Don't Miss!
- Technology
WhatsApp లో కొత్త రకం స్కామ్! ఈ నంబర్లు డయల్ చేసారంటే మీ అకౌంట్ హ్యాక్ అవుతుంది. జాగ్రత్త.
- Finance
బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్‌కు క్రెడిట్ కార్డ్‌తో కుచ్చుటోపీ: రూ.లక్షలు దోపిడీ
- Automobiles
భారత్‌లో కీవే వియస్టా 300 మరియు కీవే సిక్స్టీస్ 300ఐ స్కూటర్లను విడుదల చేసిన బెనెల్లీ
- News
శ్రీలంక బాటలోనే పాకిస్తాన్ ? 180కి చేరిన పెట్రోల్-తాజాగా రూ.30 పెంపు-ఐఎంఎఫ్ షరతులతో
- Lifestyle
అధ్యయనం ప్రకారం టైప్ 2 డయాబెటిస్ వారు బరువు తగ్గడానికి సహాయపడే ఆహారం మీకు తెలుసా?
- Sports
Jos Buttler Records In Qualifier 2: జోస్ ది బాస్ దెబ్బకు పిట్టల్లా రాలిన రికార్డులు.. డేంజరేస్ ప్లేయర్ మరీ!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Sarkaru Vaari Paata లో మ..మ. మహేశా పాట.. కీర్తి సురేష్, మహేష్ బాబు రచ్చ
సర్కారు వారీ పాటలో కేవలం నాలుగు పాటలే ఉన్నాయి. కథకు అవసరం మేరకు పాటలు ఉంటాయి. ఒక థీమ్ సాంగ్ ఉంటుంది. ప్రేక్షకులను, ఫ్యాన్స్ ఇష్టపడే విధంగా ట్యూన్స్ కోసం కసరత్తు చేశాం. ఎక్కడ బలవంతంగా పాటలను ప్రేక్షకులపై రుద్దడం జరగలేదు. మహేష్ బాబుకి కూడా అలా పాటలను రుద్దడం ఇష్టం ఉండదు అని పరుశురాం తెలిపారు.
మహేష్ బాబు పేరు మీద ఓ పాట కూడా ఉంది. మే 7వ తేదీన రిలీజ్ చేస్తున్నాం. మహేష్ ఈ సినిమాలో డ్యాన్సులు ఇరుగదీశాడు. మహేష్ పేరు మీద రాసిన పాట చాలా బాగుంటుంది. ప్రేక్షకులను, అభిమానులను చాలా ఆకట్టుకొంటుంది అని పరుశురాం అన్నారు.

సర్కారు వారీ పాట సినిమా పోకిరి సినిమా మాదిరిగా ఉంటుంది. సినిమా నడిచిన కొద్ది మహేష్ క్యారెక్టర్‌లో ఎలివేషన్స్, బిల్డప్ పెరిగిపోతుంటుంది. గత సినిమాలో కంటే మహేష్ బాబు క్యారెక్టర్ పరంగా ఓపెన్ అవుతారు అని పరుశురాం అన్నారు.
సర్కారు వారీ పాట సినిమాకు తమన్ మ్యూజిక్ అదనపు ఆకర్షణ. కథకు అనుగుణంగా ఉన్న సినిమా ఇది. కళావతి, పెన్ని, మ..మ.. మహేష్ పాట కూడా కథలో భాగంగా ఉండేవే. తమన్ ఐడియాస్ చాలా హెల్ప్ అయ్యాయి.
సర్కారు వారీ పాట సినిమా మూవీ తర్వాత 14 రీల్స్ బ్యానర్‌లో సినిమా ఉంటుంది. నాగచైతన్యతో సినిమా చేస్తన్నాను. వాస్తవానికి సర్కారు వారీ పాట సినిమాకు ముందే నాగచైతన్య సినిమా ప్రారంభం కావాల్సింది. కానీ లాక్‌డౌన్ కారణంగా కుదర్లేదు. త్వరలోనే ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది అని అన్నారు.