Kantara వరాహ రూపం పాటపై కాపీరైట్ ఉల్లంఘన కేసు.. హోంబలే ఫిల్మ్స్‌పై లీగల్ యాక్షన్
కంతార చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకొన్నది. రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత నాలుగు వారాలుగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది. ఇప్పటికే ఈ చిత్రం 200 కోట్ల వసూళ్ల మైలురాయిని దాటి.. 250 కోట్ల వసూళ్ల వైపు పరుగులు పెడుతున్నది. దక్షిణ కన్నడలోని సాంస్కృతిక, సంప్రదయాల జొప్పించి తీసిన కంతార మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొన్న ఈ సినిమాపై కాపీరైట్ ఉల్లంఘటన కేసు నమోదు కావడం మీడియాలో చర్చనీయాంశమైంది. ఆ కేసు వివరాల్లోకి వెళితే. .
కంతార చిత్రంలోని అత్యంత ప్రేక్షకాదరణను సంపాదించుకొన్న వరాహ రూపం పాట తమదేనని కర్ణాటకకు చెందిన మ్యూజిక్ బ్యాండ్ థైక్కుడమ్ బ్రిడ్జీ ఆరోపణుల చేసింది. కాపీ చేయడం, కాపీ రైట్ చట్టం ఉల్లంఘనకు పాల్పడిందని కేసు నమోదు చేసింది. ఈ మేరకు కేసు వివరాలను సోషల్ మీడియాలో బ్యాండ్ సభ్యులు పోస్ట్ చేశారు.

కంతారలోని వరాహ రూపం పాట 2017లో తాము ట్యూన్ చేసిన నవరసమ్ పాటకు చాలా పోలీకలు ఉన్నాయి. మా అనుమతి లేకుండా పాటను కాపీ చేశారు. కంతార నిర్మాతపై, హోంబలే ఫిల్మ్స్‌పై చట్టపరమైన చర్యలు తీసుకొంటాం అని తైక్కుడమ్ బ్రిడ్జి నిర్వాహకులు వెల్లడించారు.
వరాహ రూపం పాటకు సంబంధించి కాపీరైట్ ఉల్లంఘన ఆరోపణలపై కంతార సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ స్పందించారు. మేము ఎలాంటి కాపీ రైట్ ఉల్లంఘనకు పాల్పడలేదు. నవరసమ్ పాటకు ఎలాంటి పోలీకలు ఉంటే.. అది యాదృచ్ఛికమే. నవరసమ్ పాటకు సంబంధించిన ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ (ఐపీ) ఉల్లంఘనకు పాల్పడలేదు అని అజనీస్ అన్నారు.


Click it and Unblock the Notifications











