Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
సర్కారు వారి పాట దెబ్బ.. త్రివిక్రమ్ సినిమాకు అతను వద్దంటున్న మహేష్?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో ఎలాగైనా భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఆ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. కలెక్షన్స్ పరంగా చూసుకుంటే చాలా ఏరియాలో సినిమాకు పెట్టిన పెట్టుబడిలో కొంత నష్టాలు కలిగినట్లు సమాచారం. పూర్తి స్థాయిలో అయితే సర్కారు వారి పాట సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ టార్గెట్ను పూర్తి చేయలేదు.
ఒక విధంగా మహేష్ బాబు ఈ సినిమాకు చేసిన ప్రమోషన్స్ అలాగే సినిమాలో అతని స్టార్ ఇమేజ్ జనాలను థియేటర్స్ కు రప్పించాయాని చెప్పవచ్చు. అయితే సర్కారు వారి పాట సినిమా విషయంలో మహేష్ బాబు ఎందుకు ఫ్లాప్ అయిందని అంశాలను కూడా మరోసారి చర్చిల్లోకి తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఒక విధంగా ఈ సినిమాకు మ్యూజిక్ బాగానే ఉపయోగపడినప్పటికీ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో అయితే థమన్ పూర్తిస్థాయిలో న్యాయం చేయలేదు అనే కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి.

ఇక ఆ విషయంలో కూడా మహేష్ బాబు మరొకసారి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ చేయబోయే సినిమాకు కూడా థమన్ మ్యూజిక్ డైరెక్టర్ ముందే సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే SSMB28 సినిమాకు మళ్ళీ థమన్ పనిచేయడం ప్రేక్షకులకు కాస్త బోరింగ్ అనిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు అతను వద్దని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక మహేష్ బాబు కూడా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మరోసారి త్రివిక్రమ్ తో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కొనసాగుతున్న అనిరుద్ రవిచంద్రన్ అయితే బెటర్ గా ఉంటుంది అని మహేష్ బాబు ఆలోచిస్తున్నాడట. అయితే ఇది వరకే త్రివిక్రమ్ తో అనిరుద్ అజ్ఞాతవాసి సినిమాకు పని చేశాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ అరవింద సమేతజూ కూడా సంగీతం ఇవ్వాల్సింది. కానీ ఆ తర్వాత ఎందుకు అతను డ్రాప్ అయ్యాడు. మరి ఇప్పుడు మహేష్ ఆలోచన మేరకు అతనిని తీసుకు వస్తారో లేదో చూడాలి.