Don't Miss!
- News
అటెన్షన్ అమరావతి: అందరి చూపూ అటు వైపే..!!
- Sports
పాపం సర్ఫరాజ్‌ఖాన్.. సెలెక్టర్ల బాక్స్ బద్దలు కొట్టినా ఎంపికవ్వలేదు: రవిచంద్రన్ అశ్విన్
- Lifestyle
సంబంధంలో సాన్నిహిత్యం, నమ్మకాన్ని పెంపొందించడానికి చిట్కాలు
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Pragya Jaiswal సల్మాన్ ఖాన్‌తో రొమాంటిక్ సాంగ్.. రిలీజైన కొద్ది గంటల్లోనే రికార్డుల మోత
టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ సినీ జాతకం అఖండతో మారిపోయినట్టు కనిపిస్తున్నది. తన కెరీర్‌లో సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న ఈ భామకు ప్రస్తుతం తాను చేస్తున్న ప్రాజెక్టులన్నింటికి మంచి పేరు రావడంతో ఆమెకు కరోనా రోజులు కలిసి వస్తున్నాయి. బాలకృష్ణతో నటించిన అఖండ సంచలన విజయం సాధించగా, ఇప్పుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి చేసిన మ్యూజిక్ ఆల్బమ్ భారీగా వ్యూస్ సంపాదించుకొంటున్నది. ఈ మ్యూజిక్ వీడియో వివరాల్లోకి, ప్రగ్యా జైస్వాల్ గురించి వివరాల్లోకి వెళితే..

అఖండతో ప్రగ్యాకు భారీ సక్సెస్
ప్రగ్యా జైస్వాల్ తెలుగులో మిర్చి లాంటి కుర్రాడు, కంచె, ఓం నమో వెంకటేశాయ, గుంటురోడు, నక్షత్రం, జయజానకి నాయక, ఆచారి అమెరికా యాత్ర లాంటి చిత్రాల్లో నటించింది. అయితే కంచె సినిమాలో ఆమె నటనకు మంచి పేరు వచ్చినప్పటికీ.. కెరీర్ పరంగా ప్రగ్యా జైస్వాల్‌కు అదృష్టం కలిసి రాలేదు. తాజాగా బాలకృష్టతో అఖండ చిత్రంతో మంచి సక్సెస్ అందుకొన్నది.

సల్మాన్ ఖాన్ గర్ల్‌ఫ్రెండ్ పాడిన పాటలో
అఖండ తర్వాత బాలీవుడ్‌లో ఏకంగా కండలవీరుడు సల్మాన్ ఖాన్‌తో నటించే అవకాశం దక్కింది. గురు రాంధ్వా, సల్మాన్ ఖాన్ గర్ల్‌ఫ్రెండ్ ఇలియా వాంటర్ జంటగా పాడిన మై చలా అనే పాటలో సల్మాన్ ఖాన్‌తో కలిసి రొమాంటిక్‌గా కనిపించింది. ఈ వీడియో జనవరి 22వ తేదీన రిలీజ్ కాగా.. సోషల్ మీడియా, యూట్యూబ్ ఫ్లాట్‌ఫామ్స్‌లో మోత మోగిస్తున్నది.
అందమైన లొకేషన్లలో రొమాంటిక్‌గా
గురు రాంధ్వా, ఇలియా వాంటర్ జంటగా పాడిన మై చలా అనే పాటను అందమైన లొకేషన్లలో ప్రగ్యా జైస్వాల్, సల్మాన్ ఖాన్‌పై చిత్రీకరించారు. సుందరమైన పర్వత శ్రేణులు, సరస్సు మధ్య ఫుల్ రొమాంటిక్‌గా ఇద్దరు పాటలో లీనమయ్యారు. ఈ పాటకు సంబంధించిన టెక్నికల్ వ్యాల్యూస్ కూడా బ్రహ్మండంగా ఉన్నాయి. ఈ పాటలో గురు రాంధ్వా, ఇలియా వాంటర్ కూడా కనిపించడం విశేషం.

సల్మాన్ ఖాన్ గురించి ప్రగ్యా జైస్వాల్
సల్మాన్ ఖాన్‌తో కలిసి రొమాన్స్ చేయడంపై ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్‌తో పాట అనగానే కంగారు పడిపోయాను. ప్యాన్ ఇండియా స్టార్ లాంటి సల్మాన్ ఖాన్‌తో ఆఫర్ రాగానే ఎగిరి గంటేశాను. సున్నితమైన శృంగారం, సెన్సిబుల్‌గా ఉండే రొమాంటిక్ పాటలో సల్మాన్‌తో కలిసి డ్యాన్స్ చేయడం ఆయనతో నటించాలనే నా కల పూర్తయింది అని ప్రగ్యా జైస్వాల్ అన్నారు.
Recommended Video

22 మిలియన్ల వ్యూస్‌తో వైరల్
సల్మాన్ ఖాన్, ప్రగ్యా జైస్వాల్‌కు సంబంధించిన మై చాలా సాంగ్ రిలీజ్ అయిన వెంటే వేగంగా వ్యూస్ సాధించింది. ఈ వీడియో రిలీజ్ చేసిన కొద్ది గంటల్లోనే మిలియన్ వ్యూస్ సాధించడమే కాకుండా.. గత మూడు రోజుల్లో 22 మిలియన్ల వ్యూస్ సాధించడం విశేషంగా మారింది. ఈ వీడియోకు షబ్బీర్ ఆహ్మాద్ సంగీతం అందించగా, షబీనా ఖాన్, డైరెక్టర్ గిఫ్టీ దర్శకత్వం వహించారు. దర్శకుడు షాబీనా ఖాన్ స్వయంగా సినిమాటోగ్రఫిని అందించడం గమనార్హం.