ఈ ఏడాది ఎంతో గొప్పగా గడిచింది.. పాటలపై రామజోగయ్య శాస్త్రి కామెంట్స్
రామ జోగయ్య శాస్త్రి పాటలు ఈ ఏడాడి ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. తెలుగులో బిజీగా ఉన్న పాటల రచయితల లిస్ట్ తీస్తే అందులో రామజోగయ్య శాస్త్రి ముందు వరుసలో ఉంటాడు. ఆయన రాసిన ప్రతీ పాట బ్లాక్ బస్టర్ హిట్టే అవుతోంది. మిలియన్ల వ్యూస్ కొల్లగొడుతూ దూసుకుపోతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా రామ జోగయ్య శాస్త్రి క్రియేట్ చేసిన బుట్ట బొమ్మ మాత్రం ఖండాంతరాలు దాటేసింది.
ఈ ఏడాది మొత్తం రికార్డులన్నీ కూడా బుట్టబొమ్మ ఖాతాలోనే పడ్డాయి. అది కాకుండా మగువా మగువా అనే పాట కూడా అద్భుతమైన స్పందనను దక్కించుకుంది. సరిలేరు నీకెవ్వరు సినిమాలోని సూర్యుడివో చంద్రుడివో అనే పాట కూడా బాగానే క్లిక్ అయింది. ఇక డబ్బింగ్ సినిమా అయినా సరే రామజోగయ్య శాస్త్రి తెలుగు లిరిక్స్ రాస్తే అది సూపర్ హిట్ ఆల్బమ్ అవ్వాల్సిందే.

కేజీయఫ్ ఆడియో అంతగా హిట్ అయిందంటే అందుకు రామ జోగయ్య లిరిక్స్ కూడా ఓ కారణం. అలా ఈ సారి ఆకాశం నీ హద్దురా చిత్రంలో రాసిన పిల్లా పులి అనే పాట రికార్డ్ వ్యూస్ కొల్లగొట్టింది. రీసెంట్‌గా రిలీజైన క్రాక్ కోరమీసం పోలీసోడా అనే పాట తెగ వైరల్ అయింది. ఆచార్య, వకీల్ సాబ్, కేజీయఫ్ చాప్టర్ 2 ఇంకా ఇలా ఎన్నో పాటలున్నాయని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ ఏడాది తనకు గొప్పగా గడిచిందంటూ పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











