Singer KK మృతిపై అనుమానాలు.. కోల్‌కత్తా పోలీసుల ఇచ్చిన క్లారిటీ ఏమిటంటే?

ప్రముఖ గాయకుడు కేకే అలియాస్ కృష్ణకుమార్ మరణం తర్వాత అనేక అనుమానాలు, ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. అసహజ మరణం కింద కేసు నమోదు చేసుకొన్న కోల్‌కత్తా పోలీసులు ఆ రోజు నజ్రూల్ మంచ్ వద్ద జరిగిన సంఘటనలపై దర్యాప్తు చేస్తున్నారు. కేకే ముఖంపై గాయాలు ఉండటం అనేక అనుమానాలకు దారి తీసింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

కేకే మరణానికి ముందు..

కేకే మరణానికి ముందు..


కేకే మరణానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బుధవారం రాత్రి కోల్‌కతాలో సంగీత విభావరి నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ఆద్యంతం హుషారుగా కనిపించారు. మధ్యలో గాలి ఆడకపోవడంతో ఇబ్బందికి గురైనట్టు వీడియోలో కనిపించారు. ఆ తర్వాత ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను హోటల్‌కు తరలించారు. అక్కడ ఆయన సృహతప్పి పడిపోవడంతో హాస్పిటల్‌కు తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఆయన మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఆయన అంత్యక్రియలను గురువారం ఉదయం ముంబైలో నిర్వహించారు. అయితే వేదిక వద్ద సరైన ఏర్పాట్లు చేయడంలో నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విషయంపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు.

 స్టేజ్ వద్ద జనం చుటుముట్టడంతో

స్టేజ్ వద్ద జనం చుటుముట్టడంతో


కోల్‌కత్తాలోని నజ్రూల్ మంచ్ సభాస్థలి వద్దకు సంగీత విభావరిని నిర్వహించేందుకు 6.22 గంటల ప్రాంతంలో కేకే వచ్చారు. అప్పటికే ఆడిటోరియంలోకి కెపాసిటీ కంటే.. పరిమితి కంటే ఎక్కువగా అభిమానులు వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో రాత్రి 7.05 గంటకలు కేకే స్టేజ్‌పైకి వెళ్లారు. అతడు స్టేజ్‌పైకి వెళ్లగానే జనం ఆయనను చుట్టుముట్టారు. వేదిక వద్ద ఎక్కువ మంది పోలీస్ సెక్యూరిటీని అక్కడ ఏర్పాటు చేశాం అని కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ తెలిపారు.

ఏసీలు పనిచేయకపోవడం వల్లే

ఏసీలు పనిచేయకపోవడం వల్లే


మ్యూజికల్ కాన్సెర్ట్ నిర్వహిస్తున్న సమయంలో కేకే చెమటలు తుడుచుకోవడం కొన్ని వీడియోలలో స్పష్టంగా కనిపించింది. ఉక్కబోత, గాలి ఆడకుండా ఉండటం వల్లే ఆయన ఆరోగ్యం క్షీణించిందనే ఆరోపణలు భారీగా సోషల్ మీడియాలో వచ్చాయి. అయితే ఆడిటోరియంలో ఎయిర్ కండీషనర్లు పనిచేస్తున్నాయి. ఏసీలు పనిచేయడం లేదనే ఆరోపణలు చేయడంలో వాస్తవాలు లేవు అని వినీత్ గోయల్ పేర్కొన్నారు.

పోలీసులు జాగ్రత్తలన్నీ తీసుకొన్నారంటూ

పోలీసులు జాగ్రత్తలన్నీ తీసుకొన్నారంటూ


కేకేకు అత్యంత ప్రజాదరణ ఉండటంతో అభిమానులు భారీగా పొటెత్తారు. అయితే ఊహించని సంఘటనలు చోటుచేసుకోకుండా తగిన జాగ్రత్తలు పోలీసులు తీసుకొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో చికిత్స అందించడానికి మెడికల్ పరికరాలు, వసతులు ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్త చర్యలన్నీ తీసుకొన్నారు అని వినీత్ గోయల్ చెప్పారు.

 వీడియోలను సాక్ష్యంగా

వీడియోలను సాక్ష్యంగా


కేకే స్టేజ్‌పై ఉండగా ఎలాంటి తొక్కిసలాట గానీ, లేదా తోపులాట గానీ జరుగలేదు. ప్రేక్షకులు వేదిక వద్ద ప్రశాంతంగా నిలబడి.. డ్యాన్సులు చేస్తూ కనిపించారు. ఆ సమయంలో తీసిన వీడియోలు మా వద్ద ఉన్నాయి. జన సమూహంలో తోపులాట జరగలేదని పలు వీడియోలు చేసిన తర్వాత స్పష్టమైన హామీ ఇస్తున్నా అని పోలీస్ అధికారి తెలిపారు.

 అగ్నిమాపక సాధనాలతో

అగ్నిమాపక సాధనాలతో

కేకే ఉన్న వేదిక వద్ద భారీగా గుమ్మిగూడిన అభిమానులను చెదరగొట్టేందుకు అగ్నిమాపక సాధనాలను ఉపయోగించింది నిజమే. అభిమానులను నియంత్రించడానికి ఎక్స్‌టింజర్లను పోలీసులు ఉపయోగించారు. ఆ తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది అని వినీత్ గోయల్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X