twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Happy Birthday Ilaiyaraaja: ప్రతీ పాట ఒక సంగీతానికి ప్రాణం.. మొత్తం ఎన్ని పాటలంటే?

    |

    1970 కాల వరకు కొనసాగిన ఒక రెగ్యులర్ మ్యూజిక్ 1976 తరువాత చాలా కొత్తగా మారిపోయింది..మ్యూజికల్ మాస్ట్రోగా ఇళయరాజా సంగీత స్వరం మొదలైన అనంతరం మెలోడీ అనే పదానికి సరికొత్త అర్థం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అలుపెరగని ఆయన బాణీలు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కొత్త అనుభూతిని అందిస్తూ వచ్చాయి. ఎన్నేళ్ళు అయినా కూడా ఆయన స్వరపరిచిన పాటలు ఎవరు మరచిపోలేరు. నేడు ఈ సంగీత మేధావి 78వ వసంతంలోకి అడుగుపెట్టారు.

    ఈ సందర్భంగా సంగీత లోకం ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తోంది. ఇళయరాజా అసలు పేరు జ్ఞానతేసికన్. 1943 జూన్ 2న జన్మించిన ఇళయరాజా సంగీత స్వరకర్తగా, గాయకుడిగా, పాటల రచయితగా, వాయిద్యకారుడిగా ఎన్నో రకాలుగా గుర్తింపు అందుకున్నారు. 45ఏళ్ల పాటు ఎంతో ఎనర్జీతో సరికొత్త ఒరవడి సృష్టించిన ఇళయరాజా మరాఠీ, తెలుగు, మలయాళం, కన్నడ మరియు హిందీ చిత్రాలలో కూడా పనిచేశాడు.

    Happy Birthday maestro music director Ilaiyaraaja

    ముఖ్యంగా తెలుగు పాటలకు ఎనలేని గుర్తింపు అందుకున్నారు. రుద్రవీణ, స్వాతిముత్యం, జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి ఆల్ టైమ్ హిట్స్ ను అంధించారు. సున్నితమైన సంగీతంతో ఆయన హృదయాలను చాలా తొందరగా కదిలించగలరు. ప్రపంచంలోనే అత్యంత భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్న స్వరకర్తగా పేరుపొంది ప్రతి పాటలో ఒక ప్రాణాన్ని పోశారు. మనిషి జీవితంలో పాటలు కూడా ఒక భాగం అయ్యేలా చేశారు.

    దాదాపు 7,000 పాటలకు పైగా కంపోజ్ చేసారు, 1,000 కి పైగా సినిమాలకు ఫిల్మ్ స్కోర్లు అందించారు. ఇక 20,000 కి పైగా కచేరీలలో ప్రదర్శించారు. ఇలయరాజాకు "ఇసైజ్ఞాని" (సంగీత మేధావి) అనే మారుపేరు కూడా ఉంది. అలాగే "మాస్ట్రో" అని కూడా పిలుస్తారు. ఎనిమిది పదుల వయసు దగ్గరపడుతున్నా కూడా ఇళయరాజా ఏ మాత్రం అలుపు లేకుండా ఇంకా యాక్టివ్ గా వర్క్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం కూడా ఆయన చేతిలో 10కి పైగా సినిమాలు ఉండడం విశేషం.

    English summary
    A regular music that lasted until the 1970s became very new after 1976. After Ilayaraja's musical voice as a musical maestro, the word melody took on a whole new meaning. His songs, which have not faded since then, have been giving a new feel to everyone's life. No one can forget the songs he composed, even at the age of eight. Today marks the 78th spring of this musical genius.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X