రొమాంటిక్ టచ్‌తో కోమలి ప్రసాద్.. రక్షిత్ అట్లూరి.. శశివదనే ప్రోమోకు క్రేజీ రెస్పాన్స్
గ్రామీణ నేపథ్యంతో ప్రేమ కథలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. ఇక కంటెంట్ ప్రధానమైన చిత్రాలకు భారీ ఆదరణ దక్కుతుందనేది కంతార లాంటి సినిమాలు నిరూపించాయి. లవ్, రొమాన్స్, ఫీల్ గుడ్ అంశాలతో వస్తున్న చిత్రం శశివదనే. రక్షిత్ అట్లూరి హీరోగా, కోమలి ప్రసాద్ హీరోయిన్‌గా లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందింది. గోదావరి నేపథ్యంలో సినిమా తెరకెక్కుతున్నది. గౌరి నాయుడు సమర్పణలో ఎస్‌వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏజిఫిల్మ్ కంపెనీ బ్యానర్లపై సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో అహితేజ బెల్లంకొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుంది. రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన ఈ చిత్రంలో ప్రవీణ్ యండమూరి, తమిళ నటుడు శ్రీమాన్, కన్నడ నటుడు దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ కీలక పాత్రల్లో నటించారు.
నిర్మాత అహితేజ బెల్లంకొండ 'శశివదనే' టైటిల్ ప్రోమోను శుక్రవారం విడుదల చేశారు. ప్రోమోను గమనిస్తే కోమలి ప్రసాద్ దేవుడికి పూజ చేసి తులసి చెట్టుకు దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఆమె ప్రేమికుడు ఇంటి దగ్గరకు వచ్చాడని తెలియగానే ఆనందంతో మేడ పైకి పరుగులు తీస్తుంది. ప్రోమో చాలా నేచురల్‌గా, కలర్‌ఫుల్‌గా ఆకట్టుకుంటోంది.

హరి చరణ్, చిన్మయి శ్రీపాద పాడిన ఈ పాటను సినిమాలో తొలి పాటగా అలరించనుంది. శ్రవణ వాసుదేవన్ సంగీతం అందించిన సంగీతం చాలా క్యూట్‌గా ఉంది. కిట్టు విస్సాప్రగడ సాహిత్యం ట్యూన్‌కు తగ్గట్లు అందంగా ఉన్నాయి. శశివదనే పూర్తి టైటిల్ సాంగ్‌ను మేకర్స్ ఫిబ్రవరి 1న రిలీజ్ చేస్తున్నారు. ఈ వింటేజ్ మెలోడి తప్పకుండా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. కోనసీమ, అమలాపురం తదితర ప్రాంతాల్లో 50 రోజులకు పైగానే ఈ సినిమాను చిత్రీకరించారు.
నటీనటులు: రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్, శ్రీమాన్, దీపిక్ ప్రిన్స్ తదితరులు
సమర్పణ: గౌరీ నాయుడు
నిర్మాత: అహితేజ బెల్లంకొండ
రైటర్, డైరెక్టర్: సాయి మోహన్ ఉబ్బన.
ఎడిటర్: గ్యారీ బి.హెచ్
కలరిస్ట్: పంకజ్ సారధి స్టూడియోస్
సీఈవో: ఆశీష్ పెరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీపాల్ చోలేటి
సినిమాటోగ్రాఫర్: సాయికుమార్ దార
పాటలు: కిట్టు విస్సా ప్రగడ, కరుణాకర్ అడిగర్ల,
మ్యూజిక్: శ్రవణ వాసుదేవన్,
స్టంట్స్: జాషువా - జీవన్,


Click it and Unblock the Notifications











