For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Happy Birthday AR Rahman: నాలుగేళ్ళకే సంగీతం.. ఏఆర్ రెహ్మాన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా!

  |

  తన మ్యూజిక్ తో ఎవరినైనా సరే చాలా ఈజీ గా ఆకట్టుకునే అతికొద్ది సంగీత దర్శకులలో ఏఆర్.రెహమాన్ ఒకరు. భాషలతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అతని మ్యూజిక్ ఎంతగానో క్రేజ్ అందుకుంది. కీబోర్డ్ తో పాటు ఎలాంటి మ్యూజిక్ వాయించినా కూడా ఏ ఆర్ రెహమాన్ శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటారు. రెహమాన్ పాటలు అంటే ఇష్టపడని వారు ఉండరనే చెప్పాలి. 1990 కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతో మంది సంగీత దర్శకులు వచ్చారు వెళ్లి పోయారు కానీ కొందరు మాత్రమే ఇప్పటివరకు అప్డేటెడ్ గా కొనసాగుతున్నారు.

  ఇక అందులో రెహమాన్ అయితే మొదటి నుంచి కూడా నెంబర్ వన్ స్థానం లోనే ఉన్నారు అనే చెప్పాలి. ఇక నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో విషెస్ అందిస్తున్నారు. ఒకసారి ఆయన జీవితంలోని అంశాలపై ఒక లుక్కేస్తే..

  సంగీత వాయిద్యాలతో బాల్యం

  సంగీత వాయిద్యాలతో బాల్యం

  నాలుగేళ్లకే బొమ్మలతో ఆడుకోవాల్సిన వయసులో రెహ్మాన్ సంగీత వాయిద్యాల తో తన బాల్యాన్ని కొనసాగించాడు. ఇక చిన్నతనంలోనే తండ్రి మరణం కుటుంబాన్ని ఆర్థికంగా చాలా వెనక్కి నెట్టివేసింది. ఆ సమయంలో రెహమాన్ చాలా ఓపిక తో మ్యూజిక్ పై ఫోకస్ పెట్టే కుటుంబాన్ని పోషించాడు.

  హిందువు నుంచి ముస్లింగా..

  హిందువు నుంచి ముస్లింగా..

  1967 జనవరి 6వ తేదీన జన్మించిన AS దిలీప్ కుమార్ 23 సంవత్సరాల వయస్సులో, 1989లో తన కుటుంబంలోని ఇతర సభ్యులతో కలిసి ఇస్లాంలోకి మారాడు, తన పేరును అల్లారఖా రెహమాన్ (A. R. రెహమాన్)గా మార్చుకున్నాడు. రెహమాన్ కు ఒక సోదరి ఉన్మారు. రెహమాన్ మేనల్లుడు జీవి.ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడిగా హీరోగా తమిళ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ అందుకున్నాడు. ఇక రెహమాన్ 1995లో సైరా భాను అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు ఉన్నారు.

  తండ్రి మరణంతో..

  తండ్రి మరణంతో..

  ఇక రెహ్మాన్ చిన్నతనం నుంచే సంగీతాన్ని అలవర్చుకున్నాడు. రెహమాన్ తండ్రి ఆర్ కే శేఖర్ మలయాళం సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు అందుకున్నారు. ఆ సమయంలో తండ్రితోనే ఉంటూ కీబోర్డ్ ను కూడా వాయిస్తూ ఉండేవాడు. అయితే రెహమాన్ టీనేజ్ వయసులోకి రాకముందు కి తండ్రి మరణించాడు. ఆ సమయంలో రెహమాన్ తల్లి ప్రేమ ఒక ఆశ్రమంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించారు.

  కోటి దగ్గర సహాయకుడిగా..

  కోటి దగ్గర సహాయకుడిగా..

  ఆ తరువాత చదువు పై ఎక్కువ ఫోకస్ పెట్టలేక మ్యూజిక్ స్కూల్ లో అతను చేరి మంచి గుర్తింపును అందుకున్నాడు. ఆ తరువాత కొంత మంది సంగీత పండితుల దగ్గర కూడా వర్క్ చేసి తన స్థాయిని పెంచుకున్నాడు. సంగీత దర్శకుడు కోటి దగ్గర కూడా రెహమాన్ కొన్నాళ్ళు వర్క్ చేశాడు. ఇళయరాజా, ఎమ్మెస్ విశ్వనాథన్ వంటి అగ్ర సంగీత దర్శకుల వద్ద కూడా మెయిన్ అసిస్టెంట్ గా వర్క్ చేశారు.

  వరుస మ్యూజికల్ హిట్స్

  వరుస మ్యూజికల్ హిట్స్

  ఒకవైపు సహాయక సంగీతదర్శకుడిగా పని చేస్తూనే ఉంటూ మరోవైపు కొన్ని ప్రైవేట్ యాడ్స్ కు కూడా మ్యూజిక్ అందిస్తూ ఆదాయాన్ని అందుకుంటూ వచ్చాడు. 1992లో మణిరత్నం రోజా సినిమాతో అవకాశం ఇవ్వడంతో రెహమాన్ ఒక్కసారిగా బిజీ అయ్యాడు. ఆ తర్వాత ప్రేమ దేశం, బాంబే, జెంటిల్మెన్ ఒకే ఒక్కడు, ప్రేమికుడు వంటి వరుస హిట్స్ తో తన స్థాయిని పెంచుకున్నాడు. హిందీలో ఆర్జీవి రాంగీల కూడా మంచి హిట్ గా నిలిచింది.

  బిజీబిజీగా సినిమాలు

  బిజీబిజీగా సినిమాలు

  రెహమాన్ పాట కంపోజ్ చేసిన కూడా సినిమాకు చాలా హెల్ప్ అయ్యే విధంగా చేసేవాడు. ఏడాదికి పదికి పైగా సినిమాలు చేస్తూ వచ్చిన రెహమాన్ ప్రతి రోజు చాలా బిజీగా ఉండేవారు. తెలుగు తమిళ్ హిందీ లోనే కాకుండా ఇంగ్లీష్ చైనీస్ లో కూడా ఆయన కొన్ని సినిమాలు చేసి ఆస్కార్ అవార్డును అందుకునే వరకు వెళ్లారు. స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకి రెహమాన్ ఆస్కార్ అందుకున్నాడు.

   టాప్ రెమ్యునరేషన్

  టాప్ రెమ్యునరేషన్

  ఇక ఏ మాయ చేసావే సినిమా తోపాటు కొమరం పులి వంటి తెలుగు సినిమాలు చేశారు. ఇక రెహమాన్ చాలా వరకు రెమ్యునరేషన్ విషయంలో నిబద్ధతతో ఉంటారు. కాన్సెప్ట్ నచ్చిన చిన్న సినిమా అయితే ఆ సినిమా బడ్జెట్ కు తగ్గట్టుగా తీసుకుంటారు. ఇక పెద్ద సినిమలైతే 9 కోట్ల నుంచి 13 కోట్ల మధ్యలో తీసుకుంటారని సమాచారం. రెహమాన్ దగ్గర వర్క్ చేసిన అగ్ర సంగీత దర్శకుల్లో హరీష్ జై రాజ్ ఒకరు.

  English summary
  music director ar rahman birthday and top remuneration details..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X