కరోనాతో ప్రముఖ గాయని కన్నుమూత.. ముఖ్యమంత్రి తీవ్ర దిగ్బ్రాంతి..

కరోనా మహమ్మారి మరో సినీ ప్రముఖురాలిని బలి తీసుకొన్నది. ఒడిశా సినీ రంగంలో అద్భుతమైన గాయనిగా రాణిస్తున్న తపు మిశ్రా కోవిడ్19 బారిన పడి తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 36 సంవత్సరాలు. తపు మిశ్రా మరణంతో సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. తపు మిశ్రా మరణవార్త తెలుసుకొని తీవ్ర దిగ్బ్రాంతికి గురైన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆమెకు సంతాపం వ్యక్తం చేశారు.

కొద్ది రోజుల క్రితం కరోనావైరస్ పాజిటివ్ గురైన తపు మిశ్రా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆక్సిజన్ లెవెల్స్ 45కు పడిపోవడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆమె ఊపిరితిత్తులు తీవ్రంగా పాడైపోవడంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. మే 19 నుంచి హాస్పిటల్‌లో చికిత్స పొందున్న ఆమె జూన్ 21న మరణించారు. మే 10వ తేదీన తపు మిశ్రా తండ్రి కూడా మృతి చెందడంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఆ బాధ నుంచి తేరుకొక ముందే తపు మిశ్రా కూడా ఈ లోకం వీడటం మరింత విషాదంగా మారింది.

Popular Singer Tapu Mishra died with Coronavirus positive, CM Naveen Patnaik condolences

తపు మిశ్రా కెరీర్ విషయానికి వస్తే.. కులనందన్ చిత్రంతో ఒడియా సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. దాదాపు రెండు దశాబ్దాల కాలంలో 150కిపైగా చిత్రాల్లో పాటలు పాడారు. పలు భజనలను ఆలపించారు.

తపు మిశ్రా మరణంపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పందిస్తూ.. పాపులర్ ఒడియా సింగర్ తపు మిశ్రా ఇకలేరనే వార్త తీవ్ర విషాదానికి గురిచేసింది. ఆమె ప్రతిభను ఒడియా సంగీత ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకొంటుంది. ఆమె స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం అంటూ ఆయన ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X