For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అన్నదాతకు స్ఫూర్తి నింపేలా.. రైతుగా మహేష్ కేక.. గుండెను పిండేసే గేయంగా

|

సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే నటించిన మహర్షి చిత్రం విడుదలకు ముస్తాబవుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన పాటలను చిత్ర యూనిట్ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పదర పదర పదరా అంటూ పాటను మహర్షి టీం రిలీజ్ చేసింది. ఇప్పటికే విడుదలైన పాటలు వైరల్ కాగా, తాజా పాట కూడా ఉద్వేగంగా సాగింది. ఆ పాట మీరే వినండి...

రైతులకు స్ఫూర్తి నింపేలా పాట

ప్రస్తుతం కష్టాల్లో ఉన్న రైతులకు ఈ పాట స్ఫూర్తి నింపేలా ఉంది. ప్రిన్స్ మహేష్ నాగలి భుజాన ఎత్తుకోవడం, పొలంలో నాట్లు వేయడం ప్రేక్షకులను ఆకట్టుకొనేలా ఉంది. అన్నదాతకు అండగా సమాజానికి ఓ సందేశం ఇచ్చే సినిమాగా రూపొందుతున్నదనే భావనను ఈ పాట కలిగింది. ప్రతీ వ్యక్తికి వ్యవసాయంపై అవగాహన కలిగించేలా ఈ పాటను రూపొదించారు. పాటలోనే పదాలు రొమాలు నిక్కబొడిచే విధంగా ఉన్నాయి.

భళ్లుమని నింగి ఒళ్లు విరిగెను అంటూ సాగే పాట

భళ్లు మంటూ నింగి ఒళ్లు విరిగెను గడ్డి పరుకతోనా

ఎడారి కళ్లు తెరుచుకొన్న వేళన చినుకు పూల వాన
సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే
శిరసు వంచి శిఖరం అంచు ముద్దడితే మట్టి నేలనే
పదర పదర పదరా.. నీ అడుగుకు పదును పెట్టి పదరా
ఈ అడవిని చదును చెయ్యి మరి
వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదారా అంటూ సాగే పాడ సినీ ప్రేక్షకుడినే కాకుండా ప్రతీ వ్యక్తిని ఆలోచింప జేసేలా ఉంది.

శ్రీమణి, దేవీ, శంకర్ మహాదేవన్ మ్యాజిక్

సమాజ బాధ్యతను గుర్తు చేసే విధంగా సినీ రచయిత శ్రీ మణి ఆ గేయాన్ని అందించారు. ఆ పదాలకు తనదైన సంగీతాన్ని అందించి దేవీ శ్రీ ప్రసాద్ పాటను ఎమోషనల్‌గా మలిచారు. పదర పదరా సాంగ్‌ను శంకర్ మహాదేవన్ ఆలపించారు. ఈ పాటను చూస్తే మహేష్ కెరీర్‌లో మరో ఉత్తమ చిత్రంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మే 9వ తేదీన రిలీజ్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పీవీపీ సినిమా బ్యానర్లపై దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అశ్వినీదత్‌కు సెంటిమెంట్‌గా మారిన మే 9న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఇదే తేదీన జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి చిత్రాలు విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

English summary
Maharshi is next upcoming film of Superstar Mahesh Babu. Vamshi Paidipally is the director and the entire shoot of Maharshi got completed recently. After two impressive singles from the film, the third song with a minute long video byte is out. The song that comes on the lines 'Everest Anchuna' strikes hard and is a perfect feast for Superstar's fans.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more