రకుల్ ప్రీత్ సింగ్ కోసం రానా దగ్గుబాటి.. ఏడు రంగుల ఓ ఇంద్ర ధనసులా అంటూ..
దక్షిణాది అగ్ర హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ హీరోగా నటించిన త్రిశంకు చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈచిత్రంలో ప్రాచీ తెహ్లాన్, రష్మీ గౌతమ్ హీరోయిన్లుగా నటించారు. సుమన్ మహేస్ ఆచంట, నవీన్ రెడ్డి కీలక పాత్రల్లో కనిపించారు. ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి దర్శకుడిగా శ్రీ కృష్ణ గోర్లే, నిర్మాతలుగా లండన్ గణేష్, నల్లా అయ్యన్న నాయుడు వ్యవహరించారు.
ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తొలి లిరికల్ సాంగ్‌ను టాలీవుడ్ భళ్లాలదేవ రానా దగ్గుబాటి ఆవిష్కరించారు. ఈ సినిమాలోని ఏడు రంగుల ఓ ఇంద్ర ధనుసులా అనే పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రాహుల్ సిప్లిగంజ్ పాటను పాడగా, భాష్య శ్రీ సాహిత్యాన్ని అందించారు. సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందించారు.

ఈ సందర్భంగా దర్శకుడు కృష్ణ గోర్లే మాట్లాడుతూ.. త్రిశంకు అనే సినిమాకు దర్శకత్వం వహించే బాధ్యతను, గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్. ఈ సినిమా కథ, కథనాలు బాగా ఉంటాయి. ప్రతీ క్యారెక్టర్ అద్భుతంగా వచ్చాయి. ఈ పాటను ఆవిష్కరించిన రానా దగ్గుబాటికి ధన్యవాదాలు అని అన్నారు.
నిర్మాతలు లండన్ గణేష్, నల్ల అయ్యన్న నాయుడు మాట్లాడుతూ.. డైరెక్టర్ శ్రీ కృష్ణ చెప్పిన కథ చాలా ఇంప్రెసివ్‌గా ఉండటంతో ఈ సినిమాను నిర్మించాం. కథ చెప్పినట్టుగానే తెర మీద సినిమా కూడా బాగా వచ్చింది. రానా దగ్గుబాటికి ధన్యవాదాలు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్నీ వివరాలు వెల్లడిస్తాం అని అన్నారు.


Click it and Unblock the Notifications











