A. R. Rahman Le Musk: సరికొత్త టెక్నాలజీతో రెహమాన్ మ్యాజిక్.. అద్భుతమైన రెస్పాన్స్
ప్రపంచవ్యాప్తంగా తన మ్యూజిక్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అందుకున్న సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్.రెహమాన్ ఇప్పుడు సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. రెహమాన్ తన కంపోజింగ్ తోనే ఎన్నో విభిన్నమైన వాయిద్యాలను సంగీత ప్రపంచంలోకి తీసుకు వచ్చి మంచి ప్రాముఖ్యతను తీసుకు వచ్చారు. ఇక దేశ విదేశాల్లో కూడా ఆయన పనితనానికి మంచి గుర్తింపు లభిస్తోంది. ఇక సినిమాటిక్ సెన్సరీ అనుభవాన్ని కూడా విస్తరింప చేయనున్నాడు.
లే మస్క్ అనే 37 నిమిషాల సినిమా సెన్సరీ అనుభవాన్ని ప్రజలకు చూపించబోతున్నారు. రెహమాన్ దర్శకత్వం వహించబడమే కాకుండా మ్యూజిక్ అందించారు. ఇక దేశవ్యాప్తంగా ఇప్పుడు చాలామంది ఈ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటున్నారు. రెహమాన్ ఎంత అడ్వాన్స్ డ్ గా ఆలోచిస్తారో కూడా మరోసారి అర్థమయ్యింది. ఇక చాలామంది ప్రముఖులు ప్రత్యేకంగా ఆ అనుభవం చెందేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక బ్లాక్ చేయిం సీఈఓ జిమ్మి నీగున్ కూడా రెహమాన్ అద్భుత సృష్టి గిరించి వివరణ ఇచ్చారు.

మెగా వేర్స్ మొదలైంది అంటూ.. VR, చలనం, సంగీతం, సువాసన + అద్భుతం. ఇక లాస్ ఏంజిల్స్ లో లే మస్క్ ను అనుభూతి చెందేందుకు రెడీగా ఉన్నట్లు చెప్పారు. ఆస్కార్, గ్రామీ అవార్డుల విజేత ఏఆర్ రెహమాన్ నుండి 1వ సినిమా సెన్సరీ చిత్రీకరించిన అనుభవాన్ని ఆస్వాదించాను అని అన్నారు. ఇక ఎ.ఆర్ రెహమాన్ ను చూడడం నా అదృష్టం. దుబాయ్‌లో సాధ్యమయ్యే దాని ప్రివ్యూను చూస్తే అసలైన అనుభవాన్ని చూస్తామని అన్నారు. ఇక రెహమాన్ ట్విట్టర్ లో అతనికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ మరింత విస్తరింపజేయలని పేర్కొన్నారు.
ఒకవైపు రెహమాన్ సినిమాలు చేస్తూనే మరోవైపు బిగ్ బడ్జెట్ సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ కు సంబంధించిన ఈవెంట్స్ లలో కూడా రెహమాన్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. టెక్నాలజీని మ్యూజిక్ కు తగ్గట్టుగా వాడుకోవడంలో రెహమాన్ తరువాత ఎవరైనా గతంలోనే ఆయన చాలా రకాల ప్రయత్నాలు చేశారు. ఇక ఇటీవల రెహమాన్ తమిళ్ పాన్ ఇండియా మూవీ పొన్నియిన్ సెల్వన్ 1 కు అద్భుతమైన సంగీతం అందించి సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించారు.


Click it and Unblock the Notifications











