గాలి సంపత్ కోసం న్యాచురల్ స్టార్.. రాజేంద్ర ప్రసాద్, శ్రీవిష్ణులపై నాని కామెంట్స్
న్యాచురల్ స్టార్ నాని తాజాగా శ్రీ విష్ణు సినిమా కోసం ముందుకు వచ్చాడు. శ్రీవిష్ణు, రాజేంద్ర ప్రసాద్ వంటి నటులతో వస్తోన్న విభిన్న చిత్రం గాలి సంపత్. అనిల్ రావిపూడి సమర్పిస్తోన్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. పోస్టర్లతోనే సినిమాపై హైప్ పెంచేశారు. తాజాగా నాని చేతుల మీదుగా మొదటి పాటను రిలీజ్ చేయించారు. ఫిఫిఫి అంటూ మొదలైన ఈ పాటను కాసేపటి క్రితమే నాని విడుదల చేశాడు.
గాలి సంపత్ పాటను రిలీజ్ చేసిన నాని.. ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా రాజేంద్రప్రసాద్, శ్రీవిష్ణుల నటనపై కామెంట్ చేశాడు. దేవుడు బహుమతిగా ఇచ్చిన ఇద్దరు మంచి నటులు కలిసి చేసిన చిత్రం గాలి సంపత్.. ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయడం ఎంతో హ్యాపీగా ఉందంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై శ్రీవిష్ణు స్పందించాడు.

గాలి సంపత్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసి ప్రమోషన్స్‌లో భాగమైనందుకు శ్రీవిష్ణు ధన్యవాదాలు తెలిపాడు. థ్యాంక్యూ సో మచ్ నాని గారు.. నాకు సంబంధించిన ప్రతీ సినిమాకు కంటిన్యూగా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అంటూ ఎమోషనల్ అయ్యాడు. శ్రీవిష్ణు గాలి సంపత్ అప్డేట్ ఇవ్వడమే కాకుండా.. మరో వైపు కొత్త సినిమాను కూడా లాంచ్ చేశాడు. భళా తందనాన అనే కొత్త మూవీని ప్రారంభించేశాడు.


Click it and Unblock the Notifications











