twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి గారి సినిమాకు మ్యూజిక్ ఎలా ఇవ్వాలో నాకు తెలుసు.. ఆచార్య విషయంలో జరిగింది ఇదే: మణిశర్మ

    |

    కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఆ తర్వాత చాలామంది వివిధ రకాలుగా దర్శకుడిపై విమర్శలు చేశారు. రామ్ చరణ్ ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక విడుదలకు ముందు భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదల తర్వాత మాత్రం ఒక్కసారిగా నిరాశపరచడంతో ఆర్థికంగా కూడా నష్టపోవాల్సి వచ్చింది.

    నష్టపోయిన మొత్తాన్ని వెనక్కి తిరిగి ఇవ్వాలని కూడా కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే సినిమా ఫలితంపై మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ స్పందించిన విధానం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. మెగాస్టార్ చిరంజీవి మణిశర్మ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు మ్యూజికల్ హిట్ గా నిలిచిన విషయం తెలిసింది. ఇంతకు ముందు వీరి కలయికలో వచ్చిన ఇంద్ర ఠాగూర్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఒక రేంజ్ లో సక్సెస్ అయ్యాయి.

    Music director mani sharma about acharya music composing

    ఇక మళ్ళీ చాలా కాలం తరువాత మళ్ళీ వీరి కాంబినేషన్లో వచ్చిన ఆచార్య సినిమాకు మంచి గుర్తింపు లభించింది.ఇక ఇటీవల ఆలీతో సరదాగా షోకు గెస్ట్ గా వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఆ సినిమా విషయంలో జరిగిన పొరపాటు గురించి వివరణ ఇచ్చారు. ఆచార్య సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయం సెట్ కాలేదు అని టాక్ వచ్చింది అని అది అలా ఎందుకు జరిగింది అనే ప్రశ్నకు మణిశర్మ ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

    Music director mani sharma about acharya music composing

    నేను చిరంజీవి గారి సినిమాలకు వర్క్ చేసి ఇండస్ట్రీకి వచ్చాను. ఆయన సినిమాలకు మ్యూజిక్ ఎలా ఇవ్వాలో నాకు తెలుసు. అందుకు తగ్గట్టుగానే ఆచార్య సినిమాకు ఒక వెర్షన్ చేశాను. కానీ ఆ తర్వాత దర్శకుడు వచ్చి మీరు ఏదైతే అనుకుంటున్నారో అలా వద్దు మరొకటి కొత్తగా చేయాలి అన్నారు. దీంతో ఆ విధంగా మ్యూజిక్ కొత్తగా ట్రై చేయాలని అనుకొని చేశాము. కొన్ని సార్లు అలా కొత్తగా కూడా ట్రై చేయాలి అని చేశాము అని మణిశర్మ తెలియజేశాడు.

    English summary
    Music director mani sharma about acharya music composing..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X