దేవేరీ.. నువ్వే నా ఊపిరి.. క్రేజీగా గుణ 369 పాట.. కార్తీకేయ, అనఘ కెమిస్ట్రీ..

RX 100 చిత్రంతో యూత్‌లో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకొన్న హీరో కార్తీకేయ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఓ పక్కా హిప్పీ సినిమాను ట్రాక్‌పై పరుగెత్తిస్తూనే మరో వైపు మూడో సినిమా స్పీడ్ పెంచాడు. స్పింట్ ఫిల్మ్స్, జాపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల నిర్మాతలుగా, అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో గుణ 369 చిత్రం విడుదలకు సిద్ధమైంది. శివ మల్లాల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆగస్గు 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో శుక్రవారం జూలై 26వ తేదీన మరో పాటను రిలీజ్ చేశారు.

దేవేరి.. నువ్వే నా ఊపిరి.. నీ కోసం పుట్టాడీ పూజారి, దేవేరీ జన్మ నీదే.. నీతోనే వందేళ్ల పూదారి అనే పాటను యూట్యూబ్ వీడియోగా విడుదల చేశారు. 'నిజమిది నిజం ఇరువురం ఒకటే', 'దీవనలిదే తధాస్తని..పలికేనే'.. 'శుభ సమయం, తనువుల సగం, ఒకటిగా ఒదిగే, క్షణం నీ మదువుల పెదాలకే'.. 'నువు నాకు విలువైన కానుక.. నిజమిది నిజం ఇరువురం ఒకటే' పద ప్రయోగంతో ఫీల్‌గుడ్‌ పాట సాగింది. దేవేరి పాటలో విజువల్స్ కూడా ఆకట్టుకొనేలా ఉన్నాయి. హీరో కార్తీకేయ, అనఘ మధ్య కెమిస్ట్రీ కూడా సెన్సిబుల్‌గా కనిపించింది.

Kartikeya another song released in Guna 369

టీజర్లు, ట్రైలర్లు విడుదలై సోషల్ మీడియా, యూట్యూబ్‌లో మంచి హల్ చల్ చేస్తున్నాయి. బోయపాటి శిష్యుడు అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X