twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    SP Balu చివరిపాట.. ట్విట్టర్‌లో రజనీకాంత్ ఎమోషనల్.. కలలో కూడా ఊహించలేదంటూ

    |

    సంగీత ప్రపంచానికి దిగ్గజ గాయకుడు, స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అందించిన సేవలం అద్భుతం, అపురూపం. వెలకట్టలేనివి. దాదాపు 5 దశాబ్దాలకుపైగా తన కెరీర్‌లో వేలాది పాటలు పాడారు. ఎంతో మంది నటులకు, సూపర్ స్టార్లకే గాత్రధానం చేశారు. అయితే ఊహించిన విధంగా ఎస్పీ బాలు మన నుంచి దూరమై తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం విషాదకరంగా మారింది. ఇటీవలే బాలు ప్రథమ వర్ధంతి రోజున పలువురు ఘన నివాళి అర్పించారు. అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన చివరి పాట రజనీకాంత్ నటిస్తున్న అన్నాతే చిత్రం కోసం గమనార్హం. అయితే తన చివరి పాటను అన్నాతే సినిమా కోసం పాడటంపై సూపర్ స్టార్ రజనీకాంత్ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా రజనీకాంత్ ట్వీట్ చేసి ఎస్పీ బాలుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు.

    ఎన్నాతే సినిమాలో పాట గురించి స్పందిస్తూ.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చివరి పాట నా సినిమా అన్నాతేకు అవుతుందని కలలో కూడా ఊహించలేదు. నా సినీ కెరీర్ మొత్తం అంటే 45 సంవత్సరాలపాటు నా గొంతుగా మారారు. ఆయన గొంతులోనేనేనుజీవించారు. అన్నాతే చిత్రంలో నా కోసం ఓ పాట పాడారు. అదే చివరిది అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఆయన మధురమైన గొంతుతో చిరకాలం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జీవిస్తారు అని రజనీకాంత్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    Rajinikath emotional about SP balasubrahmanyams last song for Annathe

    ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కెరీర్ విషయానికి వస్తే.. ప్రముఖ సంగీత దిగ్గజం ఎస్పీ కోదండపాణి శిష్యరికంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం 1966లో డిసెంబర్ 15 తేదీన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత తమిళ, కన్నడ, మలయాళ, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు పాడారు. 1981లో ఏక్ దూజే కే లియే చిత్రానికి ఆయనకు జాతీయ అవార్డు లభించింది. 1983లో సాగర సంగమం, 1986లో స్వాతిముత్యం, 1988లో రుద్రవీణ చిత్రాలకు జాతీయ అవార్డులు అందుకొన్నారు.

    ఇక రజనీకాంత్ నటిస్తున్న అన్నాతే చిత్రం విషయానికి వస్తే.. తమిళ సూపర్ స్టార్‌ అజిత్‌తో వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం సినిమాలు రూపొందించిన సిరుతాయి శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మీనా, కుష్బూ, ప్రకాశ్ రాజ్, కీర్తీ సురేష్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తీ సురేష్ రజనీకాంత్ కూతురిగా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

    English summary
    I never dreamed that this would be the last song he would sing to me during the filming of the song that SBP, who has lived as my voice for 45 years, sang for me in the movie Annatte. My love SBP will live on forever through her sweet voice.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X