టారర్ చిత్రాలు చేస్తూ తెగ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి మాస్ మహారాజా రవితేజ కలిసి వస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

  భారీ అంచనాలతో..

  భారీ అంచనాలతో..

  మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాతో మంచి టాక్ అందుకున్న ఆయన మరో చిత్రంతో అభిమానులను, ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో మెగాస్టార్ నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

  సంక్రాంతి కానుకగా..

  సంక్రాంతి కానుకగా..

  వాల్తేరు వీరయ్యగా మరోసారి మాస్ అవతారంతో మెస్మరైజ్ చేసేందుకు మెగాస్టార్ చిరు రెడీగా ఉన్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. సుమారు 22 ఏళ్ల తర్వాత వీరిద్దరు కలిసి నటించిన ఈ వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ చిత్రంపై అభిమానులు భారీగానే హోప్స్ పెట్టుకున్నారు.

  ఓ సాంగ్ చిత్రీకరించారని..

  ఓ సాంగ్ చిత్రీకరించారని..

  అభిమానుల అంచనాలకు తగినట్లుగానే వాల్తేరు వీరయ్యను పక్కా మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే బాసు పార్టీ స్పెషల్ నంబర్ ను ఇటీవల విడుదల చేశారు. ఆ పాటకు ఎంతటి హైప్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే చిరంజీవి, రవితేజలపై ప్రత్యేకంగా ఓ సాంగ్ చిత్రీకరించారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ ప్రత్యేక పాటకు ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేశారని బజ్ కూడా క్రియేట్ అయింది.

  పూనాకాలు లోడింగ్..

  పూనాకాలు లోడింగ్..

  మెగాస్టార్ చిరంజీవి, రవితేజ సాంగ్ కోసం రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే బీట్ సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇప్పుడు వాటన్నింటిని నిజం చేస్తూ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు వాల్తేరు వీరయ్య మూవీ మేకర్స్. బాయ్స్ అండ్ గర్ల్స్ మెగా మాస్ మోడ్ లోకి సిద్ధమైపోండి.. అంటూ.. 'మెగాస్టార్ X మాస్ మహారాజా = పూనకాలు లోడింగ్ ' సాంగ్ రేపు విడుదల అవుతోందని ట్వీట్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్.

  శంకర్ దాదా జిందాబాద్ లో..

  శంకర్ దాదా జిందాబాద్ లో..

  అంటే మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ లో ఓ స్పెషల్ సాంగ్ ను షూట్ చేశారని అర్థమవుతోంది. ఆ పాటను రేపు విడుదల చేయనున్నారు. అయితే ఏ సమయానికి రిలీజ్ చేస్తారో ప్రకటించలేదు. దీంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఆ సాంగ్ ఎలా ఉండనుందా అని ఎదురుచూస్తున్నారు.

  అయితే చిరంజీవి, రవితేజ ఒక స్పెషల్ సాంగ్ లో కలిసి నర్తించడం ఇదేం ఫస్ట్ టైమ్ కాదు. గతంలో శంకర్ దాదా జిందాబాద్ చిత్రంలో ఒక పాటలో డ్యాన్స్ వేశారు. ఇప్పుడు మరోసారి ఫ్యాన్స్ కు మెగా మాస్ ట్రీట్ ఇవ్వనున్నారు.

  అన్నదమ్ములుగా చిరు, రవితేజ..

  ఇక వాల్తేరు వీరయ్య చిత్రంలో మాస్ మహారాజా రవితేజ నిజాయితీపరుడైన, డాషింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఏసీపీ విక్రమ్ సాగర్'గా కనిపించనున్నాడు. అంతేకాకుండా ఈ చిత్రంలో రవితేజ, చిరంజీవి ఇద్దరు అన్నదమ్ములుగా నటిస్తున్నారని ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ఇందులో శ్రుతి హాసన్ తో పాటు కేథరిన్ థ్రేసా మరో హీరోయిన్ గా అలరించనుందట. రవితేజకు జోడీగా కేథరిన్ ఉండగా.. వాళ్లిద్దరి మధ్య ఘాటు లిప్ లాక్ సీన్ ఉందని టాక్.

  English summary
  Waltair Veerayya: Chiranjeevi Ravi Teja Mass Dance Number Punakalu Loading Release On December 30
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X