కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో త్వరలో 'ఇండియన్ 2' చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు 23 ఏళ్ల గ్యాప్ తర్వాత వీరు కలిసి చేస్తున్న చిత్రం కావడం, లోకనాయకుడు పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ముందు చేస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కావడంతో భారీ అంచనాలున్నాయి.
ఆల్రెడీ 'ఇండియన్ 2' షూటింగ్ మొదలైంది. కమల్ హాసన్ మరోసారి స్వాతంత్ర్య సమరయోధుడు సేనాపతి పాత్రలో ప్రేక్షకులను మెప్పించబోతున్నాడు. 1996లో వచ్చిన 'ఇండియన్' మూవీ అంత పెద్ద విజయం సాధించడానికి ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం కూడా హెల్ప్ అయింది. అయితే ఇపుడు తీస్తున్న సీక్వెల్‌కు ఆయన్ను కాకుండా... యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌ను శంకర్ ఎంచుకోవడం చర్చనీయాంశం అయింది.
కమల్ హాసన్ నన్నే కోరుకున్నారు
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రెహమాన్ మాట్లాడుతూ ‘ఇండియన్ 2' గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. కమల్ హాసన్ తనను సంగీత దర్శకుడిగా పెట్టాలని కోరారని, అయితే శంకర్ మాత్రం తనకు నచ్చిన వ్యక్తిని ఎంచుకున్నాడని తెలిపారు.
కొన్సిసార్లు బోర్ అనిపిస్తుంది
అయితే కొన్ని సార్లు వరుసగా ఒకరితోనే కలిసి పని చేయడం కూడా బోరింగ్ అనిపిస్తుంది. అందులో పెద్ద ఛాలెజింగ్ ఏమీ ఉండదు. శంకర్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనక అది కూడా ఓ కారణం అయుండొచ్చు అని రెహమాన్ చెప్పుకొచ్చారు.
నాతో మరింత ఓవర్ వర్క్ చేయించడం ఇష్టం లేకనే?
2.0 గురించి రెహమాన్ మాట్లాడుతూ.. అది చాలా కష్టమైన ప్రాజెక్ట్ అని వెల్లడించారు. ఆ సినిమా వల్ల చాలా అలసి పోయాం. నాతో మరింత ఓవర్ వర్క్ చేయించడం ఇష్టం లేకనే ఆయన ‘ఇండియన్ 2' మూవీ విషయంలో అనిరుధ్ రవిచందర్‌ను ఎంచుకోవడానికి కారణం అయుండొచ్చు అన్నారు.
‘ఇండియన్ 2' చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. కాజల్ అగర్వాల్ కథానాయిక. ఢిల్లీ గణేష్, సిద్ధార్థ్ కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటి ట్రెండుకు తగిన విధంగా దేశంలో జరుగుతున్న అవినీతి కుంభకోణాలపై ఈ చిత్రం ఉంటుందని సమాచారం.
In a recent interview to a media portal, AR Rahman revealed some interesting details about Indian 2. He said, "Kamal kept asking me to compose for Indian 2. But, Shankar had to make the choice. Shankar is a person who wants to get inspired. Sometimes, when you work with the same person back-to-back you get bored. There is no challenge in that. You know you'd get a calibre of music when you go to the same person."
Story first published: Friday, February 1, 2019, 15:58 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more