నేను చచ్చిన తర్వాత గబ్బర్ సింగ్ నిర్మాతనే గర్వం.. పవన్‌తో రిలీజ్ చేయిద్దామని అనుకొన్నా.. బండ్ల గణేష్ ఎమోషనల్
నటుడిగా జీవితాన్ని ప్రారంభించి.. ఆ తర్వాత స్టార్ ప్రోడ్యూసర్‌గా ఎదిగిన బండ్ల గణేష్ చాలా రోజుల మరోసారి ముఖానికి మేకప్ వేసుకొన్నారు. ఈ సారి చిన్న చితక పాత్రకే పరిమితం కాకుండా ఓ భావోద్వేగమైన పాత్రతో పూర్తిస్థాయి లీడింగ్ యాక్టర్‌గా డేగల బాబ్జీ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కన్నానే.. కలగా మిగిలేనే.. అనే లిరికల్ వీడియోను బండ్ల గణేష్ తన కూతురు ద్రిష్టి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ..

ద్రిష్టి చేతుల మీదుగా విడుదలైన పాట ఇదే..
కలలే కన్నానే.. కలగా మిగిలేనే..
కథగా మారిందే..ఎదలోని వ్యధలే..
నను లోకువ చేసి దోబూచులాడిందే..
రారూ.. నీతో ఎవరూ.. చివరకు మిగిలే నీడే ..నీవు.
విధి రాతలే.. విలపించిన కడలల్లే..ఎగసి పడు...
ఈ లిరికల్ వీడియోకు అనూహ్యమైన స్పందన వస్తుంది. ఈ పాటకు అభయ్ జోధ్ పుర్కర్ ఆలపించారు.

తమిళంలో పార్తీబన్ అద్బుతంగా
మా డేగల బాబ్జీ చిత్రానికి సపోర్ట్ చేస్తూ ట్రైలర్, పోస్టర్ ను విడుదల చేసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారికి, హరీష్ శంకర్ గారికి ధన్యవాదాలు. తమిళ్‌లో ప్రముఖ నటుడు పార్థీబన్ చేసిన ఉత్త సిరుప్పు సైజు 7 సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది. ఆ సినిమా హక్కులను తీసుకున్నానని నా మిత్రుడు వెంకట్ చంద్ర చెప్పడం జరిగింది.
తనతో నాకు 20 సంవత్సరాల స్నేహబంధం ఉంది. తెలుగులో స్టార్ హీరోలు ఎవరు చేసినా కూడా ఈ సినిమా చాలా బాగుంటుందనుకొన్నాను. అయితే అనూహ్యంగా ఈ సినిమాలో నన్ను నటించమని చెపితే..నేను యాక్ట్ చేయడమేమిటి.. నేను యాక్టింగ్ మర్చిపోయాను. తమిళ్‌లో పార్థీబన్ అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ చేసిన తను ఎక్కడ.. నేనెక్కడ నేను చేయలేను.. అయినా నేనిప్పుడు సినిమా తీద్దామనుకుంటున్నాను యాక్ట్ చేయనని చెప్పాను అని బండ్ల గణేష్ అన్నారు.

ఒకే గదిలో రెండు గంటల సేపు
అయితే డేగల బాబ్జీ కథ చాలా బాగుందని చెబుతూ నన్ను కన్విన్స్ చేయడంతో.. ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. ఒక రూమ్‌లో ఒక సినిమాని రెండు గంటల సేపు ఒక క్యారెక్టర్ చేయడం అనేది చాలా రిస్క్. అలాంటి కథను నా భుజాన పెట్టి నాతో చేయించాడు. సినిమా చేసే వరకు నాలో గుండె దడ దడ కొట్టుకునేది, భయమేసేది. సినిమా చేసే క్రమంలో నేను చేయగలననే ధైర్యం వచ్చింది. సినిమా అయిపోయిన తర్వాత చూసుకున్న నేనే అక్షర్యపోయాను. నేనేనా ఇలా యాక్ట్ చేసింది అని నాలో నాకే ఆనందంవేసింది. నా జీవితానికి ఒక నటుడిగా ఇది చాలుఅని అనుకున్నాను అని బండ్ల గణేష్ తెలిపారు.

పవన్ కల్యాణ్‌తో గబ్బర్ సింగ్ సినిమా తీసినప్పుడు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో గబ్బర్ సింగ్ సినిమా తీసినప్పుడు ఎంత హాయిగాకాలరెగరేసి తృప్తిగా ఉన్నానో.. నేను చచ్చిపోయిన తర్వాత కూడా గబ్బర్ సింగ్ నిర్మాత అనే గర్వం ఎలా ఉంటుందో. ఈ "డేగల బాబ్జి" చిత్రం కూడా నాకు అంత తృప్తినిచ్చింది. ఈరోజు రిలీజ్ అవుతున్న ఈ పాట చాలా అద్బుతంగా ఉంటుంది. లైనస్ అద్భుతమైన మ్యూజిక్, రీ రికార్డింగ్ ఇచ్చాడు. ఈ సినిమాను ప్రేక్షకులు అందరూ కళ్లార్పకుండా చూస్తారు. అంత అద్భుతంగా వచ్చింది ఈ సినిమా.. బండ్ల గణేష్ అనే వ్యక్తి ఇంత బాగా నటిస్తాడా? అనే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ తర్వాత నాపై గౌరవం పెరుగుతుంది. నటుడిగా ఇలాంటి గౌరవం కోసమే నేను 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను అని బండ్ల గణేష్ అన్నారు.

పూరి జగన్నాథ్ లాగా కన్ఫ్యూజన్ లేకుండా
డేగల బాబ్జీ నిజంగా నా జీవితానికి అర్థం చెప్పే సినిమా ఇది. ఇది భవిష్యత్తులో నేను యాక్ట్ చేస్తానో లేదో తెలియదు. కానీ ఈ సినిమా ద్వారా నా జన్మ ధన్యమైందని అనుకుంటున్నాను. చంద్ర వెంకట్తెలుగు ఇండస్ట్రీ లో మరో గొప్ప దర్శకుడు అవుతాడు. ఒక రీమేక్‌ని అద్భుతంగా మలచి ఇచ్చాడు. ఒక పూరి జగన్నాథ్ లాగా కన్ఫ్యూజన్ లేకుండా స్పీడ్ గా చేశాడు. అద్భుతమైన డైరెక్టర్‌కు ఉండే లక్షణాలు అన్నీ తనకు ఉన్నాయి. ఒక నేషనల్ అవార్డు వచ్చిన ఈ సినిమాను తెలుగులో చేయడానికి ఎవరూ సాహసించరు. కానీ.. ఆ సినిమాను తీసుకొని నాతో యాక్ట్ చేయించడం ఒక ఎత్తు. కచ్చితంగా ఈ సినిమాను జనాలు నీరాజనాలు పడతారు.
Recommended Video

నా బాస్‌తో రిలీజ్ చేయిద్దామని అనుకొన్నా
ఇప్పటి వరకు నన్ను ఆదరించినట్టే.. మీరందరూ డేగల బాబ్జీ సినిమాను విపరీతంగా ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను. ఈ సాంగ్ తర్వాత ఆశీర్వచనాలు, ఆశీస్సులు, మీ ప్రశంసలు నన్ను ఎంతో ముందుకు నడిపిస్తాయి. ఈ సినిమాను మా బాస్‌తో ఓపెన్ చేయిద్దాం అన్నారు. కోవిడ్ సమయంలో వారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు వారందరి ఆశీర్వాదాలు నాకు ఎప్పుడు మెండుగా ఉంటాయని వద్దన్నాను.
అలాగే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క హీరో ఆశీస్సులు, దర్శకుల ఆశీస్సులు తెలుగు ప్రేక్షకుల అభిమానం నాపై నాకు ఎప్పుడూ ఉంటాయి. ఈ రోజు దేవత లాంటి పసిబిడ్డ ద్రిష్టితో ఈ సాంగ్‌ని విడుదల చేస్తున్నాం. త్వరలో వస్తున్న ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి మీ అందరి అభిమానం పొందుతూ ఈ సినిమా దర్శకుడికి, నాకు మంచి పేరు వస్తుందనే నమ్మకం ఉంది అని బండ్ల గణేష్ అన్నారు.


Click it and Unblock the Notifications











